english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము
అనుదిన మన్నా

ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము

Saturday, 16th of March 2024
0 0 1250
Categories : అప్పు (Debt)
కరుణ సదన్ పరిచర్యలో, మేము ప్రతిరోజూ వందల కొద్ది ప్రార్థన విన్నపములను అక్షరాలా పొందుకుంటున్నాము. ఈ ప్రార్థన విన్నపములు చాలా వరకు ఆర్థిక సమస్యలకు సంబంధించినవి. క్లిష్ట సమయంలో జీవిస్తున్నాము, కానీ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. (కీర్తనలు 46:1)

నేను ప్రజలతో మాట్లాడినప్పుడల్లా, ప్రజలు ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము కోసం చూస్తున్నారని నేను తరచుగా వింటుంటాను. ఇప్పుడు మీ ఆర్థిక విషయాలలో దేవుడు కలుగ జేసుకోవడం అనేది నమ్మడం బైబిలు సంబంధమైనది - దానిలో తప్పేమి లేదు. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు తమ ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యాన్ని కోల్పోతారు ఎందుకంటే వాటిని ఎలా పొందుకోవాలో వారికి తెలియదు. దయచేసి వివరించడానికి నాకు సమయం ఇవ్వండి.

#1 ఎల్లప్పుడూ ప్రభువు వైపు చూడండి
మీరు ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము కోసం ప్రార్థించినప్పుడల్లా, మీరు ఆశ్చర్యకార్యము కోసం ప్రభువు వైపు మరియు కేవలం ఆయన వైపు మాత్రమే చూడాలి.

శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు. (యాకోబు 1:17)

#2 ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము అంటే దైవికమైన మార్గనిర్దేశం 
కీర్తనలు 32:8లో, "నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను" అని ప్రభువు చెప్పాడు. అది వృత్తి లేదా పెట్టుబడి అవకాశం లేదా ఏదైనా నిర్ణయం కావచ్చు, ప్రభువు నుండి ఒక్క వాక్యము మీ దిశను మార్చగలదు.

ఆదికాండము 26లో, దేశంలో కరువు వచ్చింది, ఇస్సాకు దేశం విడిచి పోవాలనుకున్నాడు. అదే సమయంలో ప్రభువైన దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు: "ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వ దించెదను"(ఆదికాండము 26:3)

ఆదికాండము 26:12-13 మనకు ఇలా చెబుతోంది, "ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను"

దేవుని నుండి ఈ మార్గనిర్దేశం స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా, దేవుని దాసుని నుండి లేదా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కూడా రావచ్చు.

#3 ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము అంటే మీ ఆర్థిక స్థితిపై శత్రువు యొక్క బలమైన కోటలను తొలగించడం.
మీరు యోబు పుస్తకాన్ని చదివినట్లైతే, దుష్టుడు యోబు మీద ఎలా దాడి చేసి అతన్ని దరిద్రంలోకి తీసుకెళ్లాడో మనం చూడగలము. (యోబు 1 చదవండి) దుష్ట శక్తుల కారణంగా తీవ్ర నష్టాలను, దరిద్రాన్ని అనుభవించే వారు చాలా మంది ఉన్నారు. ఎంత కష్టపడినా మార్పు అనేది కనిపించడం లేదు.
అది మీరు గనక అయితే, మీరు ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా దుష్టుని యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయాలి.

మనం కలిసి ప్రార్థించినప్పుడు దేవుని శక్తి ఎల్లప్పుడూ తీవ్రమవుతుంది. (లేవీయకాండము 26:8)

మీరు 00:00 గంటల నుండి 14:00 గంటల వరకు ఉపవాసం చేయవచ్చు. మీరు చేయగలిగితే, మీరు మీ ఉపవాసాన్ని 15:00 గంటల వరకు కొనసాగించవచ్చు. 

మనము ప్రతి మంగళవారం/గురువారం/శనివారం సాయంత్రం 06:30 నుండి ఆత్మతో కూడిన సమయం కోసం YouTubeలో కలుసుకుందాము. 
ప్రార్థన

తండ్రీ, నా ఆర్థికపరమైన స్థితిపై నీ చేయిని చాపు. భాగ్యమును సంపాదించుకునే సామర్థ్యాన్ని నీవు మాకు కలుగజేసావని నీ వాక్యం సెలవిస్తుంది. కావున, ప్రభువా నన్ను వర్ధిల్లజేయగల నీ సామర్థ్యముపై నేను విశ్వసిస్తున్నాను. యేసు నామంలో, ఆమేన్. 



Join our WhatsApp Channel


Most Read
● యుద్ధం కొరకు శిక్షణ
● ప్రభువు యొక్క సలహా చాలా అవసరము
● సరైన అన్వేషణను వెంబడించడం
● మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?
● మీ సన్నిహిత్యాని కోల్పోకండి
● ఆధ్యాత్మిక తలుపులను మూసివేయడం
● రహదారి లేని ప్రయాణము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్