దేవునితో లోతుగా
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయ మందు నే నెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీద ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును. (కీర్తనలు 63:1-3)
మీరు యేసయ్యను వెంబడించడం గురించి గంభీరంగా ఉన్నారా? ఆయన "ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను" (లూకా 5:16). ఆయన "ప్రార్థించుటకు ఒంటరిగా పర్వతము మీదికి వెళ్ళెను" (మత్తయి 14:23). మోసగాడైన యాకోబు ఎలా "ఇశ్రాయేలు, దేవునికి అధిపతి" అయ్యాడు? (ఆదికాండము 32:28 చదవండి). "యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు (ప్రభువు యొక్క దూత) తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను" అని బైబిల్ చెబుతోంది (ఆదికాండము 32:24).
భార్యాభర్తలు ఎప్పుడూ ఒంటరిగా ఉండకపోతే వివాహం ఎలా చెడిపోతుందో, అలాగే, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయనతో ఏకాంతంగా గడిపే సమయాన్ని చేర్చకపోతే క్రీస్తుతో మన బంధం కూడా విఫలమవుతుంది. కలవరములో ఉన్న ఈ యుగంలో, దేవునితో ఒంటరిగా గడిపే సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
దేవునితో ఏకాంతంగా ఎలా గడపాలి లేదా ఉండాలి
1. ప్రార్థన యొక్క ప్రత్యేకమైన సమయాలను నిర్ధారించుకోవాలి
దానియేలుకు రోజూ మూడుసార్లు ప్రార్థించే అలవాటు ఉండేది. "ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. (దానియేలు 6:10).
ఈ ఉపవాస దినాలలో, మీరు ప్రార్థన మరియు సహవాసంలో దేవునితో నాణ్యమైన సమయాన్ని గడిపేలా చూసుకోండి. యిర్మీయా ఇలా వ్రాశాడు, "నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని" (యిర్మీయా 15:17).
2. స్తుతి మరియు ఆరాధన
కృతజ్ఞతాపూర్వకంగా మరియు స్తుతులతో దేవుని సన్నిధిలోకి ప్రవేశించమని మనకు తెలియజేయబడింది.
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి
కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి
ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. (కీర్తనలు 100:4)
3. ఆధ్యాత్మిక ప్రార్థన
ప్రార్థనలో రెండు రకాలు ఉన్నాయి:
- మానసిక ప్రార్థన మరియు
- ఆధ్యాత్మిక ప్రార్థన
మానసిక ప్రార్థన అంటే మీరు మీ అవగాహనతో మరియు మనస్సుతో ప్రార్థించడం, ఆధ్యాత్మిక ప్రార్థన అంటే మీరు భాషలో ప్రార్థించడం.
నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. (1 కొరింథీయులకు 14:14-15)
4. లేఖనాలను అధ్యయనం చేయండి మరియు పరిశోధించండి
మీరు వాక్యాన్ని చదివినప్పుడు, మీరు దేవునితో ప్రత్యక్ష సహవాసంలో ఉంటారు. వాక్యమే దేవుడు, మరియు దేవుని వాక్యాన్ని చదివే అనుభవం వ్యక్తిగతంగా దేవునితో ఒకరితో ఒకరు సంభాషణను కలిగి ఉంటుంది.
దేవునితో ఏకాంతంగా గడపడం వల్ల కలిగే ప్రయోజనాలు
దేవుడు జ్ఞాని మరియు సర్వజ్ఞుడు. మీరు ఆయనతో ఒంటరిగా గడపలేరు మరియు అజ్ఞానంగా ఉండలేరు. "ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగు యొక్క నివాసస్థలము ఆయన యొద్ద నున్నది. (దానియేలు 2:22)
మీరు దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు, మీరు శారీరక బలాన్ని పునరుద్ధరించుకోవడమే కాకుండా, మీరు ఆధ్యాత్మిక ఇంధనము (నూతన బలము) మరియు తాజాదనము కూడా ఆనందిస్తారు. యెషయా 40:31 ఇలా చెబుతోంది, "యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు."
