english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది
అనుదిన మన్నా

డబ్బు స్వభావాన్ని పెంపొందిస్తుంది

Friday, 15th of November 2024
0 0 234
Categories : డబ్బు నిర్వహణ (Money Management) స్వభావం (Character)
ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా. (సంఖ్యాకాండము 7:48)

మన అనుదిన జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు డబ్బును ఉపయోగించే విధానం కూడా మీ గురించి చెప్పబడుతుంది. దేవునికి డబ్బు అంత ముఖ్యమా? సంఘంలో లేదా ప్రార్థన సమావేశంలో డబ్బు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు నేను గమనించాను, కొంత మంది భయపడతారు; కొందరు మనస్తాపం చెందుతారు, కొందరు వ్యక్తులను తీవ్రంగా విమర్శిస్తారు, వారి పట్ల తీర్పు కూడా తీరుస్తారు. డబ్బు అంత ఉద్వేగభరితమైన భావాలను ఎందుకు రేకెత్తిస్తుంది?

మనలో చాలా మంది డబ్బు కోసం సమయాన్ని మార్చుకుంటారు; ఇతరులు ప్రతిభను మార్చుకుంటారు లేదా డబ్బు కోసం ప్రయాసపడుతారు. కొందరు తమ బలాన్ని మరియు చెమటను ఇస్తూ, రోజుకు 10-15 గంటలు పని చేయడం ద్వారా డబ్బు కోసం తమను తాము మార్చుకుంటారు. మరో మాటలో చెప్పాలంటే, డబ్బు 'మీరు ఎవరు' అని సూచిస్తుంది.

మీరు సంపాదించిన డబ్బు ద్వారా ఈ లోకంలోని ప్రజలు మీకు విలువ ఇవ్వడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు మీరు మీ డబ్బును దేవునికి సమర్పించినప్పుడు, మీరు మీలో కొంత భాగాన్ని అక్షరాలా దేవునికి తీసుకువస్తున్నారు. దుష్టుడు మరియు వాని సహచరులకు కూడా ఈ విషయం తెలుసు. వారు కూడా, మీ డబ్బు ద్వారా ఆరాధనను కోరుకుంటారు.

నిజం ఏమిటంటే, డబ్బు అనేది తటస్థంగా ఉంటుంది-అది మంచిది కాదు లేదా చెడ్డది కాదు. ఒక మంచి వ్యక్తి చేతిలో ఉంటే, దీనిని వైట్ మనీ అంటారు, లేకపోతే, దీనిని బ్లాక్ మనీ అంటారు.

బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు 
సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా? (సామెతలు 17:16)

డబ్బు ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మాత్రమే సూచిస్తుంది మరియు మీరు నిజంగా కట్టుబడి ఉన్న దానికి ఇది కొలమానం. ఈ అవగాహన చాలా కీలకం.

ఉదాహరణకు: మీకు కొంత చెడ్డ అలవాటు ఉందను కొండి, మీకు బోలెడంత డబ్బు అవసరం చేయాల్సి వస్తే, ఆ అలవాట్లను ఎక్కువగా చేయడానికి మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. డబ్బు కేవలం చెడు అలవాటును పెంపొందిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని కూడా పెంపొందిస్తుంది.

మదర్ థెరిస్సా గురించి ఏమిటి? ఆమె డబ్బును పేదలకు మరియు నిరుపేదలకు సేవ చేయడానికి ఉపయోగించింది. డబ్బు పెంపొందించే స్వభావంకు ఇక్కడ సానుకూల ఉదాహరణ.

డబ్బు మానవుని హృదయం లేదా స్వభావం యొక్క అంతర్గత ఆలోచనలను గురించి ఏదీ వెల్లడించదు. ఈరోజు నుండి మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకోండి. మీ వృద్ధ తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వండి. క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా దేవుని పనికి మద్దతు ఇవ్వండి. విధవ మరియు అనాధలను దీవించడానికి మీ డబ్బును ఉపయోగించండి. ఈ విధంగా, మీ డబ్బు నిజంగా దేవునికి మహిమను తెస్తుంది. (సామెతలు 3:9)
ప్రార్థన
1.పరలోకపు తండ్రీ, నీవు నాకు ఇచ్చిన ఆర్థిక దీవెనలకు వందనాలు. దయచేసి నా ఆర్థిక పరిస్థిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి నాకు సహాయం చేయి.

2. తండ్రీ, నేను నీ పనికి నా ఆర్థిక సమర్పణను ఇస్తున్నప్పుడు, నీ దీవెనలను నాపై కుమ్మరించు మరియు నేను విత్తే విత్తనాన్ని బలపరుచు. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● యుద్ధం కోసం శిక్షణ - II
● జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం
● ఆయనకు సమస్తము చెప్పుడి
● చిన్న విత్తనం నుండి పెద్ద వృక్షము వరకు
● దేవుడు మీ శరీరం గురించి శ్రద్ధ వహిస్తాడా?
● లోకమునకు ఉప్ప లేదా ఉప్పు స్తంభం
● ఒక విజేత కంటే ఎక్కువ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్