english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. భూపతులకు అధిపతి
అనుదిన మన్నా

భూపతులకు అధిపతి

Sunday, 30th of June 2024
0 0 785
Categories : క్రీస్తు దేవత (Deity of Christ)
నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపా సమాధానములు మీకు కలుగును గాక. (ప్రకటన 1:5)

పై వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుకు ఇవ్వబడిన మూడవ పేరు: భూపతులకు అధిపతి. 

లోకములో ఉన్న సమస్యలను మనం చూసినప్పుడు, వాస్తవానికి క్రీస్తు "భూపతులకు అధిపతి" అని నమ్మడం మనకు కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే, క్రీస్తుకు భూమిని పరిపాలించే హక్కు ఉన్నప్పటికీ, ఆయన ఈ సమయంలో అధిపతులు మరియు రాజ్యాల మీద ఈ అధికారాన్ని అమలు చేయడం లేదు.

ఏదెను తోటలో దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఆదాము వదులుకున్నప్పుడు సాతాను లోకములోని రాజ్యాములను పరిపాలించే తాత్కాలిక చట్టపరమైన హక్కును పొందాడు.
లేఖనంలోని క్రింది వచనాలను నిశితంగా పరిశీలించండి:

అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి
ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను. (లూకా 4:5-8)

సమస్త ఆరాధనలకు యోగ్యుడు అని ప్రభువైన యేసయ్య అపవాదికి స్పష్టంగా తెలియజేసినప్పటికీ, ప్రపంచ రాజ్యాల మీద సాతాను తాత్కాలిక అధికారం గురించి ఆయన వాదించ లేదు.

సిలువ మీద తన కార్యము ముగిసినప్పుడు, సాతాను కార్యాలు కూడా ముగిస్తాయని యేసు ప్రభువుకు తెలుసు! (యోహాను 12:31 గమనించండి)

ప్రభువైన యేసయ్య మృతులలో నుండి లేచిన తరువాత, "పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది"అని ఆయన చెప్పెను. (మత్తయి 28:18)

నేడు, ప్రభువు భూపతులకు అధిపతుల హృదయాలను కూడా నియంత్రిస్తున్నాడు.
యెహోవా చేతిలో రాజు హృదయము 
నీటి కాలువల వలెనున్నది. 
ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును. (సామెతలు 21:1)

అంటే మన దేశంలో దేవుని చిత్తం జరగాలని మరియు మన నాయకులు దేవుణ్ణి వెదకాలని మరియు ఆయన చెప్పేది వినాలని మనం ప్రార్థించాలి. వారు దైవికమైన సలహాతో ఉండాలని మరియు మరి ముఖ్యముగా, మన నాయకలు వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోవాలని మరియు యేసుక్రీస్తులో మాత్రమే విశ్వాసం ద్వారా కనుగొనబడిన రక్షణను తెలుసుకోవాలని మనం ప్రార్థించాలి.

ప్రార్థన
1. తండ్రీ, ఈ దేశంలో వివేచనాత్మక హృదయం, దృఢమైన విశ్వాసం మరియు మీ స్వభావమును ఆదర్శంగా తీసుకునే బుద్ధిగల నాయకులను లేవనెత్తు.

2. తండ్రీ, నాయకుల హృదయాలను మార్చే అధికారము మీరు మాత్రమే కలిగి ఉన్నారు, వారిని సరైన దిశలో నడిపించడానికి మా ప్రార్థనలను విను. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మూడు కీలకమైన పరీక్షలు
● దేవుడు ఎల్ షద్దాయి
● 39 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 02 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యొక్క శక్తి
● వాక్యాన్ని పొందుకొవడం
● అగ్ని తప్పక మండుచుండాలి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్