కీర్తనలు 68:35 ప్రకారం, ఇశ్రాయేలు దేవుడే "తన ప్రజలకు బల పరాక్రమముల ననుగ్రహించుచున్నాడు." దేవునితో ఏకాంతంగా గడపండి, ఆయన మీకు శక్తిని మరియు బలాన్ని అనుగ్రహిస్తాడు.
- మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు
"మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి. (ఎఫెసీయులకు 5:18) మీరు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, మీ జీవితం పూర్తిగా పరిశుద్ధాత్మచే ప్రభావితమవుతుంది.
- మీరు దేవునితో సహవాసం చేస్తున్న సమయంలో అభిషేకం దుష్టున్ని కాడిని విచ్ఛిన్నం చేస్తుంది
ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసి వేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. (యెషయా 10:27)
- మీరు దేవుని పోలికగా మార్చబడతారు
మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. (2 కొరింథీయులకు 3:18)
దేవునికి మీ పూర్ణహృదయంతో పాటు కొంత యోగ్యమైన సమయాన్ని ఇవ్వండి. దేవునితో లోతుగా వెళ్లడానికి ఇవి రెండు ప్రధాన షరతులు.
Bible Reading Plan : Matthew 1-7
1. దేవా, పాపం నన్ను నీ నుండి దూరం చేసిన ప్రతి విధంగా నాపై కరుణించు. ( కీర్తనల గ్రంథము 51 : 1-2, యోహాను సువార్త1:9)
2. యేసు నామంలో దేవునితో నా బంధాన్ని ప్రభావితం చేసే పాపం యొక్క ప్రతి బరువును నేను తీసివేస్తాను. (హెబ్రీయులకు 12:1,రోమీయులకు 6:12-14)
3. యేసు నామంలో నా మనస్సులో పోరాడుతున్న తప్పులు, అబద్ధాలు, సందేహాలు మరియు భయాలను నేను తొలగిస్తాను.(2 కొరింథీయులకు 10:4-5,యెషయా 41:10)
4. తండ్రీ! యేసు నామంలో నీ ధర్మశాస్త్రములోని అద్భుత విషయాలను నేను చూడగలిగేలా నా కన్నులను తెరువు.(కీర్తనల గ్రంథము 119 :18,ఎఫెసీయులకు 1:17-18)
5. యేసు నామంలో, నా పరలోకపు తండ్రితో సహవాసానికి పునరుద్ధరించబడే కృపను నేను యేసు నామంలో పొందుతున్నాను.( 2 కొరింథీయులకు 13:14,యాకోబు 4: 8)
6. ఓ దేవా! నా ఆత్మీయ మనిషిని శక్తివంతం చేయి.(ఎఫెసీయులకు 3:16,యెషయా 40 :29-31)
7. నా ఆధ్యాత్మిక బలాన్ని హరించే ప్రతిదీ యేసు నామంలో నాశనం చేయబడును గాక.(యెషయా 40.29, మత్తయి సువార్త 11: 28-30)
8. దేవుని సంగతుల నుండి నన్ను దూరం చేయడానికి రూపొందించబడిన ఐశ్వర్యం యొక్క ప్రతి మోసాన్ని నేను తొలగిస్తున్నాను.(మత్తయి సువార్త 6:24,1 తిమోతికి 6:9-10)
9. తండ్రీ, యేసు నామములో నీ ప్రేమలోను మరియు నీ జ్ఞానములోను నన్ను ఎదిగింప చేయి.(ఫిలిప్పీయులకు 1:9, కొలస్సయులకు 1:10)
10. దేవా, నీతో మరియు మనుష్యులతో జ్ఞానము, ఉన్నత స్థాయిలో మరియు కృపలో నన్ను ఎదిగింప చేయి. (లూకా సువార్త 2:52,యాకోబు 1:5)