english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రేమ గల భాష
అనుదిన మన్నా

ప్రేమ గల భాష

Thursday, 3rd of October 2024
0 0 466
Categories : ప్రేమ (Love) భాష (Language)
vఎవరో ఇలా అన్నారు, "ఇంటిని తగలబెట్టడానికి మీకు పెట్రోల్ అవసరం లేదు, మీకు మాటలు చాలు". ఇది చాలా వరకు నిజం! మాటలు నిర్మించగలవు మరియు మాటలు నాశనం చేయగలవు. ముఖ్యంగా సంబంధాల విషయానికి వస్తే, మాటలు శక్తివంతమైనవి. స్వస్థత మరియు పునరుద్ధరణను తీసుకురావడానికి మాటలకు శక్తి ఉంది, మరియు మరోవైపు, మాటలకు కోసే మరియు గాయపరిచే శక్తి ఉంది.

యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి (యోబు 6:25)

చాలా తరచుగా, "నా హృదయంలో ఏమీ లేదు. ఆ క్షణంలో నాకు ఎలా అనిపిస్తుందో నేను అలా మాట్లాడుతాను, ఆపై నా పని అయిపోతుంది" అని ప్రజలు చెప్పడం నేను వింటుంటాను. ఈ లోకంలో, ఇది చాలా మటుకు బాగుంటది మరియు శ్రావ్యంగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి, ఇది చాలా నొప్పి మరియు గాయాలను కలిగిస్తుంది, అది బాగు చేయడానికి చాలా సమయం పడుతుంది. బైబిల్ సత్యాన్ని మాట్లాడమని మనకు ఆజ్ఞాపించినప్పటికీ, ప్రేమగలిగి సత్యం చెప్పండం నేర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా, మనం క్రీస్తులాగే అవుతాము. (ఎఫెసీయులకు 4:15)

చాలా తరచుగా, మనకు దగ్గరగా ఉన్నవారిని మనము చాలా అగౌరవంగా చూస్తాము. మనము వారిని చాలా సాధారణంగా పరిగణిస్తాము మరియు తరచూ వారిని పెద్దగా పట్టించుకోము. మనము వారిని పేర్లతో పిలుస్తాము, ధన్యవాదాలు చెప్పే ప్రాథమిక మర్యాదలను ఉపయోగించము. చాలా మంది అపరిచితులతో కలిసిపోవచ్చు, కానీ వారితో స్వంత వారీగా ఉండలేరు. ఇది మీరే అయితే, మీరు మీ అనుదిన సంభాషణలో ఉపయోగించే మాటలకు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

మీరు మీ అభినందనలు మరియు మీ అవమానాలు మరియు వ్యంగ్య మాటలతో మరింత ఉదారంగా ఉంటే మీ దగ్గరి సంబంధాలు ఎలా మరింత దగ్గరవుతాయో మీరు ఆశ్చర్యపోతారు. ఉదా: మీ భార్య లేదా తల్లి మంచి భోజనం వండితే, వారిని ఉదారంగా అభినందించండి. ఇంట్లో లేదా కార్యాలయంలో ఎవరైనా చిన్న సహాయం చేస్తే, మీరు వారిని ఎంతగా అభినందిస్తున్నారో వారికి తెలియజేయండి.

గుర్తుంచుకోండి, ప్రోత్సాహక మాటలు ఒక వ్యక్తిని అభివృద్ధి పరుస్తుంది మరియు హృదయపూర్వక అభినందన ఒక వ్యక్తిని శక్తివంతం చేస్తుంది.

చాలా మంది పిల్లలు తల్లిదండ్రులచే ఎప్పటికప్పుడు యవ్వనంలో భయపడుతు పెరుగుతుంటారు కాని ఎవరు వారిని శారీరకంగా హింసించరు, కానీ బాధాకరంగా, కోపం లేదా అజాగ్రత్త మాటల ద్వారా వారిని హింసించడం మానేయరు.

క్రైస్తవ జీవితం క్రైస్తవ మాటల ద్వారా ఆధారపడి ఉంటుందని ఎప్పటికీ మర్చిపోకండి. మీరు మాట్లాడే విధానాన్ని గమనించండి. మీ నోటి నుండి చెడు లేదా దుర్భాషయేదైనను రానియ్యకుడి. మేలు కలిగే మాటలు మాత్రమే పలకండి; ప్రతి మాట బహుమతి లాంటిది. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధమును, చర్చలతో విసర్జించుడి. ఒకని యెడల ఒకడు ధయగలిగి ఉండుడి. (ఎఫెసీయులు 4:29, 31 Msg)
ప్రార్థన
తండ్రీ, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది నేను తెలిసికొనుటకై నా సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండును గాక. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● 03 రోజు : 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కాపలాదారుడు
● మీరు అసూయను ఎలా నిర్వహిస్తారు
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #1
● పరలోకపు ద్వారములను తెరవండి & నరకపు ద్వారములను మూసేయండి
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #2
● మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్