english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
అనుదిన మన్నా

వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4

Monday, 29th of April 2024
0 0 689
Categories : వాతావరణం (Atmosphere)
అద్భుతాలకు అనుకూలమైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలనే దానిపై మనము మన కొసాగింపులో కొనసాగుతున్నాము - ఇక్కడ పరిశుద్ధాత్మ స్వతంత్ర పరిపాలన ఉంటుంది.

గాలి భూమి యొక్క భౌతిక వాతావరణం లాగా, దేవుని మహిమ పరలోకపు యొక్క ఆధ్యాత్మిక వాతావరణం. ఏదెను తోటలో, ఆదాము హవ్వలు దేవుని మహిమతో కూడిన వాతావరణంలో జీవించడానికి దేవుడు సృష్టించాడు. అయితే, ఆదాము హవ్వలు దేవుని సూచనలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా పాపం చేశారు కాబట్టి, వారు నివసించిన వాతావరణం తీవ్రంగా ప్రభావితమైంది.

ఆయన (యెహోవా) ఆదాముతో, "నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు" (ఆదికాండము 3:17-18). 

ఆదాము హవ్వలు ఇప్పుడు మహిమ గల వాతావరణం నుండి దూరమయ్యారు. (రోమీయులకు ​​3:23). వేల సంవత్సరాల తరువాత, అపొస్తలుడైన పౌలు వ్రాశాడు, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు, పాపపు భారం నుండి విడుదల కావాలని ప్రసవవేదనపడుచు,
 పునరుద్ధరించబడటానికి వేచి ఉంది. (రోమీయులకు ​​8:22) దేవుని సృష్టి అంతా ఆదాము హవ్వల పాపం ద్వారా వినాశకరమైన పరిణామాల భారంతో శ్రమిస్తోంది.

అయితే మన పునరుద్ధరణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు మరోసారి మహిమాన్వితమైన వాతావరణంలో జీవించడం ప్రారంభించగలమని అందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.

1. "స్తుతి యాగము అర్పించువాడు దేవుని మహిమ పరచుచున్నాడు" (కీర్తనలు 50:23)

మన చుట్టూ మహిమాన్వితమైన వాతావరణాన్ని సృష్టించగల మార్గాలలో ఒకటి, నిరంతరం యెహోవాను స్తుతించే మరియు ఆరాధించే జీవనశైలిని కలిగి ఉండటం. అలా చేయడం ద్వారా, మనం బైబిలు చెప్పిన విధంగా "నిజమైన ఆరాధకులు" అని పిలువబడుతాము (యోహాను 4:23). ఇది కేవలం చక్కగా పాడటం ద్వారా సాధించగలిగే దానికంటే మించినది. నిజమైన ఆరాధకులు నిజమైన ఆరాధన యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నవారు. మీ ఇంట్లో వ్యక్తిగతంగా మరియు కుటుంబ సమేతంగా యెహోవాను క్రమం తప్పకుండా ఆరాధించండి. మీరు దినమెల్ల పని చేసేటప్పుడు ఆయన స్తుతి మీ నోటిలో మరియు హృదయంలో నిరంతరం ఉండను గాక.

విషయాల యొక్క క్రియాత్మక వైపు, మీ ఇంటిలో ఆరాధన సంగీతాన్ని నిరంతరం వింటూ ఉండదని ఉండండి అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇది వాతావరణంలో మార్పును తెస్తుంది మరియు తద్వారా ప్రత్యక్షత మరియు సాక్ష్యం యొక్క ఆత్మను ఆహ్వానిస్తుంది. మీరు దీన్ని నిరంతరం చేస్తుంటే, మీరు గుర్తించదగిన మార్పులను చూడటం ప్రారంభిస్తారు.
ప్రార్థన
తండ్రీ, నీవు ఏమై యున్నావో అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీవు మంచి మరియు కృపగల తండ్రివి. నా జీవితంలో మరియు కుటుంబంలో దృఢమైన నమ్మకానికై నేను నిన్ను స్తుతిస్తున్నాను మరియు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● పరిశీలనలో జ్ఞానం
● మార్పుకై సమయం
● మన్నా, పలకలు మరియు చేతికఱ్ఱయు
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #4
● మంచి శుభవార్త చెప్పుట
● ప్రార్థనలో వచ్చే కలవరముపై ఎలా విజయం సాధించాలి
● అందమైన దేవాలయము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్