english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. భయపడే ఆత్మ
అనుదిన మన్నా

భయపడే ఆత్మ

Thursday, 17th of October 2024
1 0 291
Categories : మానసిక ఆరోగ్యం ( Mental Health)
"నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను." (యెషయా 41:10)

భయం అనేది నేడు ప్రపంచంలో అత్యంత విస్తృతమైన, విధ్వంసక శక్తులలో ఒకటి. ఉద్యోగం పోతుందనే భయం అయినా, అనారోగ్య భయం అయినా, వైఫల్యం భయం అయినా సరే, భయం మన జీవితాల్లోకి చొరబడి నెమ్మదిగా మనల్ని తినేస్తుంది. భయం ముఖ్యంగా ప్రమాదకరమైనది ఏమిటంటే, మనల్ని పక్షవాతానికి గురిచేసే దాని సామర్థ్యం, మనం శక్తిహీనులుగా, దేవుని వాగ్దానాల నుండి దురపరిచే భావించేలా చేస్తుంది. అయితే భయం అనేది దేవుడు మనకు ఇచ్చేది కాదని బైబిలు పదే పదే చెబుతోంది. నిజానికి, “భయపడకుము” అని బైబిలు మనకు పదే పదే ఆజ్ఞాపిస్తోంది.

భయం ఒక భావోద్వేగం కంటే ఎక్కువ - ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం. ఇది మనకు వ్యతిరేకంగా శత్రువుల ప్రాథమిక ఆయుధాలలో ఒకటి, మనం జాగ్రత్తగా ఉండకపోతే, అది మన నిర్ణయాలను నియంత్రించడం, మన మనస్సులను మబ్బు చేయడం, దేవుడు మన కోసం ఉద్దేశించిన ఆనందాన్ని దోచుకోవడం ప్రారంభించవచ్చు. కానీ నిరీక్షణ అనేది ఉంది. మనం భయంతో జీవించాలని దేవుడు కోరుకోడు, దానిని అధిగమించడానికి అవసరమైన ప్రతిదాన్ని ఆయన మనకు ఇచ్చాడు.

భయం అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. కొన్నిసార్లు, ఇది వైఫల్య భయం-ఇక్కడ మనం పొరపాటు చేయడానికి చాలా భయపడతాము, మనం ఎటువంటి ప్రమాదం తీసుకోకుండా ఉంటాము. ఇతర సమయాల్లో, ఇది తెలియని భయం, ఇక్కడ మనం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాము దాని ఫలితంగా, మనం దేవుని ప్రణాళికను విశ్వసించడానికి కష్టపడతాము. భయం అభద్రత రూపంలో కూడా ఉంటుంది, ఇక్కడ మనం తగినంతగా మంచిగా లేమని, తగినంత తెలివిగలవారమని లేదా విజయవంతం కావడానికి తగిన వారు కాదని మనం నిరంతరం భావిస్తాం.

అయినప్పటికీ, 2 తిమోతి 1:7 మనకు శక్తివంతమైన ఏదో చెబుతోంది: "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు." దీని అర్థం భయం దేవుని నుండి కాదు-ఇది శత్రువు వ్యూహం. మనల్ని కంగారు పెట్టడానికి, మనల్ని మనం అనుమానించుకునేలా చేయడానికి మరీ ముఖ్యంగా, మన జీవితాల పట్ల దేవుని ప్రేమను వాగ్దానాలను అనుమానించేలా చేయడానికి సాతాను భయాన్ని ఉపయోగిస్తాడు.

భయం మనల్ని స్తంభింపజేస్తుంది కాబట్టి మనం భయంతో జీవించినప్పుడు శత్రువు అభివృద్ధి చెందుతాడు. మనం భయంతో మునిగిపోయినప్పుడు, మనం స్పష్టంగా ఆలోచించలేం, విశ్వాసంతో పనిచేయలేం తరచుగా దేవుడు మనలను నడిపిస్తున్న దిశలో ముందుకు సాగలేం. భయం మన తీర్పును కప్పివేస్తుంది పెద్ద రూపాన్ని చూడకుండా నిరోధిస్తుంది. దేవుని ఏర్పాటు రక్షణపై దృష్టి పెట్టే బదులు, భయం మనల్ని తప్పుగా జరిగే ప్రతిదానిపై దృష్టి పెట్టేలా చేస్తుంది.

