english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - II
అనుదిన మన్నా

దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - II

Monday, 18th of March 2024
0 0 1351
Categories : పాపం (Sin)
నేను నిన్న చెప్పినట్లుగా, తండ్రులు బలి అయిన పాపాలతో తర తరాలను ప్రలోభపెట్టే అధికారయుక్తమైన దోషము అనే హక్కును దుష్టునికి కలుగజేస్తుంది. 

దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని,
ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. (కీర్తనలు 18:23)

దేవుడు తన ప్రార్థనలకు జవాబిస్తాడనే నమ్మకం దావీదుకు ఉంది, ఎందుకంటే అతడు తనపై పని చేస్తున్న దోష శక్తికి లొంగిపోలేదు. మీరు గమనించండి, దోషము అనేది ఒక నిర్దిష్ట బలహీనత వైపు 'మొగ్గు' చూపడము.

అతని కుటుంబ వంశంలోని దోష ఫలితంగా దావీదు యొక్క శోధన అతనిని వెనక్కి లాగింది. దావీదు, ఈ సమయంలో ప్రభువుతో తన సన్నిహిత సంబంధం కారణంగా ఈ శోధనల శక్తిని తట్టుకున్నాడు.

ఇప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఒక వ్యక్తిపై దోషము యొక్క శక్తి విఛ్చిన్నం అయినప్పుడు, అతడు శోదించబడడని దీని అర్థం కాదు. శోధనకు లోగిపోకుండా ఉండే శక్తి మనకు ఉంటుందని దీని అర్థం.

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. (రోమీయులకు 6:14)

మీరు యేసుక్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించినప్పుడు, మీరు కృపకు లోనైనవారు. ఒక నిర్దిష్ట పాపానికి 'వద్దు' అని చెప్పడానికి కృప ఇప్పుడు మీకు శక్తినిస్తుంది. ఇప్పుడు మీరు పాపం యొక్క అధికారంలో లేరు, కానీ కృప మీ మీద ప్రభుత్వము చేస్తుంది.

మీరు గమనించండి, యేసయ్య ఏ పాపం చేయలేదు, ఆయన రక్తబంధంలో ఎలాంటి దోషము లేదు మరియు అయినప్పటికీ ఆయన సమస్త విషయములలో శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉండెను. (హెబ్రీయులకు 4:15 చదవండి). పాప స్వభావానికి చిహ్నము మనకు వ్యతిరేకంగా పని చేసే శోధన కాదు కానీ శోధనకు వద్దు అని చెప్పలేకపోవడం.

దోషము చేసే రెండవ విషయం అది మన గుర్తింపును రూపొందిస్తుంది; మన అంతర్గత ఆలోచనలు, నా గురించి నేను ఆలోచించే విధానం. సరైన గుర్తింపు ఉంటే దేవుడు మన గురించి చెప్పేది నమ్ముతుంది. సమస్య ఏమిటంటే, దోషము మనపై మన నమ్మక పద్దతిని రూపొందిస్తుంది.

రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను. 3 వారు సైన్యముల కధిపతియగు యెహోవా, 
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని 
గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా

నేను అయ్యో, "నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని."

అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి

ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము అనెను. (యెషయా 6:1-8)

యెషయా తనను తాను పాపాత్మునిగా, అయోగ్యునిగా చూసుకున్నాడు. యెషయా తన దోషము పట్ల పరలోకము నుండి అగ్నితో శుద్ధి చేయబడినప్పుడు, రెండు విషయాలు జరిగాయి.

1. అతడు ప్రభువు యొక్క స్వరమును వినగలిగాడు మరియు
2. ప్రభువు పిలుపుకు ఉద్రేకంతో జవాబివ్వు ఇచ్చాడు (ఇదిగో నేను ఉన్నాను. నన్ను పంపుము)

దోషము మరియు దాని ప్రభావాలు ఆధ్యాత్మికంగా ఏమి జరుగుతుందో గ్రహించకుండా మనలను నిరోధిస్తుంది. దేవుడు మన గురించి నిజంగా ఏమి భావిస్తున్నాడో మనకు అనిపించదు.

యెషయా యొక్క దోషం తొలగిపోయినప్పుడు, అతనికి అయోగ్యమైన భావన లేదు. అతడు ఇకపై తనను తాను అయోగ్యమైన పాత్రగా చూడడు. అతనికి ఇప్పుడు కొత్త గుర్తింపు వచ్చింది. దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తాడో మనల్ని మనం ఆ విధంగా చూస్తాము.
ఒప్పుకోలు

యేసు నామంలో నా కుటుంబ రక్తసంబంధం మీద, నా వివాహం మరియు ఇతర సంబంధాల మీద చెడు ప్రభావాన్ని చూపిన ప్రతి భక్తిహీన ప్రవర్తనలు, మాట్లాడే మాటలు, ఆలోచనలు మరియు ప్రతికూల భావోద్వేగాలను నేను అంగీకరిస్తున్నాను మరియు క్షమించమని వేడుకుంటున్నాను.


నేను ఇతరులపై లేదా ఇతరులతో మాట్లాడే ప్రతి భక్తిహీనమైన పదాల గురించి పశ్చాత్తాపపడుతున్నాను. నేను ప్రతి వ్యక్తిని అపరాధ భావము నుండి విడుదల చేస్తున్నాను మరియు పగ తీర్చుకునే నా హక్కులను వదులుకుంటున్నాను, ఎందుకంటే పగ తీర్చుకొనుట ప్రభువు పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది.


తండ్రీ, నాకు మరియు నా కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తున్న దురాశ మరియు లోభము మరియు స్వావలంబన యొక్క సమస్త శక్తులను నిర్మూలించబడును గాక. దేవుని పనికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ ఇష్టపడే హృదయాన్ని నాకు దయచేయి.


Join our WhatsApp Channel


Most Read
● నిరాశను నిర్వచించడం
● ప్రేమ - విజయానికి నాంది - 2
● వ్యసనాలను ఆపివేయడం
● ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
● కాముకత్వం మీద విజయం పొందడం
● 07 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ గురువు (బోధకుడు) ఎవరు - II
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్