english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం
అనుదిన మన్నా

దేవుని కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండడం

Wednesday, 27th of March 2024
0 0 842
Categories : అభిషేకం (Anointing) దాహం (Thirst) దీనమనస్సు (Humility)
వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి, "నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని" చెప్పగా ఎలీషా, "నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను." (2 రాజులు 2:9)

దేవునిలో ఎక్కువ శక్తి మరియు అధికారాన్ని పొందేందుకు మొదటి అవసరం దాని కోసం ఆకలి కలిగి ఉండడం. ఈ ఆకలి దేవుని నుండి పుడుతుంది మరియు అది కృత్రిమంగా ప్రేరేపించబడదు. ఎలీషా దేవుని కొరకు ఆకలిని కలిగి ఉన్నాడు. ఎలీషా, ఏలీయా సేవకునిగా ఎన్నో గొప్ప కార్యాలను చూశాడు. కానీ అతడు మరింత ఎక్కువ కోరుకున్నాడు. అతడు ఏలీయా యొక్క ఆత్మలో రెండుపాళ్లు భాగాన్ని కోరుకున్నాడు. అతడు ఏలీయాను దీని గురించి అడిగినప్పుడు, ప్రవక్త, "నువ్వు కష్టమైన విషయం అడిగావు” అని జవాబిచ్చాడు. ఇది మంజూరు కానందున కాదు. గొప్ప అభిషేకంతో పెద్ద బాధ్యత మరియు కష్టాలు వస్తాయని ఏలీయాకు తెలుసు కాబట్టి.

రెండవది, ఘనతకు ముందు వినయం వస్తుంది. ఎలీషాను 'ఏలీయా సేవకుడు' అని పిలుస్తారు. మీరు ‘ఎవరి సేవకుని’గా ఎలా పిలవబడాలనుకుంటున్నారు? అప్పుడు మీ పేరు కూడా ప్రస్తావించబడదు. ఇది ఎలీషా యొక్క సన్నాహకము. ఇది చాలా మంది దేవుని దాసుల సన్నాహకము. ఫరో సేవకుడైన యోసేపును పరిగణించండి. సౌలు సేవకుడైన దావీదును పరిగణించండి.

మూడవది, ఎలీషా తన పిలుపుకు పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. ఎలీషాను ఏలీయాతో చేరమని పిలిచినప్పుడు, ఆ యువకుడు తన వ్యవసాయ వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టాడని లేఖనం చెబుతోంది. అతడు తన ఎద్దులను వధించి, సమాజానికి గొప్ప విందును ఏర్పాటు చేశాడు. (1 రాజులు 19:19-21) అదంతా జరిగింది. తన కొత్త వ్యాపారం పని చేయకపోతే అతడు తన వ్యవసాయ వ్యాపారంలో వెనక్కి వెళ్ళలేడు. ఇది ఎలీషా యొక్క మార్గదర్శక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది, ముందుకు ఏమి జరుగుతుందో అతనికి తెలియదు. అతడు తన వెనుక ఉన్న ప్రతి వంతెనలను కాల్చాడు. అతడు తిరిగి వెళ్ళగలిగే గతం లేదు.

మీరు దేవునిలో అభిషేకం యొక్క గొప్ప కోణంలో కదలాలనుకుంటున్నారా? "మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు" (యిర్మీయా 29:13). ఈ రోజు మీ హృదయంలో దేవుని అభిషేకం కోసం దాహం కలిగి ఉండడం ప్రారంభించండి. రాబోయే గొప్ప ఫలితాలకు ఇది ప్రారంభ స్థానం.
ప్రార్థన
తండ్రీ, నీ సన్నిధి కొరకు మరియు నీ వాక్యము కొరకు నాలో ఆకలిని పుట్టించు. నేను నిన్ను చేరుకుంటాను. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మరచిపోవడం యొక్క ప్రమాదాలు
● విశ్వాసం ద్వారా పొందుకోవడం
● భూసంబంధమైన వాటి కొరకు కాకుండా శాశ్వతమైన వాటి కొరకు ఆశపడుట
● 05 రోజు: 21 రోజుల ఉపవాసం & ప్రార్థన
● తలుపులను మూయండి
● 21 రోజుల ఉపవాసం: 11# వ రోజు
● ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్