అయితే ఇక్కడ మంచి శుభవార్త ఉంది: దేవుడు మనతో ఉంటాడని వాగ్దానం చేశాడు. యెషయా 41:10లో, "నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను." ఈ శక్తివంతమైన సత్యం భయంపై మన దృక్పథాన్ని మార్చగలదు. మన పోరాటాలలో మనం ఒంటరిగా లేము. దేవుడు మనతో ఉన్నాడు, ప్రతి సవాలులో, ప్రతి పరీక్షలో, ప్రతి అనిశ్చిత క్షణంలో మన వెంట నడుస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి భయానికి విరుగుడు.

భయాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన మార్గాలలో ఒకటి దానిని గుర్తించి, దానిని ప్రభువు ముందుకు తీసుకురావడం. తరచుగా, భయం చీకటిలో వృద్ధి చెందుతుంది-మనం దానిని విస్మరించడానికి ప్రయత్నించినప్పుడు లేదా దానిని లోతుగా పాతిపెట్టినప్పుడు అది పెరుగుతుంది. కానీ మనం మన భయాలను ప్రభువు వద్దకు తీసుకువచ్చినప్పుడు, ఆయన వాటిని తన సమాధానం, హామీతో భర్తీ చేస్తాడు. యెషయా 41:10 కేవలం భయపడవద్దని చెప్పడం లేదు; మనం ఎందుకు భయపడకూడదో అది మనకు కారణాన్ని తెలియజేస్తుంది: దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమాధానం, శక్తిని స్పష్టతను తెస్తుంది.

మీ జీవితంలో భయం పాతుకుపోయిన ప్రాంతాలను గుర్తించడానికి ఈరోజు కొంత సమయం వేచిచండి. ఇది వైఫల్య భయం, తెలియని భవిష్యత్తు లేదా అసమర్థత భయం కావచ్చు. వాటిని వ్రాసి, ప్రార్థనలో ఒక్కొక్కరిని దేవుని ముందు తీసుకురండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని వాగ్దానాలను మీ జీవితం మీద ప్రకటించండి, ఆయన మీకు శక్తి, ప్రేమ, మంచి మనస్సును ఇచ్చాడని తెలుసుకోవడం. గుర్తుంచుకోండి, మనం దానిని దేవుని సత్యపు వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు భయం దాని పట్టును కోల్పోతుంది.

యెషయా 41:10 మరియు 2 తిమోతి 1:7 కంఠస్థం చేయడం ప్రారంభించండి. భయం మొదలయినప్పుడల్లా, ఈ వచనాలను బిగ్గరగా పఠించండి దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకోండి. మీ హృదయాన్ని మనస్సును బలపరచడానికి ఆయన వాక్యాన్ని అనుమతించండి.
ప్రార్థన
యేసు నామంలో, నా జీవితంలో భయం నొందె ఆత్మను నేను తిరస్కరిస్తున్నాను. తండ్రీ, నీ సన్నిధిని విశ్వసించడానికి నీవు నాకు ఇచ్చిన శక్తి, ప్రేమ సమాధానంలో నడవడానికి నాకు సహాయం చేయి. నా భయాన్ని విశ్వాసంతో నింపు నీ వాగ్దానాల సంపూర్ణతలోకి నన్ను నడిపించు. యేసు నామంలో, ఆమేన్.


Join our WhatsApp Channel


Most Read
● యజమానుని యొక్క చిత్తం
● ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం అనుభవించే దీవెనలు
● క్రీస్తు ద్వారా జయించుట
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - I
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● పరలోకము యొక్క వాగ్దానం
● లోబడుటలో స్వేచ్ఛ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్