అనుదిన మన్నా
దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #3
Monday, 23rd of September 2024
0
0
262
Categories :
ఇవ్వడం (Giving)
కొన్ని సంవత్సరాల క్రితం, నాకు గుర్తుంది, నేను ఒక ముఖ్యమైన ఆరాధన కోసం ఆలస్యం అయ్యాను, మరియు ఆతురుతలో, నేను నా చొక్కా బటను తప్పుగా పెట్టుకున్నాను. ఆరాధన సమయంలో, నాకు దాని గురించి కూడా తెలియదు. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఈ వాస్తవాన్ని నేను గ్రహించాను. నా చొక్కా పైన బ్లేజర్ ధరించినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను; లేకపోతే, అది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది.
గమనించండి, మీరు మొదటి బటన్‌ను మాత్రమే తప్పుగా పెడితే, ఆపై మిగతావన్నీ అదే విధంగా ఉంటాయి. మన ప్రాధాన్యతలకు కూడా ఇది వర్తిస్తుంది. మనకు మొదటిది తప్పుగా ఉంటే, మిగతావన్నీ తప్పుగా ఉంటాయి. దీని విపరీతం కూడా చాలా వాస్తవం. మనకు మొదటిది సరిగ్గా ఉంటే, మిగిలినవి దాని స్థానంలో ఉంటాయి.
క్రింది విధంగా ఈ సత్యాన్ని అందంగా వివరిస్తాయి.
మీరు చేసే ప్రతి పనిలో, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, ఆయన నిన్ను నిర్దేశిస్తాడు మరియు నీ ప్రయత్నాలను విజయవంతం చేస్తాడు. (సామెతలు 3:6 టిఎల్‌బి)
మన ఆర్ధిక విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. సామెతలు 3:9-10 ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించింది
"నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును."
మనం మొదట దేవునికి ఇవ్వాలి, మిగిలి ఉన్నదాన్ని దేవునికి ఇవ్వకూడదు. మనము దీన్ని చేసినప్పుడు, మన జీవితంలోని ప్రతి రంగంలో ఆయన నింపుదల పొంగిపొర్లుతుంది.
మన ఆర్ధిక విషయంలో దేవునికి ఎందుకు మొదటి స్థానం ఇవ్వాలి?
#1
భూమి దేవునికి చెందినది! లోకంలోని ప్రతిదీ ఆయనది! (కీర్తనలు 24:1 టిఎల్‌బి)
మన ఆర్ధిక విషయంలో ప్రభువును గౌఘనపరచడంలో ప్రధానమైన తాళం చెవీ, సమస్తము ఆయనకు చెందినవి అనే విషయాన్ని గుర్తుంచుకోవడం - మీరు మరియు నేను మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నాము. మీకు గుర్తుంటే, ఆదాము హవ్వలను ఏదెను వనంలో బాధ్యతలు నిర్వర్తించారు. వారు దానిని స్వంతంగా సంపాధించుకోలేదు కాని దానిని నిర్వహించారు అంతే. (ఆదికాండము 2:15) అదేవిధంగా, మన సంరక్షణలో దేవుడు అప్పగించిన వాటికి మనము నిర్వాహకులు మాత్రమే.
దావీదు ఈ సత్యాన్ని అర్ధం చేసుకున్నాడు, అతడు దేవుణ్ణి తన ఆర్ధిక విషయంలో మొదటి స్థానంలో ఉంచి ఇలా అన్నాడు, "మాకు ఉన్నదంతా నీ నుండి వచ్చింది, మరియు నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము" (1 దినవృత్తాంతములు 29:14 టిఎల్‌బి)
#2
రెండవది, విషయాలు కఠినంగా ఉన్నప్పుడు కూడా మీ ఆర్ధిక విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మీ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఖచ్చితమైన మార్గం.
దేవుని దాసుడు తండ్రి మోరిస్ సెరుల్లో మొదట ప్రభువుకు ఇవ్వుడి అనే సందేశం విన్నట్లు నాకు గుర్తుంది. నా ఆత్మలో నేను తీవ్రంగా దోషిగా మరియు సవాలు చేయబడ్డాను. నేను ప్రభువుకు ఇవ్వడంలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అయితే, ఇది అంత తేలికైన ప్రయాణం కాదని నేను మీతో నిజాయితీగా చెప్పుతున్నాను. ఇందులో ఆందోళన మరియు కన్నీళ్లు ఉన్నాయి. ఆర్థిక రంగంలో దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచడానికి నేను చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే, మంచి విషయం ఏమిటంటే, నా జీవితంలో, నా ఉద్యోగంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. ప్రతిచోటా ద్వారాలు తెరవబడటంతో అన్ని వైపులా అనుకూలంగా ఉంది.
మొదట, ఇది కేవలం యాదృచ్చికం అని నేను అనుకున్నాను, కాని అది జరుగుతూనే ఉంది. సహజమైన వివరణ లేదు - నా కోసం దేవుడు కార్యం చేస్తున్నాడని నాకు తెలుసు.
1 రాజులు 17 సారెపతు యొక్క విధవరాలు గురించి చెబుతుంది. అప్పటికే ఆమె తన భర్తను కోల్పోయింది, ఇప్పుడు ఆమె తీవ్ర కరువును ఎదుర్కొంటోంది. ఆమె బాధల జాబితాలో చేర్చడానికి, ఇప్పుడు ఆమె కరువు కారణంగా తన కుమారున్ని కూడా కోల్పోయే అంచున ఉంది. అటువంటి అస్పష్టమైన పరిస్థితిలోనే దేవుడు తన ప్రవక్తను ఆమె వద్దకు పంపాడు.
అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, "భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని" ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. (1 రాజులు 17:13-14)
దేవుడు తన ప్రవక్తను ధనవంతుడి వద్దకు పంపించలేదని, కానీ తనకు తగినంతగా లేని ఒక పేద విధవరాలి అని నేను ఆలోచించాను.
"నాకొక చిన్న అప్పము మొదటచేసి నా యొద్దకు తీసికొనిరమ్ము" అని ప్రవక్త చెప్పడం గమనించండి. మొదట, ఇది చాలా అప్రియమైనదిగా అనిపిస్తుంది, కాని మీరు చూస్తే, అది ప్రవక్తకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న విధవరాలు కాదు, కానీ దేవుడు విధవరాలుకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా సార్లు, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా, మనం నిజంగా ప్రభువుకు సహాయం చేస్తున్నామని అనుకుంటున్నాము, కాని వాస్తవానికి, దేవుడు మనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నా ఆర్ధిక విషయంలో నేను నిన్ను ఘనపరచినప్పుడు, నీవు నింపుదల ప్రవాహాముతో నింపి విడుదల చేస్తావని చెప్పే నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను మరియు గ్రహిస్తున్నాను. తండ్రి, యేసు నామములో, ఇవ్వుట సమస్యకు సంబంధించి నా హృదయంతో మాట్లాడు. నీతో పోటీపడే ఏదీ నా హృదయంలో ఉండను గాక.
Join our WhatsApp Channel
Most Read
● ధారాళము యొక్క ఉచ్చు● సమృద్ధి కోసం మరచిపోబడిన తాళంచెవి
● తగినంత కంటే అత్యధికముగా అద్భుతాలు చేసే దేవుడు
● ప్రార్థనలో అత్యవసరం
● దైవ క్రమము -1
● మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు
● భూపతులకు అధిపతి
కమెంట్లు