english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఏదియు దాచబడలేదు
అనుదిన మన్నా

ఏదియు దాచబడలేదు

Thursday, 18th of January 2024
0 0 93
Categories : ఇవ్వడం (Giving) శిష్యత్వం (Discipleship)
కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు (ప్రోత్సాహపు కుమారుడు అని అనువదించబడింది), హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి దాని వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. (అపొస్తలుల కార్యములు 4:36-37)

పై లేఖనంలో, బర్నబాసు అనే వ్యక్తి తన ఆస్తిని అమ్మి, అపొస్తలులకు డబ్బు తెచ్చినట్లు మనం చూశాము. ఇది విశ్వసనీయత మరియు దాతృత్వం యొక్క కార్యము.

అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. (అపొస్తలుల కార్యములు 5:1-2)

సాధారణం పరిశీలకుడిగా, అననీయ మరియు సప్పీరా అదే పని చేస్తున్నారు. ఏదేమైనా, వారి హృదయాలలో లోతుగా, బహుశా డబ్బుపై ప్రేమ ఉండేది.

వారిద్దరూ నిజంగా ఉదారంగా ఉండకుండా ప్రజల ముందు గొప్ప ఉదారత యొక్క చిత్రాన్ని కోరుకున్నారు. స్పష్టంగా, వారు దేవుని స్తుతి కంటే మనుషుల మెప్పును కోరుకున్నారు. (యోహాను 12:43)

వ్యక్తులలో రెండు వర్గాలు ఉన్నాయి:
మొదటి వ్యక్తి దేవుని సంతోష పెట్టాలని మరియు ఆయన నుండి మాత్రమే ప్రశంసలు పొందాలనే ఏకైక కోరికతో పనులు చేస్తాడు. దురదృష్టవశాత్తు, ఈ వర్గం వ్యవహారయోగ్యతలేమిలో ఉంది.

ఇతర వర్గం వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను చూడడానికి మరియు ప్రశంసించడానికి మాత్రమే చేయగలిగినదంతా చేస్తారు. వారు ప్రశంసించబడకపోతే, వారు మనస్తాపం చెందుతారు మరియు కోపంగా ఉంటారు. కాబట్టి మీరు గమనించండి, పైతట్టు మంచిగా కనిపించే పనులు చేయడం సాధ్యమే కానీ పూర్తిగా తప్పుడు కారణాల వల్ల చేయబడతాయి.

ఈ ప్రశ్నల వెలుగులో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి:
నేను ఇతరులు నన్ను చూసి మెచ్చుకోవడానికి ప్రభువుకు సేవ చేస్తున్నానా?
నేను దేవునికి ఇచ్చినప్పుడు, నేను ఏమి చేశానో ప్రకటించే బాకా ఊదలా?

దేవుని ముందు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలను అడగడం మనల్ని పశ్చాత్తాపంలోకి నడిపించడానికి మరియు ఆయన కృపలో మరింత అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది.

అననీయ మరియు సప్పీరా మర్చిపోయినది ఏమిటంటే, దేవుని యెదుట నుండి ఏమీ దాచబడదు. "మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును." (1 సమూయేలు 16:7)

తుయతైరలో రాజీపడిన సంఘానికి యేసు చెప్పినట్లుగా, "అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను." (ప్రకటన 2:23).

ఆయన మనుషుల హృదయాలు మరియు మనస్సులను పరిశోధించే వ్యక్తి అని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఆయన దృష్టి నుండి ఏదియు దాచబడి ఉండదు. దేవుని ముందు నిజంగా పరిగణించబడేది బాహ్య అనుగుణ్యత కాదు, మంచి పనులలో వ్యక్తీకరించబడిన హృదయం నుండి అంతర్గత మార్పు.

Bible Reading: Genesis 50, Exodus: 1-3
ఒప్పుకోలు

దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము. (కీర్తనలు 139:23-24)


Join our WhatsApp Channel


Most Read
● దేవుని లాంటి ప్రేమ
● మీరు సులభంగా గాయపరచబడుతారా?
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
● 07 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఇక నిలిచి ఉండిపోవడం చాలు
● కోపాన్ని (క్రోధాన్ని) అర్థం చేసుకోవడం
● అంతిమ భాగాన్నిగెలవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్