english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఎప్పుడు మౌనముగా ఉండాలి మరియు ఎప్పుడు మాట్లాడాలి
అనుదిన మన్నా

ఎప్పుడు మౌనముగా ఉండాలి మరియు ఎప్పుడు మాట్లాడాలి

Tuesday, 17th of September 2024
0 0 483
Categories : మాట్లాడుట (Speech) మౌనం (Silence)
ఎప్పుడు మాట్లాడాలో లేదా మౌనముగా ఉండాలో తెలుసుకోవడం జ్ఞానం మరియు వివేచన గురించి తెలియజేస్తుంది.

మౌనము సువర్ణముగా ఎప్పుడు ఉంటుంది?
అలాంటి సందర్భాలలో మనం మాట్లాడేది ఖచ్చితంగా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండదని మనకు తెలిసినప్పుడు కోపం యొక్క క్షణాలలో మౌనం ఉత్తమమైనది. యాకోబు 1:19 మనకు ఇలా నిర్దేశిస్తుంది: "నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను."

అదేవిధంగా, "జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను" (1 పేతురు 3:10)

పాపం చేయకుండా ఉండటానికి మౌనం మాకు సహాయపడుతుందని లేఖనము చెబుతుంది (సామెతలు 10:19), వివేకియైనవాడు మౌనముగా నుండును (సామెతలు 11:12), మరియు జ్ఞాని మరియు తెలివైనవాడు (సామెతలు 17:28). మరో మాటలో చెప్పాలంటే, మీ నాలుకను నిగ్రహించడం ద్వారా మీరు దీవించబడవచ్చు.

కొన్నిసార్లు మాట్లాడటం కంటే, వినడం మంచిది. అయినప్పటికీ, వినడం చాలా మందికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే దీనికి వినయం మరియు అన్యాయానికి గురయ్యే సుముఖత లేదా అపార్థం అయ్యే ప్రమాదం ఉంది. మానవ స్వభావం ఆత్మరక్షణ కోసం ఆకర్షిస్తుంది, కాని క్రీస్తు లాంటి వైఖరి మనల్ని మనం ఉపేక్షించుకొవలని ప్రేరేపిస్తుంది (మార్కు 8:34).

మౌనము ఎప్పుడు సువర్ణముగా ఉండదు
అప్పుడు ఆయన వారితో, "విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా!" అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి. (మార్కు 3:4)

మౌనము ఖచ్చితంగా సువర్ణం కానీ కొన్ని సమయాలు ఉన్నాయి.
చింపుటకు సమయం,
మరియు కుట్టుటకు సమయం;
మౌనంగా ఉండటకు సమయం,
మరియు మాట్లాడటానికి ఒక సమయం కలదు; (ప్రసంగి 3:7)

మౌనముగా ఉండటకు ఒక సమయం ఉందని, కానీ మాట్లాడుటకు కూడా ఒక సమయం ఉందని లేఖనము స్పష్టంగా చెబుతుంది. అతను లేదా ఆమె తప్పక మాట్లాడవల్సినప్పుడు ఒకరు మాట్లాడకపోతే, అది ప్రమాదకరం.

మంచి వ్యక్తులు తమ ఓటును ఉపయోగించనప్పుడు, తప్పుడు వ్యక్తులు అధికారంలోకి వస్తారు. మౌనం ప్రమాదకరమని ఇది ఒక ఉదాహరణ.

సువార్తను ప్రకటించడములో మౌనంగా ఉండకూడదు. సువార్తను ప్రకటించడం మనం సిలువ గురించి సిగ్గుపడుటలేదని తెలియజేస్తుంది. క్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ " కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి" (మత్తయి 28:19)

యేసు శిష్యులు మరియు ఇతర సాక్షులు ఈ ఆజ్ఞను ధిక్కరించడానికి ఎంచుకొన్ని ఉంటే? మీరు మరియు నేను ఖచ్చితంగా ప్రభువును తెలుసుకునే వారము కాదు.

అలాగే, మీరు సంఘములో ఏదైనా తప్పు జరుగుతుడం గమనించినట్లైతే, తెలివిగా సరైన అధికారులకు సమాచారం అందించండి. మౌనముగా ఉండటం చాలా మందికి మూల్యం చెల్లించడానికి కారణం కావచ్చు.

కాబట్టి మనం ఎలా మాట్లాడాలి?
1 పేతురు 3:15 "అడిగేవారికి సమాధానం ఇవ్వమని", నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను ఇవ్వుటకు మనకు నిర్దేశిస్తుంది.

కొలొస్సయులకు 4:6 మనకు ఇలా నిర్దేశిస్తుంది: "ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి." మన లక్ష్యం "మనుష్యులందరియెడల సంపూర్ణ మైన సాత్వికమును కనుపరచుచు ఉండవలెను" (తీతుకు 3:2).

మార్టిన్ నీమెల్లర్ (1892-1984) ఒక ప్రముఖ పాస్టర్, ఆయన అడాల్ఫ్ హిట్లర్ యొక్క బహిరంగ శత్రువుగా ఉద్భవించాడు మరియు గత ఏడు సంవత్సరాల నాజీ పాలనను నిర్బంధ శిబిరాల్లో గడిపాడు.

మంచి పలుకుల నీమెల్లర్ బహుశా ఉత్తమంగా గుర్తించబడ్డాడు :

మొదట, వారు సామజిక పరమైన వారి కోసం వచ్చారు, నేను ఏమి మాట్లాడలేదు-
ఎందుకంటే నేను సామజిక పరమైన వ్యక్తిని కాదు. 
అప్పుడు వారు వాణిజ్య సంఘపు వారి కోసం వచ్చారు, నేను ఏమి మాట్లాడలేదు-
ఎందుకంటే నేను వాణిజ్య సంఘపు వాదిని కాదు.
అప్పుడు వారు యూదుల కోసం వచ్చారు, నేను ఏమి మాట్లాడలేదు
ఎందుకంటే నేను యూదుడిని కాదు.
అప్పుడు వారు నా కోసం వచ్చారు - నాతో మాట్లాడటానికి ఇంకా ఎవరూ లేరు అక్కడ.
ప్రార్థన
తండ్రీ, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో జ్ఞానం మరియు వివేచన దయచెయ్యి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో నని నేను తెలిసికొనుటకై నా ప్రతి సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగా ఉండును గాక. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● హామీ గల సంతృప్తి
● 34 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● నమ్మకమైన సాక్షి
● యూదా ద్రోహానికి నిజమైన కారణం
● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● మీ భవిష్యత్తు కొరకు దేవుని కృప మరియు ఉద్దేశ్యాన్ని హత్తుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్