english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #2
అనుదిన మన్నా

ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #2

Wednesday, 31st of August 2022
0 0 470
Categories : జన సమూహం (Crowd) శిష్యత్వం (Discipleship)
ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు అనే శ్రేణిలో కొనసాగుతున్నాము ఈ రోజు, మనము కొన్ని ఇతర సమూహాలను పరిశీలీద్దాము.

జనసమూహంయేసును వెంబడించిందని అనేక సార్లు బైబిలు చెబుతుంది.
గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశముల నుండియుయొర్దానునకు అవతల నుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. (మత్తయి4:25)

రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి. (యోహాను6:2)

జనసమూహములనువర్గీకరించేది ఏమిటంటే, వారి భావోద్వేగాలను ఒక తీవ్రత నుండి మరొకదానికి మార్చవచ్చు. వారు మిమ్మల్ని ఒక క్షణం ప్రేమిస్తారు, మరియు తరువాతి క్షణం వారు మిమ్మల్ని ద్వేషించవచ్చు.

ఒక క్షణం, "జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకవచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము" అని కేకలు వేస్తారు. సరైన ప్రేరేపణ ఇచ్చినట్లయితే, వారు, "ఆయనను సిలువవేయుడి! ఆయనను సిలువవేయుడి!" అని కేకలు వేస్తారు, జన సమూహము విధేయత స్వభావంలో చాలా చంచలమైన వారు. 

సువార్తలను నిశితంగా అధ్యయనం చేయగలిగితే, ఆ రోజులలో యేసును వెంబడిస్తున్న జనసమూహానికి మరియు ఈ రోజు యేసును వెంబడిస్తున్న జనసమూహాల మధ్య విపరీతమైన పోలికను చూడవచ్చు.

మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నేను సంఘానికి వెళ్ళినప్పుడు, నేను జన సమూహములో భాగమ లేదా నేను మందిరానికి భాగమ? జన సమూహము తరచూ వారు ఏమిపొందవచ్చో చూడటానికి వస్తారు, కాని తమను తాము ఇవ్వగలుగరు.

నేను ఉత్సాహంలో భాగమ, లేదా వాక్యం యొక్క లోతైన సత్యాలు బోధించబడుతున్నప్పుడు కూడా నేను అక్కడే ఉంటానా? యేసుఉపమానరీతిలోజనసమూహాన్నికి బోధించాడు, కాని లోతైన సత్యాలను తన శిష్యులకు వ్యక్తిగతంగా వివరించాడు (మత్తయి10:13-17; మార్కు 4:2).

నా సేవ జనసమూహాము యొక్క భావనపై ఆధారపడి ఉందా, లేదా ఈ వాక్యం నాకు చెప్పినందున నేను ప్రభువును సేవిస్తున్నాన?

జనసమూహం ఉన్నందున నేను ప్రభువును సేవిస్తున్నానా, లేదా జనసమూహం లేకపోయినా నేను సేవ చేస్తానా?

ఇవి కఠినమైన ప్రశ్నలు, కానీ ఇవి మీ ఉద్దేశాలను ప్రభువు దృష్టికి కనబడని సృష్ఠముఏదియు లేదని తద్వారా ఆయన ముందు ఉంచడానికి మీకు సహాయపడతాయి. (హెబ్రీయులు4:13)
ఒప్పుకోలు
నేడు, దానియేలు ఉపవాసం యొక్క 4వ రోజు
[మీరు ఇంకా దీన్ని ప్రారంభించకపోతే లేదా దాని గురించి మరింత సమాచారం కావాలనుకుంటే, దయచేసి 26 & 27 ఆగస్టులోని అనుదిన మన్నాని చూడండి]

లేఖన పఠనము
ఆదికాండము 13:2
ద్వితీయోపదేశకాండము 28:11
కీర్తనలు 34:10
సామెతలు 10:22

ప్రార్థన క్షిపణులు (అంశములు)
1. తండ్రీ, యేసు నామంలో, నేను అధికార సంపాదనను పొందుతాను మరియు యేసు నామంలో ప్రతి అప్పుల భారం నుండి విముక్తి పొందుతాను.

2. ప్రభువా, నా చేతుల కష్టార్జితమును దీవించు మరియు అభివృద్ధి పరచు, యేసు నామంలో నా జీవన ప్రగతి మరియు వ్యాపారంలో తెరిచి ఉంచిన ద్వారములను అనుభవించేలా చేయి.

3. ప్రభువా, స్త్రీ పురుషులను లేవనెత్తుము మరియు నా పేరు ఎక్కడ ప్రస్తావించబడినా వారు నన్ను మంచిగా జ్ఞాపకముంచుకొనేలా చేయుము, యేసు నామములో.

4. తండ్రీ, నీవు ప్రేమ యొక్క ఉపచారమును మరచిపోరని మరియు నీళ్లు పోయివారికి నీళ్ళు పోయబడును అని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యేసు నామంలో, నా గత దాతృత్వం మరియు కానుకలు నా కోసం మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను.

5. తండ్రీ, ప్రతి సమయంలో, నా కళ్ళు మరియు చెవులు అవకాశాల కోసం తెరవబడును గాక; యేసు నామంలో అవకాశాలు వచ్చినప్పుడు నేను గుడ్డిగా మరియు చెవిటివాడిగా ఉండను.

6. నేను ఇచ్చే వాడిగా ఉంటాను కాని పుచ్చుకునే వానిగా ఉండను. నేను యేసు నామంలో నా స్నేహితుల కుటుంబానికి, పొరుగువారికి మరియు సహోద్యోగులకు ఆర్థిక భారముగా ఉండను.

7. జీవన ప్రగతిలో మరియు నా జీవితంలోని ప్రతి రంగంలో నా పెట్టుబడులన్నీ ఫలించడం మరియు సంపూర్ణంగా వృద్ధి అగుట ప్రారంభిస్తాయి .

8. ప్రభువా, యేసు నామంలో ఆర్థిక సహాయం కోసం నా వైపు చూసే ఎవరైనా వారు నిరాశ కలగకుండా ఉండే శక్తి కోసం నేను ప్రార్థిస్తున్నాను.

9. యేసు నామంలో నా పేదరికపు చరిత్రను మింగేసే సమృద్ధి యొక్క కొలమానాన్ని నాకు దయచేయి.

10. ఆర్థిక అవకతవకలు ఉంటే, తండ్రీ, నన్ను దీవించు మరియు సమృద్ధిగా ఆనందించేలా చేయి, యేసు నామంలో.


Join our WhatsApp Channel


Most Read
● డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
● దీవించబడిన వ్యక్తి (ధన్యుడు)
● మీ విధిని మార్చండి
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?
● మీ నిజమైన విలువను కనుగొనండి
● ఇవ్వగలిగే కృప - 3
● సరైన వాటి మీద దృష్టి పెట్టుట
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్