english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. విత్తనం యొక్క శక్తి - 3
అనుదిన మన్నా

విత్తనం యొక్క శక్తి - 3

Saturday, 18th of May 2024
0 0 668
Categories : విత్తనం యొక్క శక్తి (Power of the Seed)
1 ప్రతిదానికి సమయము కలదు. 
ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
2 ​పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు 
నాటబడినదాని పెరికివేయుటకు,
3 ​చంపుటకు బాగుచేయుటకు; 
పడగొట్టుటకు కట్టుటకు;
4 ఏడ్చుటకు నవ్వుటకు; 
దుఃఖించుటకు నాట్యమాడుటకు;
5 రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; 
కౌగలించుటకు కౌగలించుట మానుటకు;
6 ​వెదకుటకు పోగొట్టుకొనుటకు, 
దాచుకొనుటకు పారవేయుటకు;
7 చింపుటకు కుట్టుటకు; 
మౌనముగా నుండుటకు మాటలాడుటకు;
8 ప్రేమించుటకు ద్వేషించుటకు; 
యుద్ధము చేయుటకు సమాధానపడుటకు సమయము కలదు. (ప్రసంగి 3:1-8)

ఈ రోజు "విత్తనం యొక్క శక్తి" లో మన అంశములో మూడవ విడత. మీరు ఈ దైవిక సత్యాలను మీ జీవితంలో నేర్చుకుని, అన్వయించుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను.

ఈరోజు మనం 5వ విత్తనం గురించి పరిశీలిద్దాము.

5. సమయం
సమయం భూమి యొక్క విధానం. పరలోకములో సమయ భావం లేదు. మీరు మీ చుట్టూ ఏది చూసినా, మీరు దాని కోసం సమయాన్ని వెచ్చించారు. "నేను ఈ అదనపు కిలోల బరువు తగ్గాలని కోరుకుంటున్నాను, కానీ వ్యాయామం చేయడానికి నాకు నిజంగా సమయం దొరకడం లేదు" అని ఒక స్నేహితుడు చెప్పడం విన్నాను.

అయితే, ఆ సాయంత్రం నా స్నేహితుడు నెట్‌ఫ్లిక్స్‌లో రెండు గంటలపాటు సినిమా చూశాడు. అతడు తన సమయాన్ని వినోదం కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆరోగ్యకరమైన శరీరం కోసం కాదు. నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను.

ఇది ప్రస్తుతం మీరు కలిగి లేని వాటిని గురించి నాకు చెబుతుంది, అది ఉత్పత్తి చేయడానికి సమయం అనే విత్తనాన్ని విత్తడానికి ఇష్టపడకపోవడం వల్ల కావచ్చు.

సాధారణ మరియు అద్భుతమైన వాటిని వేరు చేసేది సమయ నిర్వహణ. చాలా కాలం క్రితం, సమయానికి విలువ ఇవ్వని వ్యక్తిని ఎన్నటికీ నియమించకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఒక విత్తనం వలె సమయం పట్ల ఒక వ్యక్తి యొక్క ఉదాసీన వైఖరి వారితో పాటు వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు వినాశకరమైనది.

ఈ జీవితంలో మనకు ఇవ్వబడిన అత్యంత విలువైన విత్తనం సమయం. సమయాన్ని ఒక విత్తనంగా రక్షించడానికి, ఆదరించడానికి మరియు నెరవేర్చడానికి మనం ఇష్టపడనప్పుడు, మనం ఉద్దేశపూర్వకంగా మనల్ని మనం వైఫల్యానికి గురిచేసుకుంటున్నాము.

దేవుడు నిన్ను ఏ స్థాయిలో నుండి పిలిచాడో, అక్కడ ఎప్పుడూ విత్తన సమయం ఉంటుంది. మీరు గనుక ఈ విత్తన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే, మీరు మీ భవిష్యత్తును పరిమితం చేసుకుంటున్నారు. మంచి శుభవార్త ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ విత్తన సమయం కేటాయించబడింది. విత్తన సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే అడవిని పరలోకంగా మార్చవచ్చు. బహుశా ఇది సంబంధం కావచ్చు లేదా కష్టపడుతున్న వ్యాపారం కావచ్చు, మీరు దానిలో విత్తన సమయాన్ని కేటాయించినప్పుడు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది.
ప్రార్థన
తండ్రీ, నా విత్తన సమయాన్ని గుర్తించడానికి వివేచనకై నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను సరైన వైఖరి లేదా ధోరణి కోసం ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
● ఆరాధన యొక్క పరిమళము
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఉత్తమము మంచి వాటికి శత్రువు
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
● సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం
● సాత్వికము బలహీనతతో సమానం కాదు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్