english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. విశ్వాసం అంటే ఏమిటి?
అనుదిన మన్నా

విశ్వాసం అంటే ఏమిటి?

Wednesday, 22nd of May 2024
0 0 905
Categories : విశ్వాసం (Faith)
విశ్వాస మనునది [మనం] నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును (నిర్ధారణ, హక్కును స్థిరపరచు), అదృశ్యమైనవి యున్న వనుటకు రుజువునై యున్నది (విశ్వాసం అనునది జ్ఞానమునకు అదృశ్యమైన వాస్తవిక వాస్తవాన్ని గ్రహించడం). (హెబ్రీయులకు 11:1)

దేవుని వాక్యం యొక్క నేటి గొప్ప విందుకి స్వాగతం. విశ్వాసం అనే అంశం మీద మనం ఈ రోజు నుండి లేఖనాల పరిశీలనలోకి ప్రయాణం చేద్దాం. మనము బైబిలు నుండి విశ్వాసం యొక్క నిర్వచనం, దాని అవకాశాలను మరియు దాని ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. థామస్ అక్వినాస్ విశ్వాసం యొక్క ముఖ్యాంశాన్ని ఈ విధంగా గ్రహించాడు, "విశ్వాసం ఉన్న వ్యక్తికి వివరణ అవసరం లేదు. విశ్వాసం లేని వ్యక్తికి వివరణ సాధ్యం కాదు."

మీరు మొదట విశ్వాసం అనే పదాన్ని విన్నప్పుడు, మీ మనస్సు నుండి వచ్చే నిర్వచనం ఏమిటి? మానవుని యొక్క ఆందోళనను నిర్వహించడానికి దేవుని సన్నాహక రకము? గుడ్డి ఆశావాదం మరియు తయారు చేయబడిన ఆశాజనక భావన? బహుశా, చాలా మంది విశ్వాసాన్ని అవసరమైన సిద్ధాంతంగా కూడా చూస్తారు-మీరు తప్పనిసరిగా విశ్వసించే క్రైస్తవ సిద్ధాంతానికి మస్తిష్క సమ్మతి. నేటికి మన ధ్యాన వచనం, విశ్వాసం అనేది జీవితపు తుఫాను సముద్రాల గుండా ప్రయాణించే ఆశల తెడ్డు కాదని స్పష్టం చేస్తుంది.

విశ్వాసం అనేది దేవుని వాక్యం మీద ఆధారపడిన క్రియ. విశ్వాసం అనేది తెలియని మన భయాలను నిర్వహించడానికి మనం తయారు చేసే కొంత భావన లేదా భావోద్వేగం కాదు. దేవుడు తన వాక్యంలో చెప్పిన లేదా వెల్లడించిన దానికి మానవుని యొక్క సంపూర్ణ ప్రతిస్పందన ఇది. ఇది చీకటిలో ఉండి చేసే కార్యం కాదు.

యేసు సీమోను అనే జాలరితో తన వలను లోతైన నీటిలో వేయుమని చెప్పినప్పుడు. సీమోను స్పందిస్తూ, తాను మరియు అతని సహచరులు రాత్రంతా కష్టపడి ఏమీ పట్టుకో లేకపోయామని చెప్పెను. అప్పుడు పేతురు, "అయినను నీ మాట చొప్పున వలలు వేతునని" చెప్పెను (లూకా 5:5).

పేతురు ప్రభువైన యేసు మాటల ఆధారంగా ఒక క్రియతో ప్రతిస్పందించాడు. విశ్వాసం అంటే మన అభిప్రాయాలు, మన అనుభవం మరియు మన విద్యాభ్యాసం ఉన్నప్పటికీ దేవుడు చెప్పేదానిపై నడవడం. విశ్వాసం అంటే మనం సత్యాన్ని అనుభవిస్తున్నామో లేదో, మనం సత్యాన్ని ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, మనం సత్యాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా దాని మీద నడవాలి.

అలాగే, పరిశుద్ధాత్మ మీ హృదయంతో ఏమి మాట్లాడవచ్చో దాని మీద మీరు కార్య రూపం దాల్చినప్పుడు, నమ్మదగిన ఫలితాలు వస్తాయి. అదే విశ్వాసం! 

నా అనేక సభల సమయంలో, అభిషేకం చాలా బలంగా కదులుతున్నప్పుడు, ప్రజల పరిస్థితులను సరిగ్గా వివరించే జ్ఞాన వాక్యము ఉంటుంది. తమతో మాట్లాడుతున్నది ప్రభువే అని తెలిసి, వాక్యానికి ప్రతిస్పందించే వారు చాలా మంది ఉంటారు. వారి స్థితిగతులను నేను అంత ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం లేదు. వాక్యానికి ప్రతిస్పందించే వారు ప్రభువు నుండి స్వస్థతను పొందుకుంటారు.

అయితే వచ్చిన వాక్యం వారి పరిస్థితిని సరిగ్గా వివరిస్తుందని తెలిసిన కొందరు వ్యక్తులు ఉన్నారు, కానీ వారు ఎప్పుడూ స్పందించరు. వారు బహుశా దేవుని శక్తి తమ మీద కదులుతుందని మరియు వారు చేయాలనుకున్నా చేయకున్నా ఏదో ఒకటి చేయాలని వారు అనుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యం చేసే విధానం అది కాదు.

దుష్టశక్తులు ప్రజలు చేయకూడని పనులను చేయమని బలవంతం చేస్తాయి మరియు ఆదేశిస్తూ ఉంటాయి. మరోవైపు, పరిశుద్దాత్మ ఒక పెద్దమనిషి లాంటి వాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ బలవంతం చేయడు మరియు ఏదైనా చేయమని మిమ్మల్ని ముందుకు నెట్టడు. ఆయన మిమ్మల్ని సున్నితంగా పురికొల్పుతాడు, అయితే ప్రతిస్పందించడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన వాక్యమును బట్టి క్రియతో స్పందించడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. 
ప్రార్థన
తండ్రీ, నీ వాక్యం యొక్క సమగ్రత మీద దృఢంగా స్థిరపడి నా ప్రాణాధారముతో జీవితంలో ప్రయాణించడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● నేటి కాలంలో ఇలా చేయండి
● మూడు పరిధులు (రాజ్యాలు)
● స్తుతి ఫలములను తెస్తుంది
● విశ్వాసులైన రాజుల యాజకులు
● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
● రక్తంలోనే ప్రాణము ఉంది
● క్రీస్తులో రాజులు మరియు యాజకులు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్