english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. పరలోకము యొక్క వాగ్దానం
అనుదిన మన్నా

పరలోకము యొక్క వాగ్దానం

Monday, 7th of October 2024
0 0 313
Categories : పరలోకము (Heaven)
మనం ఎక్కడో శాశ్వతంగా జీవిస్తాం అనే భావన మానవ చరిత్రలోని ప్రతి నాగరికతను రూపుదిద్దుకుంది.

నేను ఐగుప్తును సందర్శించినప్పుడు, ఐగుప్తు రాతి నిర్మాణంలో, ఎంబాల్డ్ (శవము కుళ్ళిపోకుండా ఉండేటట్టు పరిమళ ద్రవ్యములను నించి కాపాడుట) మృతదేహాలు భవిష్యత్తు ప్రపంచంలో మార్గదర్శకులుగా వాటి పక్కన పటాలుగా ఉంచబడ్డాయని గైడ్ నాకు చెప్పారు. ఇప్పుడు, వారు నమ్మినది ఇదే.

ఇటలీలోని రోమ్‌లో, అనేక మంది మృత్యువీరుల క్రైస్తవుల మృతదేహాలను ఖననం చేసిన రోమా సమాధి. ఈ సమాధి క్రీ.శ 2వ శతాబ్దం నాటిది. అందమైన ప్రకృతి దృశ్యాలతో పరలోకాన్ని తలపించే సమాధి గోడలపై చిత్రాలు, పిల్లలు ఆడుకోవడం మరియు విందు పట్టికలలో విందు చేసే వ్యక్తులను చూడవచ్చు.

కొన్ని సంవత్సరాల క్రితం, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, నాకు పరలోకం యొక్క దర్శనం కలిగింది, అందులో నేను పరలోకపు భవనాలను చూశాను. ఈ భవనాలు చాలా పొడవైనవి, వాటి వెలుపలి భాగాలు చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. ఇది విశాలమైన నగరం లాంటిది. నగరం అంతటా ఒక రకమైన ప్రకాశం ఉంది.

ఇప్పుడు కొంత మందికి, ఇవన్నీ మీకు అద్భుత కథలాగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ లేఖనాలలో లోతుగా వ్రాయబడ్డాయి.

అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు ఇలా వ్రాశాడు:
21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
23 ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు. (ఫిలిప్పీయులకు 1:21,23)

వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొను చున్నాము, ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. (2 కొరింథీయులకు 5:6,8)

ఇది చదివినప్పుడు మీలో చాలా మంది, ఏదో ఒక సమయంలో, మీ ప్రియమైన వ్యక్తిలను కోల్పోయుంటారు. వారు ప్రత్యకమైన స్థలంలో ఉన్నారని మనమందరం విశ్వసిస్తున్నాము మరియు నమ్ముతున్నాము. కొన్నిసార్లు, భయం మరియు సందేహం మన హృదయాల్లోకి వస్తాయి, మరియు "మనం కూడా ఎప్పుడైనా అక్కడ వెళ్ళవలసిన వారమని" మనము ఆశ్చర్యపోతుంటాము.

ఫ్రాన్స్ చక్రవర్తి, లూయిస్ XIV తన సమక్షంలో 'మరణం' అనే పదాన్ని పలకకూడదని ఒక చట్టాన్ని ఆమోదించాడు. ఈ విధంగా అతడు మరణానికి ఎంత భయపడ్డాడు అని తెలియజేస్తుంది.

ప్రభువైన యేసు ఈ సమస్యను ఉద్దేశించి, "మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నా యందును విశ్వాస ముంచుడి."

ప్రభువైన యేసు తప్పనిపరిస్థితులలో ఇలా అన్నాడు, "మీరు దేవుణ్ణి నమ్మారు, అది మంచిది, మీరు నా యందును విశ్వాస ముంచుడి " అయనే తండ్రి దగ్గరకు వెళ్లే మార్గం.

యేసు వారికి శాశ్వతమైన నివాసం గురించి హామీ ఇచ్చాడు.
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. (యోహాను 14:1-3)

గమనించండి, ప్రభువైన యేసు ఇల్లు, భవనం, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో మరియు మన కోసం ఏమి సిద్ధం చేస్తున్నాడో వివరించడానికి స్థలం వంటి సాధారణ భౌతిక పదాలను ఉపయోగించాడు. ఆయన తన శిష్యులకు (అది మీరు మరియు నేను) మనం ఎక్కడికి వెళ్లి ఆయనతో ఉండగలమో దాని గురించి ఎదురుచూడాలని కోరుకుంటున్నాడు.

పరలోకము యొక్క వాగ్దానం ముఖ్యమైనది. ఇంట్లో లేదా ఆసుపత్రిలో మంచం మీద పడుకున్నా మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇది చాలా మందికి ఓదార్పు మరియు ఆశను కలిగించింది. పరలోకము నిజమైన స్థలము, అది శాశ్వతమైన నివాసము
ప్రార్థన
ప్రభువైన యేసు, నీవు దేవుని కుమారుడవు మరియు దేవుని యొద్దకు చేరడానికి ఏకైక మార్గం. నేను నిన్ను నా ప్రభువు మరియు రక్షకుడిగా అంగీకరిస్తాను. నా కోసం సిలువపై నీ విలువైన త్యాగానికి వందనాలు. నేను నిన్ను మరింత వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నీ కృపకై నిన్ను వేడుకుంటున్నాను. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● 09 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● Day 13: 40 Days Fasting & Prayer
● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
● రాజ్యంలో వినయం మరియు ఘనత
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్