english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. స్తుతి అనేది దేవుడు నివసించే స్థలం
అనుదిన మన్నా

స్తుతి అనేది దేవుడు నివసించే స్థలం

Friday, 24th of January 2025
0 0 217
Categories : స్తుతి (Praise)
అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను. (లూకా 10:38-39)

బేతనియాలో చాలా ఇళ్లు ఉన్నాయి, కానీ యేసు తరచుగా మార్త, మరియ మరియు లాజరు ఇంటిలో ఉంటాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన హృదయపూర్వకంగా స్వాగతించబడినందున ఇది జరిగిందని నేను నమ్ముతున్నాను. దేవుడు ఎల్లప్పుడూ తనను మహిమపరిచే మరియు సహించని ప్రదేశానికి వెళ్తాడు.

దేవుని సన్నిధి త్వరగా మరియు వాచ్యంగా అనుభూతి చెందే స్థలాలకు నేను తరచుగా వెళ్లాను. ఎవరైనా అక్షరాలా సమాధానము మరియు ప్రశాంతతను అనుభూతి చెందుతారు. దీనికి ఒక కారణం ఏమిటంటే, ఇవి నిరంతరం స్తుతులు మరియు ఆరాధనలు అందించే స్థలాలు.

నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల
మీద ఆసీనుడవై యున్నావు. (కీర్తనలు 22:3)

దీని అర్థం, ప్రజలు ఎక్కడైతే ఆయనను స్తుతించాలనుకుంటున్నారో, దేవుడు ఇలా అంటున్నాడు, "నేను అక్కడ ఉంటాను" దేవుడు తన ప్రజల స్తుతులలో నివసిస్తాడు. స్తుతుల స్థలం దేవుడు అక్షరాలా నివసించే స్థలము. దేవుడు అలాంటి స్థలాలకు ఆకర్షితుడవుతాడు.

మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగితే, మీ ఇల్లు ఒక ఆశీర్వాద స్థలం కావచ్చు. దయచేసి నాకు వివరించడానికి అనుమతించండి.

ఒక రోజు ఒక వ్యక్తి నాకు ఇలా వ్రాసాడు, వారు చాలా దుష్ట దాడులను ఎదుర్కొంటున్నందున వారు తమ నివాస స్థలాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. స్పష్టంగా, కొన్ని దుష్ట శక్తులు ఆ స్థలంలో వారిని కలవరపెడుతున్నాయి. వారు వేరే ప్రాంతానికి వెళ్లాలని సూచించబడ్డారు. గతంలో, వారు ఇప్పటికే రెండు నివాస స్థలాలను మార్చారు.

మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా అలాంటి అనుభవాన్ని అనుభవిస్తుంటే, స్థలాలను మార్చడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదని నేను మీకు తెలియజేస్తున్నాను. 

మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో దుష్ట ఫరో కింద బానిసత్వంలో ఉన్నారు. అయితే, దేవుని కృప ద్వారా, వారు ఒక రాత్రిలో ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వారు వారి భౌతిక నివాస స్థలాన్ని మార్చారు. వారు ఇప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, అయితే, ఫరో మరియు అతని దుష్ట సైన్యాలు వారిని వెంబడించారు. (దయచేసి నిర్గమకాండం 14 చదవండి)

ఇది సాధారణంగా ప్రజలకు జరిగేదే. మీరు భౌతికంగా ఒక స్థలం నుండి బయటకు రావచ్చు, కానీ మీరు ఎక్కడికి వెళ్లినా చీకటి ఆత్మలు మిమ్మల్ని వెంబడిస్తాయి. మీకు కావలసింది దేవుని శక్తి మీపై, మీ కుటుంబం మరియు మీ ఇంటిపైకి దిగి రావడమే, తద్వారా చీకటి శక్తులు సిగ్గుపడతాయి.

2 దినవృత్తాంతములు 20లో, యెహోషాపాతు రాజు మరియు అతని ప్రజలపై దాడి చేయడానికి కలిసి వచ్చిన అనేక సైన్యాల గురించి మనం చదువుతాము. అంత భారీ సైన్యం చేతిలో వారు వెంటనే ఓటమిని ఎదుర్కొన్నారు.

తరువాత ఏమి జరిగిందో మీకు మరియు నాకు అద్భుతమైన పాఠం. వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు, అది శత్రువులను భయభ్రాంతులకు గురిచేసింది, మరియు వారు తమతో తాము పోరాడారు. వారు లోయకు "బెరాకా" అని పేరు పెట్టారు, అంటే స్తుతుల లోయ లేదా ఆశీర్వాదము లోయ.

నాల్గవ దినమున వారు బెరాకా (ఆశీర్వాదము) లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా (ఆశీర్వాదము) లోయయని పేరు. (2 దినవృత్తాంతములు 20:26)

మీరు దేవుని స్తుతించినప్పుడు, ఆయన మీ భయం మరియు నిరాశ యొక్క లోయను స్తుతుల మరియు ఆశీర్వాదాల లోయగా మార్చగలడు.

మీరు మీ ఇంటిలో, మీ వ్యాపార స్థలంలో ప్రభువును స్తుతించినప్పుడు, ఆయన సన్నిధి దిగివస్తుంది, మరియు చీకటి శక్తులు పారిపోవలసి ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కుటుంబంతో కలిసి దేవుని ఎందుకు స్తుతించకూడదు? మీరు మీ మ్యూజిక్ సిస్టమ్‌లో లేదా మీ ఫోన్‌లో కూడా కొంత స్తుతి మరియు ఆరాధన సంగీతాన్ని వినడం ద్వారా మీ రోజును ప్రారంభించవచ్చు. ఆ సంగీతం మీ ఇంటిలో ధూపంలా ప్రవహించనివ్వండి.

మీరు దీన్ని చేయడం ప్రారంభించినప్పుడు, మీరు అద్భుతమైన మార్పులను అనుభవిస్తారు. ఆయన సమాధానం మరియు క్షేమము నదిలా ప్రవహించడం ప్రారంభమవుతుంది.

బహుశా మీరు కొంత ఆస్తికి సంబంధించిన కొన్ని కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారెమో. ఆ స్థలంలో నిలబడి దేవుని స్తుతిస్తూ మరియు ఆ ప్రదేశంలో ప్రభువు విజయాన్ని ప్రకటిస్తూ సమయం గడపండి. ఆయన మహిమ కోసం మీరు ఒక సాక్ష్యంతో తిరిగి వస్తారు.

Bible Reading: Exodus 17-20
ఒప్పుకోలు
నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తాను; ఆయన స్తుతులు ఎల్లప్పుడూ నా పెదవులపై ఉండును. అందువల్ల నా అంగలార్పును నాట్యముగా మార్చిబడును మరియు నా బాధలు సంతోష వస్త్రముగా మార్చిబడును యేసు నామంలో

Join our WhatsApp Channel


Most Read
● 21 రోజుల ఉపవాసం: 16# వ రోజు
● దేవుణ్ణి స్తుతించడానికి వాక్యానుసారమైన కారణాలు
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఏడంతల ఆశీర్వాదములు (దీవెనలు)
● 35 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దేవుని లాంటి ప్రేమ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్