అనుదిన మన్నా
08 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
Friday, 29th of November 2024
1
0
78
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
వైవాహిక పరిష్కారం, స్వస్థత మరియు ఆశీర్వాదం
మరియు దేవుడైన యెహోవా, "నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను." (ఆదికాండము 2:18)వివాహం అనేది ఒక దైవిక ఏర్పాటు, మరియు దాని యొక్క ఉద్దేశ్యం ఫలించడం, సహవాసం మరియు సహకారం. తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని జ్ఞానములో మరియు మార్గాల్లో పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆ పిల్లలు లోకములో దేవుని సైనికుల వంటివారు. దైవభక్తిగల ఇల్లు తన రాజ్యం మీద చూపే ప్రభావాన్ని దుష్టునికి తెలుసు, అందుకే దానిని నిరోధించడానికి వాడు తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నాడు.
దేవుడైన యెహోవా
సూర్యుడును కేడెమునై యున్నాడు
యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును
యథార్థముగా ప్రవర్తించువారికి
ఆయన యే మేలును చేయక మానడు. (కీర్తనలు 84:11)
మీ దోషములు వాటి క్రమమును తప్పించెను,
మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. (యిర్మీయా 5:25)
వివాహం అనేది ఒక మంచి విషయం, మరియు దేవుడు ప్రజల నుండి మంచి విషయాలను నిలిపివేయడు. మీకు మంచి విషయాలను నిరాకరించబడినప్పుడల్లా, తక్కువ కోసం స్థిరపడకండి; అది దేవుని చిత్తము కాదు. ఇది మీ పాపం లేదా అపవాది పని చేస్తున్నాడు.
వైవాహిక పరిష్కారం మరియు ఆశీర్వాదానికి వ్యతిరేకంగా సాతాను ప్రారంభించే సాధారణ దాడులు ఏమిటి?
1. తప్పుడు నిర్ణయం
సమ్సోను అభిషేకించబడ్డాడు, అయితే అతడు అనేక వైవాహిక తప్పులు చేశాడు, అది అతని పరిచర్యను తుడిచి వేసింది. ప్రజలు తప్పుడు కారణాలతో పెళ్లి చేసుకుంటారు. తప్పుడు కారణాలు ఎల్లప్పుడూ తప్పు జీవిత భాగస్వామిని ఆకర్షిస్తాయి. మీ జీవితం పట్ల దేవుని చిత్తం మీకు తెలుసుంటేనే పెళ్లి చేసుకోండి. తప్పుడు వ్యక్తి కోసం వెళ్లడంలో అపవాది మిమ్మల్ని తప్పుగా ప్రభావితం చేయవచ్చు, జాగ్రత్తగా మరియు ఆధ్యాత్మికంగా ఉండండి.
సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం శారీరక రూపాన్ని లేదా భౌతిక స్వాధీనం కంటే ఎక్కువ. మీరు మీ జ్ఞానముతో ఆధ్యాత్మిక రంగాన్ని చూడలేరు; దాచబడి ఉన్న విషయాలను మరియు ఆయన పరిపూర్ణ చిత్తాన్ని మీకు బహిర్గతం కావడానికి మీరు దేవుని ముఖాన్ని వెతకాలి. కొందరు జీవిత భాగస్వాములను వివాహం చేసుకున్నారు, అది వారిని నాశనం చేసింది లేదా వారి దైవిక లక్ష్యాన్ని తుడిచి వేసింది.
2. వివాహం లేదా గర్భధారణలో ఆలస్యం
పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు
నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతలు (4:18)
ఆలస్యం అనేది మన జీవితమునకు దేవుని చిత్తం కాదు. మనం ప్రకాశిస్తూ, ఎదుగుతూ, మహిమ నుండి మహిమ వైపు పయనిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీని కంటే ఎక్కువ ఉన్నదంతా దుష్టున్ని నుండి.
3. పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వాలి
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము
వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. (సామెతలు 22:6)
యవన కాలమందు పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణముల వంటివారు.
