english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు
అనుదిన మన్నా

ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు

Monday, 6th of January 2025
1 0 204
Categories : పరిశుద్ధాత్మ (Holy Spirit)
అందుకు మరియనేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. (లూకా 1:34-35)

ఈ వచనాలు పరిశుద్ధాత్మ మరియ జీవితాన్ని శాశ్వతంగా మార్చే రెండు మార్గాలను వివరిస్తుంది. ఇలా మీకు కూడా జరుగుతుంది.

మరియలాగే, మీకు కూడా ఒక ప్రశ్న ఉండవచ్చు: "ఇది ఎలా సాధ్యమౌతుంది?"

మొదటగా, దేవదూత మరియతో "పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును" అని చెప్పింది. దేవుని సన్నిధి ఆమెకు చాలా వాస్తవమైనది.

రెండవది, "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును." ఇక్కడ గ్రీకు పదం అంటే శక్తి కమ్ముకొనును అని అర్ధం. మేఘంలా కప్పబడి ఉండాలి. రూపాంతరంలో, "ఒక మేఘం ఏర్పడి వాటిని కప్పివేయడం ప్రారంభించినప్పుడు" యేసయ్యకు ఎదురైన అనుభవాన్ని వివరించేటప్పుడు లూకా ఉపయోగించిన అదే పదం ఇదే. (మార్కు 9:2-9 చదవండి)

ఈ ఉదాహరణలు పరిశుద్ధాత్మ మన జీవితాలను చుట్టుముట్టినప్పుడు మనం అసాధారణమైన కార్యములు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని చూడడానికి సహాయపడతాయి.

గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ఏ స్థలంలోనైనా, ఎప్పుడైనా ఉపయోగించగలడు. మరియకు జరిగినట్లుగా, మీరు కూడా ప్రవచనాత్మక కలలను చూడటం, స్పష్టమైన దర్శనాలను చూడటం, మీ ప్రార్థనల ద్వారా ప్రజలు స్వస్థత మరియు విడుదల పొందడం మొదలైన ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతారు.

పరిశుద్ధాత్మ మన ద్వారా చేయగల సామర్థ్యాన్ని మన మానవ మనస్సులు గ్రహించడం కష్టమని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మీరు ఆత్మ యొక్క గొప్ప కార్యాలను చూడాలనుకుంటే, అనుదినం దేవుని వాక్యము చదవడం ద్వారా మీ మనస్సును నూతన పరుచుకోవాలి.

రోమీయులకు 12:2 ఇలా సెలవిస్తుంది, "మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి."

ఈ రకమైన పరివర్తన ఫలితంగా, దేవుని ఆత్మ మనది కాని అంతర్దృష్టులను ఇస్తుంది. మీ జీవితం లేదా ఇతరుల జీవితం గురించి మీరు అతీంద్రియంగా ప్రత్యక్షతను పోందుకుంటారు. దీని గురించి మీరు గుర్తు చేసుకోవడం మర్చిపోవద్దు.

ఇలాంటి సమయాల్లో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా చూడవచ్చు, కానీ మీరు మరియు నేను కేవలం మట్టి పాత్రలే అన్నది వాస్తవం మరియు ఎల్లప్పుడూ అలాగే ఉంటాము.

2 కొరింథీయులకు 4:7 ఇలా సెలవిస్తుంది, "అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు."

మీరు చిన్నవారు లేదా వృద్ధులు కావచ్చు, చదువుకున్నవారు లేదా కాకపోవచ్చు; ఆయన ద్వారా, పరిమితులు లేవని మాత్రమే గుర్తుంచుకోండి.

Bible Reading : Genesis 19-21
ప్రార్థన
తండ్రీ, నా జీవితంలో నీ కార్యములను అనుమానించినందుకు నన్ను క్షమించు. నీవు ప్రారంభించిన దాన్ని పూర్తి చేయడానికి నీవు నమ్మకస్తుడవు. నా గురించి ప్రతికూల మాటలు మాట్లాడినందుకు నన్ను క్షమించు. నీ సన్నీధితో నన్ను నూతనముగా నింపు. యేసు నామంలో. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
● యుద్ధం కొరకు శిక్షణ
● విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ
● పోలిక (పోల్చుట అనే) ఉచ్చు
● మహిమ మరియు శక్తి గల భాష - భాషలు
● పర్వతాలను కదిలించే గాలి
● తదుపరి స్థాయికి వెళ్లడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్