అనుదిన మన్నా
మీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి క్రియాత్మక పద్ధతులు
Thursday, 14th of March 2024
1
0
818
Categories :
ప్రార్థన (Prayer)
ప్రార్థనలో గడిపిన సమయం ఎప్పుడూ సమయం వృధా కాదు కానీ సమయం ఇవాల్సివస్తుంది. తినడం మరియు త్రాగడం లాగా ప్రార్థన మన దినచర్యలో ఒక భాగం కావాలి. ఇది ఒక ఎంపికగా లేదా చివరి ప్రయత్నంగా పరిగణించకూడదు. దేవుని రాజ్యంలో మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రార్థన చాలా ముఖ్యమైనది.
ఇంకా మనలో చాలా మంది ఎక్కువ పని అనుసూచి, కుటుంబ కట్టుబాట్లు మొదలైన కారణాల వల్ల ప్రార్థనలో ఇబ్బంది పడుతున్నారు. ఇది నిజంగా విసుగు తెప్పిస్తుందని నాకు తెలుసు. అయితే కొంతమంది దగ్గర సమయం ఉంది అయినా కూడా సమయాన్ని వెచ్చించలేని స్థితిలో వారు ఉన్నారు; కొందరికి ప్రార్థన చేయాలని అనిపించదు.
మీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీకు ఉపయోగపడే కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి.
#1 నిద్రించడానికి ఒక నిర్ణీత సమయం మరియు నిద్ర మేల్కొలపడానికి ఒక నిర్ణీత సమయాన్ని కలిగి ఉండండి
నిర్ణీత సమయంలో నిద్రపోవడం చాలా మంచిది. మీరు ప్రతి రాత్రి ఒక నిర్ణీత సమయానికి నిద్రపోగలిగితే, మీరు సహజంగానే ప్రతి ఉదయం కూడా నిర్ణీత సమయానికి మేల్కొంటారు. ఇదంతా స్థిరంగా ఉండటం గురించి మాట్లాడుతుంది.
నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా (కీర్తనలు 4:8)
అంతే కాకుండా, మీరు నిర్ణీత సమయానికి పడుకుని, నిర్ణీత సమయానికి లేచినట్లయితే, మీ శరీర గడియారం సెట్ అవుతుంది, మీకు పగటిపూట సోమరితనము మరియు అలసట అనిపించదు మరియు ముఖ్యంగా, మీ ప్రార్థన సమయంలో మీరు అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి బాగా నిద్రపోండి మరియు అప్పుడు మీరు తక్కువ ఒత్తిడికి గురవుతారు, మరింత శక్తివంతంగా ఉంటారు మరియు ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇది మీ జీవితానికి కొంత క్రమాన్ని తెస్తుంది, నేటికి చాలా మంది జీవితంలో ఇది లేదు.
#2 మీ ఫోన్‌ని మీతో పాటు పడుకోవడానికి తీసుకెళ్లకండి.
ఒక పరిశోధన ప్రకారం, మన ఫోన్‌లు విడుదల చేసే నీలి కాంతి మన నిద్ర విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే, నిద్రపోయే ముందు తమ బెడ్‌పై ఉన్నప్పుడు సోషల్ మీడియాను చెక్ చేస్తూనే ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల మనం నిద్రపోయే సమయం కూడా ఆలస్యం అవుతుంది.
#3 ప్రార్థనతో మీ రోజును ప్రారంభించండి మరియు ప్రార్థనతో మీ రోజును ముగించండి
ఎవరో ఇలా అన్నారు, "ప్రార్థన రోజును ప్రారంభించే తాళపు చెవి, మరియు ప్రార్థన రాత్రికి తాళం." మీరు ప్రార్థనతో రోజును ప్రారంభించినప్పుడు, రోజంతా ఆయన మార్గదర్శకత్వం మీరు ఖచ్చితంగా పొందగలరు. మీరు ఈ లేఖనాన్ని వాస్తవికతను మీరు చూస్తారు: "నేను నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను" (కీర్తనలు 32:8)
మీరు ప్రార్థనతో మీ రోజును ముగించినప్పుడు, కలలు మరియు దర్శనాలతో ప్రభువు మీతో మాట్లాడతారని మీరు ఖచ్చితంగా హామీ పొందుకోవచ్చు.
దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును
అయితే మనుష్యులు అది కనిపెట్టరు
మంచము మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు
కలలో రాత్రి కలుగు స్వప్నములలో
ఆయన వారి చెవులను తెరవచేయును
వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. (యోబు 33:14-16)
#4 ప్రార్థన సమయంలో, దయచేసి మీ ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో ఉంచండి లేదా ఇంకా మంచిది అనిపిస్తే, దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి
35 ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. 36 సీమోనును అతనితో కూడ నున్న వారును ఆయనను వెదకుచు వెళ్లి, 37 ఆయనను కనుగొని, "అందరు నిన్ను వెదకుచున్నారని" ఆయనతో చెప్పగా (మార్కు 1:35-37)
అందరూ యేసయ్య కోసం వెతుకుతున్నారు, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. అదే మన కాలంలో అయితే, "యేసు ప్రభువా, నేను నిన్ను కనుగొనలేకపోయాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది" అని సీమోను పేతురు చెప్పి ఉండేవాడని నేను నమ్ముతున్నాను. నేను చెప్పదలచుకున్నది మీరు పొందుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను.
ఈ సూచనలను అమలు చేయండి మరియు మీ జీవితంలో మరియు ఆధ్యాత్మిక వృద్ధిలో మీరు గుర్తించదగిన వ్యత్యాసాన్ని చూస్తారు. షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ సందేశాన్ని ఎవరితోనైనా పంచుకోండి.

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నీ మార్గాలను నాకు బోధించుము, నేను నీ సత్యంలో నడుస్తాను. యేసు నామంలో.
ధన్యుడగు పరిశుద్దాత్మ, యేసయ్య ప్రార్థించినట్లుగా నాకు ప్రార్థించడం నేర్పుము. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు● మీ పూర్తి సామర్థ్యాన్నికి చేరుకొనుట
● దేవుడు ఎంతో ప్రేమించి ఆయన అనుగ్రహించెను
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● కలుసుకోవడం యొక్క సామర్థ్యం
● ఘనత మరియు గుర్తింపు పొందుకొనుట
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #3
కమెంట్లు