5 వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు
అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. (కీర్తనలు 127:4-5)
తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభువు మార్గంలో శిక్షణ ఇవ్వడంలో విజయం సాధిస్తే, ఆ పిల్లలు దేవునికి సైన్యముగా అవుతారు. ప్రతి బిడ్డ యొక్క గొప్పతనం యొక్క విత్తనం గురించి అపవాదికి బాగా తెలుసు, మరియు వాడు ఇంకా చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు వారి మనస్సులను బంధించాలని వాడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రార్థనాపూర్వకంగా మీ పిల్లలను రక్షించండి మరియు మీరు వారిలో సరైన విలువలను ఉంచారని నిర్ధారించుకోండి. సాతాను పైశాచిక సంగీతం మరియు సోషల్ మీడియాలో కబుర్లు చెబుతూ స్కూల్లో తోటివారిలో చాలా మంది పిల్లల మనస్సుల మీద సాతాను దాడి చేస్తున్నాడు.
మీరు మీ పిల్లలకు అందించేది విద్య మరియు వస్తువుల సదుపాయం అయితే, అపవాది లాభం పొందుతాడు. మీరు వారికి ఆధ్యాత్మికంగా కూడా శిక్షణ ఇవ్వాలి.
4. విడాకులు
"కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.” (మార్కు 10:9)
మీరు సరైన వ్యక్తిని విజయవంతంగా వివాహం చేసుకున్నప్పటికీ, అపవాది విడాకులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్నిసార్లు, వాడు పేదరికం, తుఫానులు మరియు వ్యాధితో మీ కుటుంబం మీద దాడి చేస్తాడు. వాడు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు మరియు కోపాన్ని ప్రేరేపిస్తాడు. మీరు వాని తంత్రముల గురించి తెలుసుకుంటే, వాని నుండి మీకు ప్రయోజనం ఉంటుంది. విడాకులు తీసుకున్న ఆ జంటలు తమ పెళ్లి రోజున విడాకులు తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. వారు ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు, "మరణం మనల్ని వేరుచేసే వరకు...", కానీ అపవాది సవాళ్లతో వచ్చి వారిని వేరు చేసాడు.
5. వ్యభిచారం
సాతాను మనలను మోస పరచకుండునట్లు; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.. (2 కొరింథీయులకు 2:11)
వ్యభిచారం అనేది జంటలకు వ్యతిరేకంగా అపవాది ఉపయోగించే ప్రధాన ఆయుధం. చాలా మంది వివాహిత జంటలను మోహింపజేయడానికి అపవాది ఒక వింత స్త్రీ/పురుషుడిని ఏర్పాటు చేస్తాడు. జీవిత భాగస్వామి పడిపోయిన క్షణం, దానిని దాచి ఉంచడం తదుపరి క్షణం. దానిని దాచిపెట్టిన తర్వాత, చాలా మంది వ్యక్తులు అలాంటి క్రియలో కొనసాగుతారు ఎందుకంటే దానిని బహిర్గతం చేయకుండా, ఆపడం కష్టం.
ఆత్మ యొక్క పరిధిలో శక్తివంతంగా ముందుకెళ్తున్న దేవుని ప్రవక్త ఒకసారి ఇలా అన్నాడు, "వివాహములో వ్యభిచారానికి తలుపులు తెరిచే వాటిలో ఒకటి జంటలు కలిసి అశ్లీలత చిత్రాలు చూడటం. అలాంటి పనులు చేసే వ్యక్తులు వివాహిత జంటలు కారు, మరియు వారు వ్యభిచారం చేయడాన్ని చూడటం వ్యభిచారం యొక్క ఆత్మను ఇంటిని ఆకర్షిస్తుంది." చాలా జాగ్రత్తగా ఉండండి.
వైవాహిక పరిష్కారం, స్వస్థత మరియు ఆశీర్వాదాన్ని ఎలా ఆనందించాలి?
ఒకవేళ మీరు మీ వైవాహిక జీవితంలో బాధను మరియు ఇబ్బందులను అనుభవిస్తున్నట్లయితే, దేవుడు మీ వివాహాన్ని స్వస్థపరచగలడు. అలాగే, మీ వివాహంలో మీకు ఆశీర్వాదం అవసరమైతే లేదా మీరు వివాహంలో స్థిరపడాలని కోరుకుంటే, దేవుని వాక్యం మిమ్మల్ని కప్పి ఉంచుతుంది.
కాబట్టి, మీరు చేయవలసిన పనులు ఏమిటి?
