english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీరు దేవుని తదుపరి రక్షకుడు కావచ్చు
అనుదిన మన్నా

మీరు దేవుని తదుపరి రక్షకుడు కావచ్చు

Monday, 4th of November 2024
0 0 447
Categories : ప్రవచనాత్మకమైన వాక్యం (Prophetic Word ) మన గుర్తింపు (Our Identity in Christ)
ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రా యేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. (న్యాయాధిపతులు 3:9)

ఒత్నీయేలు అనే వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?
బహుశా కాకపోవచ్చు

అతడు కాలేబు తోడబుట్టిన వాడి కుమారుడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళ్లినప్పుడు, యెహొషువ మరియు కాలేబు యొక్క సాహసోపేతమైన ప్రయత్నాల ద్వారా వారు విజయం సాధించారు. ఈ తరం పెరిగే కొద్దీ, కొత్త తరం ఆవిర్భవించడం ప్రారంభమైంది. విగ్రహాలను పూజించడం ద్వారా ఇశ్రాయేలు మళ్లీ పాపంలో పడిపోయింది. ప్రభువు యొక్క కోపం ఇశ్రాయేలు మీద రగిలింది, మరియు ఆయన శత్రువుల బానిసలుగా ఉండటానికి వారిని మరోసారి అప్పగించాడు. అయితే, ప్రజలు మళ్లీ ప్రభువుకు మొఱ్ఱపెట్టగా, దేవుడు వారి ప్రార్థన విన్నాడు.

దేవుని ప్రజలు ప్రభువుకు మొఱ్ఱపెట్టినప్పుడల్లా, వారు నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు ఆయన వారి ప్రార్థన వింటాడు. అలాంటి సమయం కోసం తాను సిద్ధపరచిన వారిని లేవనెత్తుట ద్వారా ఆయన ప్రతిస్పందిస్తాడు. ప్రతి సైనికుడు తాను పొందిన శిక్షణను ఉపయోగించుకునే రోజు కోసం ఎదురుచూస్తుంటాడు. దేవుడు అలాంటి సమయం కోసం తోడబుట్టిన వాడి కుమారుని సిద్ధం చేస్తున్నాడు. ఆయన తన బాబాయి కాలేబు వలె అదే ఆత్మను కలిగి ఉన్నాడు.

యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను. అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను. (న్యాయాధిపతులు 3:10-11)

మిమ్మల్ని మీరు తిరస్కరించబడిన, విరిగి నలిగిన మరియు దేనికీ పనికిరాని వ్యక్తిగా చూడవద్దు. బహుశా ఇది కూడా కావచ్చు, దేవుని ప్రజలను రక్షించడానికి లేదా వారికి ఏదో ఒకవిధంగా సహాయం చేయడానికి మిమ్మల్ని పిలిచే సమయం కోసం దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు.

ఈ రోజు మీరు "పేరు లేని వ్యక్తి" కావచ్చు, కానీ ప్రభువు ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు పూర్తిగా భిన్నమైన వ్యక్తి అవుతారు. దేవుని ఆత్మ మీ మీద నిలచియుండడానికి హృదయపూర్వకంగా ప్రార్థించండి.

ప్రభవు యొక్క ఆత్మ నా మీద ఉంది, ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. విరిగి నలిగిన హృదయాలను స్వస్థపరచడానికి, బంధింపబడిన వారిని రక్షించుటకు, చూపు లేని వారికి చూపును పునరుద్ధరించడానికి, గాయపడిన వారిని స్వంతంత్రులుగా చేయుటకు మరియు ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.
ప్రార్థన
ప్రభవు యొక్క ఆత్మ నా మీద ఉంది, ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. విరిగి నలిగిన హృదయాలను స్వస్థపరచడానికి, బంధింపబడిన వారిని రక్షించుటకు, చూపు లేని వారికి చూపును పునరుద్ధరించడానికి, గాయపడిన వారిని స్వంతంత్రులుగా చేయుటకు మరియు ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేయడానికి నేను పిలవబడ్డాను, ఎందుకంటే యేసు నామములో మహిమాస్వరూపియైన ఆత్మ నా మీద నిలచియున్నది, ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● నీతియుక్తమైన కోపాన్ని స్వీకరించడం
● ఒక దేశాన్ని రక్షించిన నిరీక్షణ
● అబద్ధాలను తొలగించడం మరియు సత్యాన్ని స్వీకరించడం
● పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ అంటే ఏమిటి?
● క్రీస్తులో మీ దైవిక విధిలో ప్రవేశించడం
● 20 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మంచి ధన నిర్వహణ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్