english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి
అనుదిన మన్నా

ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి

Friday, 28th of June 2024
0 0 704
Categories : వాక్యాన్ని ఒప్పుకోవడం (Confessing the Word)
ఆదికాండము సమస్త ప్రారంభాలకు గల పుస్తకము. మీరు వివాహం మరియు సంపదను అర్థం చేసుకోవాలంటే, మీరు ఆదికాండము పుస్తకాని చదవాలి. మీరు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే, మీరు ఆదికాండము పుస్తకాని చదవాలి. మీరు ఆదికాండము అర్థం చేసుకోకపోతే, మీరు జీవితాన్ని అర్థం చేసుకోలేరు.

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు, "వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను." (ఆదికాండము 1:1-3)

బహుశా మీ జీవితం, మీ వ్యాపారం, మీ గమనము నిరాకారముగాను మరియు శూన్యముగాను ఉండవచ్చు. మీకు కనిపించేదంతా చీకటిమయం మరియు నిరీక్షణ లేదు. దుష్టుడు అబద్ధికుడు. దేవుడు నిన్ను విడనాడాడని, నీకు మంచి జరగదని వాడు చెబుతాడు. కానీ గమనించండి, దేవుని ఆత్మ నిరాకారముగాను శూన్యముగాను లేని వాటిపైన అల్లాడుచుండెను. దేవుడు ఎప్పుడూ ఉండే దేవుడు. ఆయన మిమ్మల్ని విడువడు.

కానీ మీరు మీ జీవితంలో కొన్ని విషయాలను క్రియాత్మకంగా చేస్తే తప్ప ఆ చీకటి విడిచిపెట్టిపోదు. దాని గురించి నేను వివిరిస్తాను.

దేవుని ఆత్మ చీకటి మరియు నిరాకారమైన వాటి మీద అల్లాడుచుండెను గనుక ఏమి జరుగలేదు. దేవుని వాక్యం చెప్పబడే వరకు నిజంగా ఏమీ జరగలేదు. అప్పుడు దేవుడు, "వెలుగు కమ్మని" పలుకగా వెలుగు కలిగెను.

జీవితం ప్రత్యక్షత పరచడానికి ముందు వాక్యం చెప్పబడాలి. దేవుని ప్రత్యక్షత కావాలని మీరు కోరుకునే మీ జీవితంలోని ప్రతి రంగానికి ఇదే సిధ్ధాంతం వర్తిస్తుంది. మీరు ఉద్యోగం, ఆధ్యాత్మిక వృద్ధి మొదలైన వాటి కోసం ప్రార్థిస్తున్నారని అనుకుందాం. ఈ రంగాలకు సంబంధించిన వాక్యాన్ని ఒప్పుకోవాలి. (మీరు నోహ్ యాప్‌లో అనుదిన ఒప్పుకోలుని క్లిక్ చేసి, మీ అవసరానికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని ఒప్పుకోవచ్చు) మీ నోరు తెరిచి అధికారంతో మీ పరిస్థితి మీద మాట్లాడండి; అప్పుడే మీ జీవితంలో క్రమం అనేది ఉంటుంది.

దేవుడు ఎలా పనిచేస్తాడో మనం ఎంత తక్కువగా అర్థం చేసుకున్నామో, మన క్రైస్తవ ప్రయాణంలో మనం అంతగా విసుగు చెందుతాము. అప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తాము, సంఘంతో ఆందోళన చెందుతాము మరియు కొందరు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు.

ఒప్పుకోలు
నేను నిత్య మార్గదర్శకత్వం కలిగి ఉన్నాను, ఎందుకంటే, "ప్రభువు నన్ను నిత్యము నడిపిస్తాడని" నేను అంగీకరిస్తున్నాను (యెషయా 58:11).

నేను దేవుని సమాధానమును కలిగి ఉన్నాను, ఎందుకంటే, "అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నా హృదయములకును నా తలంపులకును కావలి యుండునని" నేను అంగీకరిస్తున్నాను (ఫిలిప్పీయులకు 4:7).

నేను భయం ద్వారా స్వేచ్ఛను కలిగి ఉన్నాను, ఎందుకంటే, "నీ దేవుడనైన యెహోవానగు నేను, "భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నా కుడిచేతిని పట్టుకొనుచున్నాడని" నేను అంగీకరిస్తున్నాను (యెషయా 41:13).



Join our WhatsApp Channel


Most Read
● యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
● 01 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - III
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #3
● ప్రేమ గల భాష
● దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - II
● 01 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్