- నిబంధన మనస్తత్వాన్ని పెంపొందించుకోండి
మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, వివాహాన్ని మిమ్మల్ని సంపూర్ణం చేసే విధంగా చూడకండి. వివాహాన్ని అంతిమంగా చూడవద్దు. వివాహం మిమ్మల్ని సంపూర్ణం చేసేది కాదు; మీరు క్రీస్తులో సంపూర్ణులు. (కొలొస్సయులకు 2:10)
- ప్రేమలో ఎదగండి
- మంచి స్వభావాన్ని లేదా గుణాన్ని అభివృద్ధి పరచుకోండి
మీరు వివాహాన్ని ఆనందిస్తారా లేదా సహిస్తారో లేదో మీ స్వభావం నిర్ణయించగలదు. చెడు స్వభావం ఇంటిని విచ్ఛిన్నం చేస్తుంది మరియు సమాజంలో విఫలం అయ్యేలా పిల్లలను సిద్ధం చేస్తుంది.
Bible Reading Plan : Mark : 12 - 16
ప్రార్థన
1. నేను నా ఇంటిని మరియు నా కుటుంబ సభ్యులందరినీ యేసు రక్తంతో యేసు నామములో కప్పుతున్నాను. (ప్రకటన 12:11)
2. నేను నా ఇల్లు, నా పిల్లలు మరియు నా జీవిత భాగస్వామిపై దెయ్యం యొక్క శక్తిని యేసు నామములో విచ్ఛిన్నం చేస్తున్నాను. (లూకా 10:19)
3. నా మనస్సు, జీవిత భాగస్వామి మరియు పిల్లలకు వ్యతిరేకంగా జరిగే ఏవైనా దాడులు యేసు నామములో నాశనం అవును గాక. (యెషయా 54:17)
4. నా ఇంటిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఏదైనా శక్తి యేసు నామములో నాశనం అవును గాక. (2 కొరింథీయులకు 10:3-4)
5. ప్రభువా, నా వివాహాన్ని బాగు చేసి దీవించు. (వివాహం చేసుకున్న వారికి) (మార్కు 10:9)
6. పరలోకము-నిర్దేశించిన నా జీవిత భాగస్వామిని గుర్తించకుండా నన్ను కప్పి ఉంచే ప్రతి శక్తి, యేసు నామములో నాశనం అవును గాక. (జీవిత భాగస్వామి కోసం ప్రార్థించే వారి కోసం) (ఆదికాండము 2:18)
7. ప్రభువా, నీ కృప నాపై ఉండును గాక, యేసు నామములో వైవాహిక పరిష్కారానికి మరియు ఆశీర్వాదానికి అనుకూలంగా ఉండును గాక.. (కీర్తనలు 102:13)
8. నా జీవితం మరియు కుటుంబం నుండి విడాకులు, వ్యభిచారం మరియు వ్యసనం యొక్క ఆత్మను యేసు నామములో నిర్మూలించబడును గాక. (హెబ్రీయులకు 13:4)
9. తండ్రీ, యేసు నామములో నీ ప్రేమ, భయం మరియు జ్ఞానంలో ఎదగడానికి నాకు సహాయం చేయి. (2 పేతురు 3:18)
10. నా వివాహం మరియు కుటుంబానికి వ్యతిరేకంగా ఏదైనా మంత్రవిద్య కార్యములు మరియు అవకతవకలు యేసు నామములో పరిశుద్దాత్మ యొక్క అగ్ని ద్వారా నాశనం అవును గాక. (ద్వితీయోపదేశకాండము 18:10)
11. నా రక్తసంబంధం నుండి అనారోగ్యం, వ్యాధి, విడాకులు, వ్యసనాలు, వ్యభిచారం మరియు వైవాహిక బాధలకు కారణమయ్యే ఏదైనా ప్రతికూల కార్యములు యేసు నామములో నాశనం అవును గాక. (గలతీయులకు 3:13)
12. నేను చెడు కుటుంబ విధానాల నుండి నన్ను యేసు నామములో వేరు చేసుకుంటున్నాను. (2 కొరింథీయులకు 5:17)
13. నేను నా తండ్రి ఇంటిని నియంత్రించే రాక్షసులతో ఏదైనా రక్తసంబంధమైన నిబంధనల నుండి వేరు చేసి యేసు నామములో నాశనం చేస్తాను. (యోహాను 8:32)
Join our WhatsApp Channel
Most Read
● సమాధానము కొరకు దర్శనం● దైవ రహస్యాల ఆవిష్కరణ
● 21 రోజుల ఉపవాసం: 8# వ రోజు
● క్రీస్తులో మీ దైవిక విధిలో ప్రవేశించడం
● ఆత్మలను సంపాదించుట – ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది?
● మానవ తప్పుల మధ్య దేవుని మార్పులేని స్వభావం
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #1
కమెంట్లు