english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - II
అనుదిన మన్నా

భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - II

Tuesday, 23rd of April 2024
1 0 1120
Categories : మోసం (Deception) సిద్ధాంతం (Doctrine)
అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని సంఘం యొక్క పెద్దలను పిలిచాడు మరియు ఈ ప్రియమైన పరిశుద్ధులకు అతని చివరి మాటలు:

"29నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. 30 మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు." (అపొస్తలుల కార్యములు 20:29-30)

అపొస్తలుడైన పౌలు గలతీయులలో కొందరు ఎంత తేలికగా మోసపోయారో చూసి ఆశ్చర్యపోయాడు: "6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. 7 అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. 8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక" (గలతీయులకు 1:6-8).

నిజమైన సువార్త ఏది మరియు శపించబడటం అంటే ఏమిటో మనం ఎలా తెలుసుకోగలము?
1. రక్షణ కొరకు ఇతర మార్గాలు ఉన్నాయని చెప్పే ఏదైనా బోధన
యేసుక్రీస్తు మాత్రమే లోక రక్షకుడు అని బైబిలు బోధిస్తుంది. ప్రభువైన యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు" అని సెలవిచ్చాడు (యోహాను 14:6).

యేసు ఒక మార్గం కాదు - ఆయనే మార్గము.
యేసయ్య కేవలం "ఒక" సత్యము కాదు - కానీ సత్యమునై యున్నాడు.

యేసయ్య కేవలం ఒక మంచి మనిషి, లేదా ఒక బోధకుడు, లేదా ఒక ప్రవక్త కంటే ఎక్కువ; ఆయన కన్యకు జన్మించిన, దేవుని ఏకైక కుమారుడు!

రక్షణ కొరకు ఇతర మార్గాలు ఉన్నాయని బోధించే వారు అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, "మరొక సువార్త" మరియు "మరొక యేసును" గురించి బోధిస్తారు.

2. దేవుని భయాన్ని తగ్గించే ఏదైనా బోధన
దేవుని పట్ల శక్తివంతమైన, సంపూర్ణమైన భయం మాత్రమే ఆదాము మరియు హవ్వలను ఆయనకు అవిధేయత చూపకుండా చేసింది. ఇది దేవుని పట్ల వారి ప్రేమ కాదు, లేదా వారి అనుదిన సహవాసం కాదు. ఇది ఇలా జరిగింది: "16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆ నరుని కాజ్ఞాపించెను" (ఆదికాండము 2:16-17).

కానీ సాతాను వివేకవంతమైన మరియు మృదువైన సందేశంతో వచ్చాడు: "మీరు చావనే చావరు" (3:4). ఇది సత్యం యొక్క పూర్తి వక్రీకరణ - మరొక సువార్త! అయినప్పటికీ హవ్వ వినాలనుకున్నది మాత్రమే ఇది. మీరు గమనించండి, ఆమె లోపల ఏదో దేవుని ఆజ్ఞాను ప్రతిఘటించింది. ప్రభువు ఆజ్ఞాలు ఆమెకు ఎక్కువ కాడి మోసేలా అనిపించాయి.

ఇది హవ్వాలో ఉందని సాతానుకు తెలుసు, మరియు వాడు వెంటనే ఆమెలోని దేవుని భయాన్ని తగ్గించడం ప్రారంభించాడు: "దేవుడు నిజంగా ఇలా చెప్పాడా? దేవుడు అలాంటి వ్యక్తి కాదు. మీరు ఆయన గురించి తప్పుడు భావన కలిగి ఉన్నారు. ఆయన జ్ఞానం మరియు బుద్ది అయినప్పుడు, ఆయన మీ జ్ఞానాన్ని మరియు బుద్దిని నిరాకరిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఆయన ఎలాంటి దేవుడు అని మీరు అనుకుంటున్నారు? మీరు తప్పకుండా చావరు!"

దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, "యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు" (సామెతలు 16:6).

సామెతలు 14:12 లో మనం చదువుతాము, "ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును." నేడు, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు?
ప్రార్థన
తండ్రీ, నీ వాక్యానికై నా కళ్ళు మరియు చెవులను తెరిచి ఉంచు. నన్ను మరియు నా కుటుంబాన్ని మోసం నుండి కాపాడు. నన్ను సరైన వ్యక్తులతో జతపరచు. యేసు నామంలో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● సాకులు చెప్పే కళ
● విశ్వాసంతో నడవడం
● క్రీస్తు సమాధిని జయించాడు
● 23వ రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 1
● విశ్వాసంతో వ్యతిరేకతను ఎదుర్కొనుట
● అశ్లీలత
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్