english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 5
అనుదిన మన్నా

గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 5

Sunday, 12th of May 2024
0 0 1213
Categories : జీవిత పాఠాలు (Life Lessons)
ఆదికాండము 8:21లో యెహోవా ఇలా సెలవిచ్చాడు, "నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది". నరుల నిరంతర చెడు ఆలోచనలు దేవుని హృదయాన్ని బాధపెట్టాయి మరియు ఆయన లోకాన్ని వరద ద్వారా నాశనం చేశాడు. ఈ రోజు మన చుట్టూ జరుగుతున్న ప్రతి చెడులతో, అది ఖచ్చితంగా ఆయన హృదయాన్ని తీవ్రంగా బాధపెడుతుంది.

సమస్త పాపాలు మన ఆలోచనలలో (ఊహలలో) మొదలవుతాయి."దావీదు ఆ స్త్రీని (బత్షెబా) గురించి తెలిసికొనుటకై యొక దూతను పంపెను అని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరియు "ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ కాదా?” అని అడిగాడు. అప్పుడు దావీదు దూతలను పంపి ఆమెను చేర్చుకొనెను; (2 సమూయేలు 11:3-4)

ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. (యాకోబు 1:14-15)

దావీదు బత్షెబా గురించి విచారించినప్పుడు, ఆమె వివాహిత అని ప్రజలు అతనికి స్పష్టంగా చెప్పారు. విషయాలను మరింత దిగజార్చడానికి, వారు అతని అత్యంత విశ్వసనీయ మరియు నమ్మకమైన సైనికులలో ఒకరైన హిత్తీయుడు అయినా ఊరియా భార్య అని కూడా అతనికి చెప్పారు. అకస్మాత్తుగా, కారణంతో కూడిన, హేతువు మరియు ఆధ్యాత్మిక దృఢవిశ్వాసం పక్కకు తొలగిపోయాయి మరియు అతను పూర్తిగా కామముచే కరిగిపోయాడు. విషాదకరంగా, దావీదు చేసిన ఈ పాపం అతని కుటుంబంలో తరతరాలుగా వ్యభిచారం, హత్య మరియు పరిణామాలకు దారితీసింది.

మీరు ఒక రకమైన పాపంలో పడిపోయినట్లయితే, అది ఒక ప్రతిరూపుముగా మారడానికి అనుమతించవద్దు. ప్రతిరూపము అంటే ఏమిటి? మీరు దీన్ని మళ్లీ మళ్లీ చేస్తున్నప్పుడు, ఇది ఒక ప్రతిరూపుముగా మారుతుంది. ఇది మిమల్ని వినాశనానికి దారి తీస్తుందని మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఘోరంగా గాయపడిన వ్యక్తి వలె, మీకు వెంటనే శ్రద్ధ వహించడం అవసరం. మీరు ఇప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వైపుకు మళ్ళాలి!

"మీరు ఏమి ఆలోచిస్తున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ ఆలోచనలు మీ జీవితాన్ని నడిపిస్తాయి." సామెతలు 4:23 (NCV) మన మనస్సు దేనిపై దృష్టి సారిస్తుందో అది మన జీవితంలో ఎలా నడిపిస్తుందో మరియు చివరికి మనం ఎవరమూ అని రూపొందిస్తుంది. ఇది తరచుగా మన ఆలోచనలు, మన పరిస్థితులు కాదు, ఇది మనల్ని బురదలో మునిగిపోయేలా చేస్తుంది.

పవిత్రత కోసం యుద్ధం మీ మనస్సులో గెలవడం లేదా ఓడిపోవడం. మన ఆలోచనలను మనం బంధించడం నేర్చుకోవాలి. అవి వికసించకముందే ఆ ఆలోచనలను మొగ్గలో తుంచేయండి.
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నా నుండి అపరిశుభ్రమైన ప్రతి ఆలోచన మరియు కోరికను నిర్మూలించు. నీ మహిమ కొరకు పరిశుద్ధంగా ఉండుటకు నాకు సహాయము చేయి. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● యూదా ద్రోహానికి నిజమైన కారణం
● 02 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దేవుని ప్రణాళికలో వ్యూహ శక్తి
● వాక్యం యొక్క సమగ్రత
● నిరాశ పై ఎలా విజయం పొందాలి
● ధైర్యము కలిగి ఉండుట
● దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - II
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్