english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రభువుతో నడవడం
అనుదిన మన్నా

ప్రభువుతో నడవడం

Saturday, 24th of August 2024
1 1 747
Categories : శిష్యత్వం (Discipleship)
ఎవరో ఇలా అన్నారు, "దేవుడు అంటిపెట్టుకుని ఉన్న వధువును మాత్రమే కాకుండా నడవ వల్సిన భాగస్వామిని కూడా వెతుకుతున్నాడు." మొదటి నుండి, దేవుడు ఆదాము హవ్వలతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అది వారు "చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్నట్లు" కనుగొన్నారు (ఆదికాండము 3:8).

దేవునితో నడవడం యొక్క నిజమైన ఆనందాన్ని వెలికితీసిన మొదటి వ్యక్తి హనోకు .

హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తె లను కనెను. హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. (ఆదికాండము 5:22-24)

ఇప్పుడు క్రొత్త నిబంధనకు వేగంగా ముందుకు వెళ్లుదాం. అక్కడ ప్రభువైన యేసు నీటి మీద నడుస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇది చూసిన పేతురు ఆయనకు ఉత్తరమిస్తూ, "నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని" ఆయనతో ఇలా అనెను. (మత్తయి 14:28)

"అతను నీటి మీద నడవడానికి ప్రయత్నించకూడదు" అని చాలా మంది పేతురును విమర్శించారు. దేవుడు గొప్పగా ఉపయోగించిన విలియం కేరి, "దేవుని యొక్క గొప్ప విషయాలను ఆశించండి మరియు దేవుని కోసం గొప్ప విషయాలను ప్రయత్నించండి" అని ఒకసారి అన్నాడు.

మనం ఆయనతో కలిసి నడవాలన్నది దేవుని చిత్తం అని మీరు గమణించండి మరియు ఆయన ఈ చిత్తాని మనలో ఉంచారు, తద్వారా మనం ఆయనతో నడవడానికి. పేతురు ప్రభువుతో నీటి మీద నడవాలని కోరుకునే కారణం ఇదేనని నేను నమ్ముతున్నాను.

పెద్ద ప్రశ్న: నేను ప్రభువుతో ఎలా నడవగలను?

పేతురు చెప్పిన దానిని గమనించండి, "నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము". మరో మాటలో చెప్పాలంటే, పేతురు ఇలా అన్నాడు, "ప్రభువు వాక్యంతో మాట్లాడు, నేను నీళ్లమీద నడుస్తూ నీ దగ్గరకు వస్తాను." యేసు ఏదో మాట్లాడితే అది నెరవేరుతుందని పేతురు అనుభవం నుండి తెలుసుకున్నాడు.

ఆయన (ప్రభువైన యేసు) "రమ్మన" గానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను. (మత్తయి 14:29)

నీటి మీద నడవడం చాలా కష్టమైన ప్రతిపాదనలా అనిపిస్తుంది, కాని పదం మీద నడవడం నీటి మీద నడవడం లాంటిది. ఇప్పుడు నేను మిమల్ని అక్షరాలా నీటి మీద నడవమని చెప్పడం లేదు, కానీ మీరు మరియు నేను ప్రభువుతో కలిసి నడవాలంటే, మన జీవితం దేవుని వాక్య పునాదిపై ఆధారపడి ఉండాలి.

మన ఎంపికలు, మన నిర్ణయాలు, మన కోరికలు దేవుని వాక్య సిధ్ధాంతాలపై ఆధారపడితే, మనం ఎప్పటికీ మునిగిపోము. బదులుగా, మనము ప్రభువుతో నడవడం ముగించి చరిత్రను సృష్టిస్తాము. విశ్వాసం అనేది చీకటిలో ఒక దాటుట కాదు, కానీ దేవుని వాక్యంపై ఒక దాటుట. మీరు మరియు నేను అరుదైన జాతుల చేరికలో చేరడానికి, మన జీవితమంతా దేవుని వాక్యంపై ఆధారపడాలి.

తన జీవితాన్ని దేవుని వాక్యంపై ఆధారపడే రహస్యాన్ని దావీదు అర్థం చేసుకున్నాడు. ఇది ఒక రహస్యం, అతన్ని ప్రభువుతో సన్నిహితంగా నడిపించేలా చేసింది. ఇది మాత్రమే కాదు, అది అతన్ని ఇశ్రాయేలు రాజుగా చేసింది.

నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ న్యాయ విధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. (కీర్తనలు 119:105-109)

దావీదు కీలకమైన నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు, తన నిర్ణయాత్మక ప్రక్రియను ప్రభావితం చేయడానికి దేవుని వాక్యాన్ని అనుమతించాడు. అతడు దేవుని వాక్యంతో రాజీపడి శీఘ్ర పరిష్కారాలను సాధించగలిగిన సందర్భాలు ఉన్నాయి మరియు అయినను అతడు ఈ వాక్యం మీద గట్టిగా నిలబడ్డాడు. ప్రభువు స్వయంగా దావీదును నా హృదయానుసారుడైన మనుష్యుడు పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. (అపొస్తలుల కార్యములు 13:22)
ప్రార్థన
తండ్రీ, నా జీవితాన్ని నీ వాక్యం మీద ఆధారపడడానికి నాకు సహాయం చేయి. నేను బైబిల్ చదివేటప్పుడు నాతో మాట్లాడు. నన్ను కలవరపెడుతున్న ప్రతి ఇతర స్వరాలను తొలగించు. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● దేవుని లాంటి ప్రేమ
● దర్శనం మరియు ప్రత్యక్షతకి మధ్య
● దేవుని యొక్క 7 ఆత్మలు
● ఆయన వెలుగులో బంధాలను పెంపొందించడం
● ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి
● యేసు వైపు చూస్తున్నారు
● 35 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్