english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం
అనుదిన మన్నా

యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం

Thursday, 21st of March 2024
0 0 988
Categories : భయం (Fear)
"మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును." (మత్తయి 10:32-33)

మనుష్యుల ముందు యేసు యొక్క అధికారమును ఒప్పుకోవడం సిగ్గు మరియు భయానికి సంబంధించిన విషయం కాదు. అయినప్పటికీ, చాలా మంది క్రైస్తవులు మనుషుల భయంతో యేసుక్రీస్తును తమ ప్రభువుగా మరియు రక్షకుడిగా బహిరంగంగా అంగీకరించడానికి భయపడుతున్నారు.

యేసయ్య కాలంలో కూడా, చాలా మంది ఆయనను మెస్సీయ అని విశ్వసించారు, అయితే వారు తమ అధికారాన్ని కోల్పోతారనే భయంతో లేదా యూదు మతము నుండి బహిష్కరించబడతారేమో అనే భయంతో ఆయనను బహిరంగంగా అంగీకరించడానికి భయపడ్డారు.

ఉదాహరణకు: పుట్టుకతో అంధుడైన ఒక వ్యక్తి యేసయ్య చేతి ద్వారా చూపును పొందాడు. అతడు తమ కుమారుడా కాదా అని గుర్తించమని తల్లిదండ్రులను అడిగినప్పుడు, వారు ఇలా బదులిచ్చారు, " వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి." (యోహాను 9:20-21)

వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. కావున వాని తలిదండ్రులు, "వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి." (యోహాను 9:22-23)

బైబిలు మనకు ఇంకా ఇలా సెలవిస్తుంది, "అయినను అధికారులలో కూడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు." (యోహాను 12:42)

యేసుక్రీస్తును తమ ప్రభువు మరియు రక్షకునిగా ప్రజలు ఎందుకు బహిరంగంగా ఒప్పుకొనరు?
బైబిలు ఇలా చెబుతోంది, "వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి." (యోహాను 12:43). అనేక సార్లు, దేవుని మెప్పు కంటే మానవ మెప్పు ముఖ్యమైనదిగా అనిపించినప్పుడు, యేసుక్రీస్తును తమ ప్రభువు మరియు రక్షకునిగా బహిరంగంగా ఒప్పుకొనడంలో ప్రజలు విఫలమవుతారు.

ఇతరుల నిరాకరణకు మనం ఎందుకు భయపడతాం?
బైబిలు దీనిని "మనుష్యుల భయం" అని పిలుస్తుంది. మనం చర్య తీసుకోవలసి వచ్చినప్పుడు మానవుని భయం మనల్ని కదలనీయకుండా చేస్తుంది మరియు మనం మాట్లాడవలసి వచ్చినప్పుడు మనల్ని మౌనంగా ఉంచుతుంది.

"భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును" (సామెతలు 29:25). ఇక్కడ "ఉరి (వల)" అనే హీబ్రూ పదం జంతువులను లేదా పక్షులను పట్టుకోవడానికి ఉపయోగించే వల వేటగాళ్లను సూచిస్తుంది. వలలు ప్రమాదకరమైనవి, మరియు మనల్ని మనం విడిపించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.

మంచి శుభవార్త ఏమిటంటే, మనలను మనుష్యుల భయం నుండి విడిపించే శక్తి దేవునికి ఉంది, తద్వారా ఆయన తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ త్యాగం ద్వారా మనకు అందించిన స్వతంత్రములో మనం భద్రముగా మరియు సురక్షితంగా జీవించగలము.

#1: మీ జీవితంలో మనుష్యుల భయాన్ని మీరు గుర్తించిన వెంటనే, దానిని దేవుని పట్ల ఒప్పుకొని పశ్చాత్తాపపడండి.

#2: "నుమనుష్యులకు కాదు దేవునికే మనము లోబడవలెను గదా" (అపొస్తలుల కార్యములు 5:29). లోబడే దానిని ధైర్యం అని అంటారు. ధైర్యం అంటే భయం అనే భావోద్వేగం లేకపోవడమే కాదు, మనకు ఏది అనిపించినా దానికి కట్టుబడి ఉండాలనే సంకల్పం.

#3: ధైర్యంగా మరియు నిర్భయంగా యేసుక్రీస్తును ప్రతి సమయాలలో అన్ని ప్రదేశాలలో ప్రకటించడానికి కృప మరియు శక్తికై ఆయనను వేడుకొనుడి.
ఒప్పుకోలు
నేను దేవునికి తప్ప మనుష్యులకు భయపడను. ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు మరణించెను, మరియు ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడు. అందుచేత నేను యేసయ్యను ప్రతి సమయంలో సమస్త ప్రదేశాలలో పైకి లేవనెతుత్తాను.


Join our WhatsApp Channel


Most Read
● జ్ఞానుల నుండి నేర్చుకోవడం
● 03 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఆధ్యాత్మిక మహా ద్వారము యొక్క రహస్యాలు
● 27 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అగాపే ప్రేమలో ఎదుగుట
● మంచి నడవడిక నేర్చుకోవడం
● 19 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్