"జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును." (ప్రకటన 3:5)
పురాతన కాలంలో నగరాలు తమ పౌరుల పట్టీ పుస్తకము (రిజిస్టర్) ఉంచుకున్నాయి; ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని పేరు రిజిస్టర్ నుండి తొలగించబడుతుంది. మనం దేవుని పౌరుల జాబితాలో ఉండాలనుకుంటే, మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకోవాలని పునరుత్థాన క్రీస్తు చెబుతున్నాడు.
జీవ గ్రంథం ఉంది, అది తీర్పు దినాన తెరవబడుతుంది సూచించబడుతుంది. దీనర్థంజీవ గ్రంథం నిజమైనది, చదవబడుతుంది.
గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. (ప్రకటన 20:12)
ప్రకటన 3:5లో, జయించిన వారికి యేసు శక్తివంతమైన వాగ్దానం చేశాడు: "జీవ గ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టను." జీవ గ్రంథం అనేది దేవునికి చెందిన శాశ్వత జీవితాన్ని కలిగి ఉన్నవారి పరలోక ప్రమాణం. ఈ పుస్తకంలో మన పేర్లు వ్రాయడం గురించి ప్రాముఖ్యతను అన్వేషిద్దాం.
బైబిలు అంతటా, జీవ గ్రంథం గురించిన సూచనలను మనం చూస్తాం. నిర్గమకాండము 32:32-33లో, మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు, వారి పాపాన్ని క్షమించమని లేదా పుస్తకం నుండి అతని పేరు తుడిచి పెట్టమని దేవుని కోరాడు. కీర్తనలు 69:28లో, దావీదు జీవ గ్రంథం నుండి దుష్టుల పేర్లను తొలగించమని దేవుని ప్రార్థించాడు. ఫిలిప్పీయులకు 4:3లో, అపొస్తలుడైన పౌలు తన తోటి పనివారి పేర్లను జీవిత గ్రంథంలో పేర్కొన్నాడు.
జీవ గ్రంథంలో మన పేర్లను వ్రాయడం మన స్వంత ప్రయత్నాల ద్వారా సంపాదించేది కాదు. ఇది యేసుక్రీస్తుపై మన విశ్వాసాన్ని ఉంచడం ఆయన రక్షణ బహుమానం అంగీకరించచే ఫలితం. ప్రకటన 13:8 పుస్తకంలో పేర్లు వ్రాయబడని వారిని మృగాన్ని ఆరాధించే వారిగా వివరిస్తుంది. దానికి భిన్నంగా, క్రీస్తుకు చెందినవారు తమ పేర్లు పరలోకంలో భద్రంగా నమోదు చేయబడతాయనే హామీని కలిగి ఉన్నారు.
జయించేవారి పేర్లను జీవ గ్రంథం నుండి యేసు ఎప్పటికీ తుడిచివేయడని వాగ్దానం ఒక శక్తివంతమైన ప్రోత్సాహం. ఇది క్రీస్తులో మనకున్న శాశ్వతమైన భద్రత గురించి మాట్లాడుతుంది. ఒక్కసారి మనం ఆయన అయితే, ఆయన ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరు చేయదు (రోమా 8:38-39). మన రక్షణ అనేది మన పనితీరుపై ఆధారపడి ఉండదు కానీ యేసు సిలువపై పూర్తి చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది.
మీరు యేసుక్రీస్తుపై మీ విశ్వాసం ఉంచారా, మీ రక్షణ కోసం ఆయనను మాత్రమే విశ్వసించారా? అలా అయితే, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందనే హామీతో సంతోషించండి. మీరు ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకోనట్లయితే, ఈ దినాన ఆయన బహుమానమైన నిత్యజీవాన్ని స్వీకరించే దినం. విశ్వాసులుగా ఉన్నవారికి, యేసు మీ పేరును ఎప్పటికీ తుడిచివేయడు అనే వాగ్దానంలో ఓదార్పు పొందండి. మీరు జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ఈ సత్యం మిమ్మల్ని సమాధానం విశ్వాసంతో నింపనివ్వండి.
ప్రార్థన
ప్రభువైన యేసు, జీవ గ్రంథంలో నా పేరు వ్రాసినందుకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన అపురూపమైన రక్షణ బహుమానమును నేను ఎప్పుడూ తేలికగా తీసుకోను. నేను ఎప్పటికీ నీకు చెందినవాడినని తెలుసుకునే ఆనందం భద్రతతో ప్రతిరోజూ జీవించడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● దీని కోసం సిద్ధంగా ఉండండి!● చెరసాలలో స్తుతి
● ఆత్మలో తీవ్రతతో ఉండుట
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
● రాజుల యెదుట నిలబడేలా చేసిన దావీదు గుణాలు
● సంబంధాలలో సన్మాన నియమము
● మీ అనుభవాలను వృధా చేయకండి
కమెంట్లు