అనుదిన మన్నా
నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
Sunday, 9th of June 2024
0
0
453
Categories :
నాయకత్వం (leadership)
"మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము నిరుత్సాహపడక మరియు వెనక్కి తగ్గి మేలు చేసితిమేని తగినకాలమందు ఆశీర్వాద పంటను కోతుము." (గలతీయులకు 6:9)
దేవుడు ప్రతి మనిషి ముందు ఎంపిక చేసుకునే శక్తిని ఉంచాడు. అలాగే, మనమందరం క్రీస్తు న్యాయ పీఠం ముందు నిలబడి, భూమిపై మనం ఇక్కడ చేసిన ఎంపికలకు చివరి రోజున లెక్క ఇవ్వాల్సి ఉంది - ఎటువంటి సాకులు, నిందించే వేళ్లు, ప్రతి పురుషుడు మరియు స్త్రీ వారి స్వంత కార్యాలకు బాధ్యత వహిస్తారు.
మనకు దీనిపై అవగాహన ఉంటే, ఒక స్థితిలో ఉన్న ఎవరైనా పాపంలో పడిపోయినప్పుడు మనం ప్రభావితం కాకుండా కాపాడు కోగలుగుతాం. మత్తయి 24:12 లో క్రీస్తు యేసు నుండి నమ్మదగిన ప్రవచన వాక్య ఉంది, "మరియు అంత్య దినాలలో అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును."
మత్తయి 24:12 లోని సత్యమైన ప్రవచనాలు మనల్ని క్రమబద్ధీకరించడం, భవిష్యత్ సంఘటనల తయారీలో మనల్ని బలోపేతం చేస్తుంది. అవి రాబోయే విషయాల గురించి మనకు ముందే హెచ్చరిస్తుంది. గమనించండి, ప్రవచనం, 'అనేకులను' దేవుని పట్ల ప్రేమ చల్లారును అని చెపుతుంది. ఇది అంత్య దినాల యొక్క ప్రధాన చిహ్నంలో ఒకటి.
ప్రేమ చల్లారుట యొక్క సంకేతాలు
1. దేవుని విషయాల పట్ల నిష్క్రియాత్మక వైఖరి
2. చర్చికి వెళ్ళడానికి లేదా క్రైస్తవుల చుట్టూ ఉండటానికి ఇష్టపడని హృదయం
3. మీకు నచ్చిన విధంగా వ్యవహరించడానికి నిర్లక్ష్య వైఖరిి
4. దేవుని విషయాల పట్ల సందేహం
5. ప్రార్థన, ఉపవాసం మరియు వాక్యాన్ని అధ్యయనం చేయడానికి చాలా తక్కువ ఉత్సాహం చూపడం
6. దేవుని వాక్యానికి అవిధేయత చూపడం
ఉదాహరణకు: ఇవ్వడం అనేది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ (లూకా 6:38). ప్రభువు పట్ల ప్రేమ చల్లారినప్పుడు, ఆ వ్యక్తికి ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. అలాగే, ఇంకొక కారణం, అతను లేదా ఆమె ఇంటర్నెట్ లేదా న్యూస్ మీడియాలో చదివిన కారణంగా ఆ వ్యక్తి ఇవ్వడం చాలా కష్టమనిపిస్తుంది.
ఇతరుల పాపం మీ విధేయతను ప్రభావితం చేయడానికి మీరు అనుమతిస్తే, ఇది మీ “అవిధేయత” కు సమానం.
మీరు మరియు నేను చేసిన అన్ని పనులు దేవుని పుస్తకంలో నమోదు చేయబడ్డాయి. ఆ రోజు, పుస్తకాలు తెరవబడతాయి మరియు మన పనులు మాట్లాడతాయి మరియు మనల్ని అనుసరిస్తాయి. ఈ రెండు పదాలలో ఒకటి అందరికి విధి అవుతుంది; పదాలు "మరణించు" లేదా "కొనసాగించు".
దేవునిపట్ల తమ ప్రేమను మరియు దేవుని విషయాలు ప్రభువు కొరకు జీవించడంలో చల్లర్చాడనికి అనుమతించిన వారిలో మనం ఉండకూడదు. మీరు ప్రభువును అనుసరించడం లేదని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది చాలా ప్రాచుర్యం పొందిన విషయం.
వేరొకరు చేస్తున్నందున మీరు దీన్ని చేయడం లేదు. మీరు భయం లేదా బలవంతం నుండి చేయడం లేదు; మీరు దీన్ని ప్రేమ మరియు అవగాహనతో చేస్తున్నారు.
పడిపోయిన వ్యక్తి కంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనదిగా భావించే అహంకారం ఏర్పడే సందర్భాలు చాలా ఉన్నాయి.
అయినప్పటికీ, మనం పడిపోకపోవటానికి గల ఏకైక కారణం ఏమిటంటే, మనం పడిపోయిన వారికంటే మంచివాళ్ళం అని కాదు గాని, కానీ ఇది కేవలం మనం స్థిరంగా నిలబడటం కృప వల్ల మాత్రమే. పడిపోయినవారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించండి, కాని వారి పాపాని మీరు దేవుని పట్ల మరియు ఆయన నీతిమంతుల పట్ల నిలు వెచ్చనిగా మరియు చేదుగా ఎదగడానికి అనుమతించవద్దు. (హెబ్రీయులు 12:15)
ప్రార్థన
తండ్రీ, మీ కృప యొక్క ప్రత్యక్షతలో తప్పిపోకుండా శ్రద్ధగా ఉండటానికి నాకు కృపను దయచేయండి. నా ఆధ్యాత్మిక మనిషిలో నేను అలరించిన చేదు యొక్క బీజాన్ని వేరు చేయండి. నీ ప్రేమతో నన్ను శక్తివంతం చేయండి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #2● దేవుణ్ణి స్తుతించడానికి వాక్యానుసారమైన కారణాలు
● క్రీస్తు రాయబారి
● ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి?
● త్వరిత విధేయత చూపే సామర్థ్యం
● 21 రోజుల ఉపవాసం: 5# వ రోజు
● మీరు చెల్లించాల్సిన వెల
కమెంట్లు