english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 36 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
అనుదిన మన్నా

36 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన

Friday, 27th of December 2024
0 0 223
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
రాత్రి యుద్ధాల మీద విజయం పొందడం

"మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా,అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీ కిష్టమా? అని అతనిని అడిగిరి." (మత్తయి 13:25,27,28)


రాత్రిపూట ప్రజలు నిద్రపోతున్నప్పుడు శత్రువు చాలా పనులు చేస్తున్నాడు. మనం అప్రమత్తంగా ఉండాలని మరియు రాత్రి యుద్ధాలతో పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు.

అర్ధరాత్రి మీ రక్షణ మీరు మీ ఆత్మను బరువు చేసుకున్నదానిపై ఆధారపడి ఉంటుంది. మీ ఆత్మ బలహీనంగా మరియు తేలికగా ఉంటే, శత్రువు దాడి చేయడం సులభం అవుతుంది.

కలలు శక్తివంతమైనవి, ఏమి జరుగుతుందో, ఏమి జరిగిందో లేదా ఏమి జరగబోతోందని వెల్లడిస్తుంది. శత్రువులు రాత్రిపూట తిరుగుతూ ఎవరిని మ్రింగివేయాలని చూస్తున్నారు. ఈరోజు మనం చదివే లేఖనం, మనుషులు మంచి విత్తనాలను నాటగలరని, అయితే రాత్రిపూట జరిగే పనుల వల్ల మరేదైనా ఫలిస్తుందని తెలియజేస్తుంది.

ఈ రోజు మనం ప్రార్థించబోతున్నాం, నాశనం చేద్దాం మరియు రాత్రి యొక్క ప్రతి శక్తి మీద విజయం పొందుదాం. రాత్రిపూట యుద్ధాలు జరుగుతాయి, కాబట్టి విశ్వాసిగా, మీరు నిద్రపోయే ముందు ఎడతెగక ప్రార్థించాలి లేదా అర్ధరాత్రి నిద్రలేచి ఎడతెగక ప్రార్థించాలి. ఈ రంగములో మీకు కృప లేకపోతే, అవసరమైన బలం కోసం మీరు దేవుని ప్రార్థించవచ్చు.

నిర్గమకాండము 11:4 ఇలా చెబుతోంది, "...యెహోవా సెలవిచ్చిన దేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను."

దేవుడు మధ్యరాత్రి కూడా పనిచేస్తాడు. ఆయన మధ్యరాత్రి ఐగుప్తు దేశానికి తీర్పు తీర్చాడు.

మధ్యరాత్రి, శత్రువు కలల ద్వారా చంపవచ్చు లేదా ప్రజల శరీరాల్లో అనారోగ్యాన్ని నాటవచ్చు.

మధ్యరాత్రి దాడులు లైంగిక లేదా తినడం వంటి కలల ద్వారా వ్యక్తమవుతాయి, ఇవి ఆధ్యాత్మిక దాడులకు సంకేతాలు. నేను మీ దృష్టిని యుద్ధం మరియు విమోచన వైపు పిలుస్తున్నాను, తద్వారా మీరు మీ జీవితం, కుటుంబం మరియు పిల్లలకు వ్యతిరేకంగా దుష్టుని కార్యాలపై ప్రార్థించగలరు మరియు నాశనం చేయగలరు.

కీర్తనలు 119:62, "న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను."

కీర్తనకారుడు మధ్యరాత్రి యొక్క శక్తిని అర్థం చేసుకున్నాడు. మీరు మధ్యరాత్రి లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి, ఆరాధించడానికి మరియు స్తుతించవచ్చు. అపొస్తలుల కార్యములు 16:25-26 పౌలు మరియు సిలలు మధ్యరాత్రి దేవునికి ప్రార్థన చేసి, స్తుతిస్తూ పాడారు, ఫలితంగా చెరసాల నుండి విముక్తి పొందారు.

మీరు అర్ధరాత్రి ప్రార్థన చేయకపోతే, ప్రారంభించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇది 30 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఉండొచ్చు; అది మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

Bible Reading Plan: 1 Peter 1 - 1 John 1
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రా

1. యేసు నామములో, అర్ధరాత్రి నాకు వ్యతిరేకంగా వేసిన ప్రతి బాణాన్ని నేను కూల్చివేసి నాశనం చేస్తాను. (కీర్తనలు 91:5)

2. నా మహిమపై దాడి చేసే అర్ధరాత్రి యొక్క ప్రతి శక్తి యేసు నామములో నాశనం అవును గాక. (నిర్గమకాండము 12:29)

3. నన్ను చంపాలనే దుష్టుని కార్యము నేను భగ్నం చేస్తాను; నేను యేసు నామములో మరణించను. (కీర్తనలు 118:17)

4. నా శరీరంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి తోట, యేసు నామములో అగ్ని ద్వారా నాశనం అవును గాక. (1 కొరింథీయులకు 3:16-17)

5. కలల ద్వారా నా శరీరంలోకి కార్యం చేయబడిన ప్రతి వ్యాధి, యేసు నామములో అగ్ని ద్వారా నాశనం అవును గాక. (యిర్మీయా 17:14)

6. దేవుని శక్తి, నా జీవితాన్ని, జీవిత భాగస్వామిని మరియు పిల్లలను లక్ష్యంగా చేసుకుని, రాత్రి యొక్క ప్రతి శక్తి నుండి నన్ను యేసు నామములో విడిపించును. (2 తిమోతి 4:18)

7. నా పరలోకపు తండ్రి నాటని ఏ తోటనైనా యేసు నామములో పెకిలించి నాశనం అవును గాక. (మత్తయి 15:13)

8. దేవా, నిన్ను స్తుతించడానికి మరియు ఆరాధించడానికి నాకు అర్ధరాత్రి లేవడానికి యేసు నామములో కృపను దయచేయి. (అపోస్తుల కార్యములు 16:25)

9. నేను నిద్రిస్తున్నప్పుడు నా ఆత్మీయ మనిషిని లక్ష్యంగా చేసుకునే ప్రతి సాతాను శక్తి మీద నేను యేసు నామములో విజయం పొందుతాను. (లూకా 10:19)

10. దేవుని అగ్ని, నా ఆత్మ, ప్రాణం మరియు శరీరం గుండా వెళ్ళు; రాత్రిపూట ప్రార్థన చేయడానికి, నేను నిద్రపోతున్నప్పుడు నన్ను రక్షించడానికి మరియు నా కుటుంబాన్ని మరియు ప్రియమైన వారిని రక్షించడానికి నాకు యేసు నామములో అధికారం దయచేయి. (1 థెస్సలొనీకయులకు 5:23)


Join our WhatsApp Channel


Most Read
● భాషలు దేవుని భాష
● తగినంత కంటే అత్యధికముగా అద్భుతాలు చేసే దేవుడు
● దేనికి కాదు డబ్బు
● ఆర్థిక గందరగోళం నుండి ఎలా బయటపడాలి # 2
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఇతరులకు ప్రకవంతమైన దారి చూపుట
● ప్రతి ఒక్కరికీ కృప
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్