english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం
అనుదిన మన్నా

నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం

Saturday, 4th of May 2024
1 0 715
Categories : నమ్మకత్వం (Loyalty)
బైబిలు ఇలా సెలవిస్తుంది, "దయ చూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?" (సామెతలు 20:6).

ఆమె తన కుక్కను ఎందుకు అంతగా ప్రేమిస్తుందని ఒక వృద్ధ మహిళను అడిగినట్లు నాకు గుర్తుంది. ఆమె బదులిస్తూ, "చాలా సందర్భాలలో ప్రజల కంటే కుక్కలు ఎక్కువ నమ్మకంగా ఉంటాయి." ఆమె సమాధానం ఎప్పుడూ నా మనసులో ముద్రించబడింది.

అది కార్యాలయం (కార్యస్థలం), సంఘం, వ్యాపారం (కార్పొరేట్ ప్రపంచం), రాజకీయాలు లేదా కుటుంబం అయినా, భారీ కొరత ఉన్న ఒక విషయం నమ్మకత్వం. నమ్మకత్వం అనేది నేటి కాలంలో అత్యంత అరుదైన వస్తువు. చాలా మంది దీనికి మౌఖిక సమ్మతిని ఇస్తారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే వాటిని కలిగి ఉన్నారు.

నమ్మకత్వం అంటే ఏమిటి?

నమ్మకత్వం అంటే నమ్మకంగా ఉండడం మరియు వాగ్దానాలను నిలబెట్టుకోవడం. ఇది ప్రతి పరిస్థితులలో నమ్మదగిన లేదా ఆధారపడటం కూడా కలిగి ఉంటుంది. నమ్మకంగా ఉండటం అంటే, మీరు స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టాలి మరియు వ్యక్తిగత కట్టుబాట్లకు విలువనివ్వాలి.

మనము రూతు పుస్తకాన్ని పరిశీలిస్తున్నప్పుడు, రూతు గురించిన అత్యంత క్లిష్టమైన విషయం ఏమిటంటే ఆమె దేవుని పట్ల వ్యక్తం చేసిన నమ్మకత్వం గురించి మీరు తెలుసుకుంటారు. "... నీ జనమే నా జనము మరియు నీ దేవుడే నా దేవుడు" (రూతు 1:16). ఇక్కడ జీవితంలో ఏమి పని చేయని ఒక యువతి ఉంది. దేవుణ్ణి తిరస్కరించడానికి మరియు దేవుణ్ణి నుండి వెనకడుగు వేయడానికి ఆమెకు అన్ని కారణాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆమె, "నీ దేవుడే నా దేవుడు."

మీరు మిగిలిన విషయాలను చదివినప్పుడు, దేవుడు ఆమె నమ్మకత్వానికి నాటకీయ పద్ధతిలో ఘనపరచాడని మీరు చూడగలరు. ఆమె పునరుద్ధరించబడింది, మరియు మర్చిపోని విషయం ఏమిటంటే; ఆమె మెస్సీయ - ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్ష వంశంలో ఉంది.

యేసు తన శిష్యులను పంపినప్పుడు, ఆయన వారిని ఇద్దరిద్దరినిగా పంపెను. (మార్కు 6:7) ఇద్దరు వ్యక్తులతో కూడిన ఈ బృందం తప్పనిసరిగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడం, రోగులను స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం వంటి లోతైన విధేయత, ఐక్యత మరియు స్నేహాన్ని పెంపొందించుకున్నారు.

ఇతరులతో మీ సంబంధాలలో నమ్మకత్వంతో ఉండేందుకు మీకు సహాయం చేయమని దేవుడిని అడగడం మీ అనుదిన ప్రార్థన అంశముగా చేసుకోండి. మరీ ముఖ్యంగా, సరైన ప్రాధాన్యతలతో ఆయన పట్ల నమ్మకంగా ఉండండి.
ప్రార్థన
తండ్రీ, ప్రతిదినము సిలువను మోయుటకు మరియు నీ వాక్యము ద్వారా నిన్ను వెంబడించుటకు నాకు సహాయము చేయుము. నా చుట్టూ నమ్మదగిన మరియు నమ్మకమైన ప్రజలకై కూడా నేను నిన్ను వేడుకుంటున్నాను. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
● సాంగత్యం ద్వారా అభిషేకం
● సంఘంలో ఐక్యతను కాపాడుకోవడం
● 38 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● శత్రువు మీ మార్పుకు (రూపాంతరమునకు) భయపడతాడు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్