english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ బలహీనతలను దేవునికి ఇయుడి
అనుదిన మన్నా

మీ బలహీనతలను దేవునికి ఇయుడి

Thursday, 2nd of January 2025
0 0 156
Categories : డబ్బు నిర్వహణ (Money Management) లోబడుట (Surrender) శిష్యత్వం (Discipleship) స్వభావం (Character)
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింప బడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. (1 కొరింథీయులకు 1:28-29)

దేవుడు తన అద్భుతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉద్దేశపూర్వకంగా బలహీనమైన విషయాలను ఉపయోగిస్తాడు. దేవుడు ఈ విధంగా చేయటానికి గల కారణం "ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకూడదు" (1 కొరింథీయులు 1:27). దేవునికి మాత్రమే సమస్త మహిమ చెందాలి.

ఇస్కరియోతు యూదా పన్నెండు మంది అపొస్తలులలో ఒకడు. అతడు ఒక అభిషిక్తుడు, అతడు దెయ్యాలను వెళ్లగొట్టగలడు మరియు రోగులను స్వస్థపరచగలడు. అతడు, ఇతర అపొస్తలులు మరియు ప్రభువు శిష్యులతో కలిసి, పరిచర్య యాత్రలో బాగా ఉపయోగించబడ్డాడు. (మత్తయి 10 చదవండి)

ఏదేమైనా, యూదాలో బలహీనత ఉంది, అది స్పష్టంగా కనిపించలేదు, ఎందుకంటే అతడు దానిని బాగా మరుగుపరచగలిగాడు. యోహాను 12:6లో, పరిశుద్ధాత్మ తన బలహీనతను తెలియపరుస్తుంది. "... దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను."

అనేక సందర్భాల్లో, తన దగ్గరకు వచ్చిన పురుషులు మరియు స్త్రీలలో లోతైన రహస్యాలను ప్రభువు ఎలా వెల్లడి చేస్తాడో యూదా చూశాడు. ఆయన మహా కృప ద్వారా పాపులు ఎలా రక్షింపబడ్డారో కూడా అతడు చూశాడు. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ, యూదా తన స్వభావలోపాన్ని వ్యక్తిగతంగా యేసు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అతడు కోరుకుంటే అతడు చేసి ఉండవచ్చు మరియు అతడు బలహీనతను అధిగమించడానికి యూదా కృపను పొందాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.

ప్రభువుకు కూడా దీని గురించి తెలుసు మరియు యూదా దానిని అంగీకరించాలని కోరుకున్నాడు; యూదా మారాలని ఆయన కోరుకున్నాడు, కానీ యూదా అలా చేయలేదు, చివరికి, ఇదే స్వభావ లోపం వల్ల యూదా తన యజమానిని కేవలం 30 వెండి నాణెములకు అమ్మడానికి కారణమైంది - బానిస ధర. మీరు వనరులు మరియు సంబంధాలను ఎలా నిర్వహిస్తారో అప్పుడే నిజమైన స్వభావం కనిపిస్తుంది.

మనం బలహీనులమని గుర్తించినప్పుడు మాత్రమే, మన మారుముఖమును కొనసాగించడానికి ప్రయత్నించడం మానేసి, దాని బదులుగా మన పోరాటాలకు విడుదల, స్వస్థత మరియు ఓదార్పునిచ్చే మన దేవుని సమృద్ధి మరియు క్షేమం వైపు చూడవచ్చు.

మనం ఎంత బలహీనంగా ఉన్నా లేదా హానికరముగా ఉన్నా, మన బలహీనతలను మనం ఒప్పుకుని, దేవునికి అప్పగించగలిగితే, దానిపై మనకు విజయం పొందడానికి తగిన కృప లభిస్తుందని నేను నమ్ముతున్నాను. (2 కొరింథీయులు 12:9)

Bible Reading : Genesis 4 -7
ప్రార్థన
1. "ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని" నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నిశ్చయంగా ఆయన నా కుటుంబ సభ్యులను మరియు నన్ను వేటకాని ఉరిలో నుండి మరియు నాశనకరమైన తెగులు రాకుండ రక్షించును.

2. నా ప్రార్థనలకు జవాబులను అడ్డుకునే ప్రతి శక్తి యేసు రక్తం ద్వారా నరికివేయబడును గాక.

3. యేసు నామంలో నేను నా కుటుంబ సభ్యులు మరియు నా మీద స్వేచ్ఛ, స్వస్థత, విమోచన మరియు గొప్ప కార్యములను పలుకుతున్నాను.

4. తండ్రీ, నా బలహీనతలో నీ కృప పరిపూర్ణమైనందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. (ప్రభువుతో మీ బలహీనతలను ఒప్పుకొండి). తండ్రీ, నీవు నన్ను ఏమాత్రమున విడువవు, నన్ను ఎన్నడును ఎడబాయవు అందును బట్టి నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● విశ్వాసపు పాఠశాల
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 1
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● మన రక్షకుని యొక్క షరతులు లేని ప్రేమ
● విజయానికి పరీక్ష
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్