అనుదిన మన్నా
పరిపూర్ణ సిద్ధాంతపరమైన బోధన యొక్క ప్రాముఖ్యత
Saturday, 26th of October 2024
0
0
137
Categories :
దేవుని వాక్యం (Word of God)
సిద్ధాంతం (Doctrine)
అపొస్తలుడైన పాలు యవనస్తుడైన తిమోతికి సూచించినట్లు, "నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు." (1 తిమోతి 4:16).
నేడు చాలా మంది ప్రజలు తప్పుడు, మోసపూరిత బోధనలకు బలైపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వారికి వారి సిద్ధాంతపరమైన బోధన సక్రమంగా లేకపోవడం.
మీరు మీ సిద్ధాంతపరమైన బోధనాన్ని సక్రమంగా కలిగి ఉంటే, బైబిల్ నిజంగా ఏమి బోధిస్తుందో మీకు తెలిస్తే, మీరు తప్పుడు బోధనను తిరస్కరించవచ్చు మరియు మీ విశ్వాసాన్ని కాపాడుకోవచ్చు. క్రైస్తవులకు "పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని" (యూదా 1:4) అని యూదా ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు.
క్రైస్తవులుగా మనం బైబిల్ సిద్ధాంతపరమైన బోధనపై సరైన అవగాహన కలిగి ఉండటానికి రెండు ముఖ్యమైన కారణాలను మీకు తెలియజేయడానికి నాకు అనుమతివ్వండి?
1. మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి
మీరు ఎవరినైనా ప్రేమిస్తే, వారి ఇష్టా అయిష్టాలు గురించి మీరు వీలైనంత వరకు తెలుసుకోవాలనుకుంటారు. అదేవిధంగా, మనం దేవుడిని నిజంగా ప్రేమిస్తే, ఆయన గురించి, ఆయన స్వభావం, ఆయన పనుల గురించి మొదలైన వాటి గురించి తెలుసుకోవాలనే తపన మనలో ఉంటుంది. సరళమైన మాటలలో చెప్పాలంటే, దీనిని అభ్యసించే సిద్ధాంతం అని అంటారు.
ఒక సంవత్సరంలో ఆదికాండం నుండి ప్రకటన వరకు బైబిల్ చదవడం మీ లక్ష్యంగా పెట్టుకోండి. దావీదు చెప్పినదానిని జాగ్రత్తగా చూడండి, "నీ వాక్యము సత్యమైనది" (కీర్తనలు 119:160). సరళంగా చెప్పాలంటే, మీరు బైబిల్‌ను ఆ అంచున నుండి ఈ అంచున వరకు చదివినప్పుడు, మీరు బైబిల్ నుండి ఆయన చెప్పేది మరియు దేని మీద నిలబడాలి అని దేవుని యొక్క పూర్తి సిద్ధాంతాన్ని పొందుతారు.
2. కాబట్టి మీరు నమ్మేదే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందిస్తుంది
మీరు దేవుని గురించి ఆలోచించే విధానం మీరు దేవునితో సంబంధం కలిగి ఉండే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. దీని అర్థం ఏమిటి? ఉదాహరణకు: మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుడు నియంత్రణలో ఉంటాడని మీరు విశ్వసిస్తారు, తప్పు జరుగుతున్నప్పుడు మీరు ఆయన యందు విశ్వసించరు. సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం అంటే దేవుని గురించిన సత్యాన్ని కనుగొనడం. మరియు మనం అలా చేయాల్సిన అవసరం ఉంది, తద్వారా మనం ఆయన ఏమై యున్నాడో మరియు ఆయన గురించి ఊహించినట్టుగా కాకుండా. మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాము.
ప్రార్థన
ధన్యడగు పరిశుద్ధాత్మ యేసు నామంలో నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీవే మమల్ని సమస్తమైన సత్యాల్లోకి నడిపించేది. నాకు వాక్యాన్ని నేర్పు. నీ వాక్యం నుండి విలువైన సత్యాలను నాకు చూపించు. నేను యేసయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● ప్రారంభ దశలో దేవుణ్ణి స్తుతించండి● దోషానికి సంపూర్ణ పరిష్కారం
● పెంతేకొస్తు యొక్క ఉద్దేశ్యం
● అబద్ధాలను తొలగించడం మరియు సత్యాన్ని స్వీకరించడం
● దేవుడు భిన్నంగా చూస్తాడు
● 17 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దోషము యొక్క శక్తిని విచ్ఛిన్నం చేయడం - I
కమెంట్లు