english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అంతిమ రహస్యము
అనుదిన మన్నా

అంతిమ రహస్యము

Saturday, 23rd of March 2024
1 0 792
Categories : సంసిద్ధత (Preparation)
ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి యెదుటికి వానిని రప్పించును. (సామెతలు 18:16)

మీ ఉత్తమ స్నేహితుడు ప్రపంచంలోనే గొప్ప క్రీడాకారుడు లేదా సాకర్ ఆటగాడిగా ఉండే నైపుణ్యంతో జన్మించాడని ఒక్కసారి ఊహించుకోండి. అతడు ప్రపంచ స్థాయి క్రీడాకారుడు లేదా ప్రపంచ ప్రఖ్యాత సాకర్ ఆటగాడు కావాలనేది దేవుని చిత్తమని దేవుని దాసులు మరియు దాసీల నుండి అతడు ప్రవచనాత్మక మాటలను కూడా పొందుకున్నాడు.

ఇప్పుడు అతడు తన యుక్తవయస్సు మరియు కళాశాల సంవత్సరాలలో ఎక్కువ భాగం వీడియో గేమ్‌లు ఆడటం లేదా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ మంచం మీద కూర్చున్నట్లు చిత్రికరించుకోండి.

కానీ "ముప్పై" సంవత్సరాల ముగింపు నాటికి, మీ స్నేహితుడికి కోరికలు మరియు నిట్టూర్పులు మాత్రమే ఉన్నాయి. ఏదో ఒకవిధంగా, "విధి" తప్పిపోయింది, మరియు పశ్చాత్తాపం ఇప్పుడు లేదు ఆధిపత్యం లేదు! ఏదైనా తప్పిపోయిందా? లేదు. ఈ చిత్రీకరణలో ఒక మూలకం మాత్రమే కనిపించడం లేదు - అదే సంసిద్ధత (సన్నాహకము).

చాలా మంది అపొస్తలుడైన పౌలును ఇప్పటివరకు జీవించిన గొప్ప అపొస్తలుడిగా భావిస్తారు. పౌలు విశ్వాసాన్ని అంత గొప్పగా చేసింది ఏమిటి? అతని మార్పిడి యొక్క అనుభవం తరువాత అతని సన్నాహకము యొక్క రహస్యము దాగి ఉంది.

ఆయనను నాయందు బయలు పరపననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రతింపలేదు. నాకంటె ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్లను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. (గలతీయులకు 1:16-17)

పౌలు మార్పు చెందిన వెంటనే అరేబియా దేశానికి వెళ్లాడని పై లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. చాలా మంది బైబిలు పండితులు అతడు అక్కడ మూడు సంవత్సరాలు ప్రభువును వెదకడం మరియు లేఖనాలను అధ్యయనం చేయడం కోసం గడిపాడని సూచిస్తుంటారు. 

ఈ సమయంలోనే ప్రభువు పౌలుకు ఈనాటికీ మనలను ప్రభావితం చేసే అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించడం ప్రారంభించాడు.

(ఒక సారి, దాని గురించి ఆలోచించండి) వారు సంవత్సరాలు వృధా చేయలేదు, కానీ సంవత్సరాల తరబడి సన్నాహకములో ఉన్నారు, తద్వారా అతడు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు, అతడు తన మానవ మనస్సు నుండి కాకుండా ప్రత్యక్షత నుండి మాట్లాడాడు. అతడు వాస్తవంగా ప్రభువు కోసం దేశాలను కదిలించాడు.

గ్రామీణ భారతదేశంలో జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పేదరికంలో నుండి కొంతమంది ప్రతిభావంతులైన మరియు మహాత్ములైన వ్యక్తులు తమ పరిసరాలలో ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చిన విధిని సాధించడానికి ఎల్లప్పుడూ అసాధ్యమైన అసమానతలకు వ్యతిరేకంగా ఎదగగలిగారు. వారు కేవలం అదృష్టవంతులని మీరు అనవచ్చు.

అదృష్టవంతులు అనే విషయం లేదిక్కడ. సన్నాహకము విధిని కలుసుకునప్పుడు మాత్రమే అనుకూలత (కృప) ఉత్పనమవుతుంది.

నిజమైన విజయం అనేది ఒక నిర్దిష్ట దినాన జరిగే సంఘటన లేదా మరి ఏదైనా కాదు. నిజమైన విజయం అనేది సన్నాహకముతో కూడిన ప్రక్రియ యొక్క పరాకాష్ట. మీరు మీ అనుకూల దినం కోసం సిద్ధమవుతున్నారా?

మనం అపొస్తలుడైన పౌలు ఉదాహరణను అనుసరించడం నేర్చుకోవాలి మరియు దేవునితో ఒంటరిగా నిశ్శబ్దమైన, సన్నిహిత సమయాన్ని విలువైనదిగా పరిగణించాలి. దేవుడు మనకొరకు కలిగి ఉన్న గొప్ప పిలుపు కోసం ఇది మనల్ని ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా సిద్ధం చేస్తుంది.

బహుశా ప్రభువు మీ కోసం గొప్ప పరిచర్యను కలిగి ఉండవచ్చు, బహుశా ఒక వ్యాపారాన్ని కలిగి ఉండవచ్చు. బహుశా మీరు గొప్ప సంగీత విద్వాంసుడు, గొప్ప క్రీడాకారిణి మొదలైనవారు కావాలనే ఉద్దేశ్యంతో ఉండవచ్చు. ఇదంతా సన్నాహకముతో ప్రారంభమవుతుంది. ఇప్పుడే సిద్ధం అవ్వడం ప్రారంభించండి.

ప్రార్థన
ప్రేమగల తండ్రీ, అనుకూలమైన రోజు కోసం నన్ను నేను బాగా సంసిద్ధపరచుకోవడానికి నాకు జ్ఞానాన్ని మరియు అవగాహనను దయచేయి. యేసు నామంలో ప్రతిరోజూ నీ సన్నిధి నన్ను ప్రోత్సహిస్తూ మరియు బలపరచను గాక. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3
● మానవుని హృదయం
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #2
● విశ్వాసం యొక్క సామర్థ్యము
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
● దేవుని కృపకై ఆకర్షితులు కావడం
● అపరాధ యొక్క ఉచ్చు నుండి విడుదల పొందడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్