english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. నీతి వస్త్రము
అనుదిన మన్నా

నీతి వస్త్రము

Tuesday, 4th of February 2025
0 0 159
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)
"మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి."(రోమీయులకు 13:14)

ఒక వస్త్రము శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రము మాత్రమే కాదు; మనము ఎక్కడికి వెళ్తున్నామో కూడా సూచిస్తుంది. ఒక వ్యక్తి తన వస్త్రములను బట్టి ఎక్కడికి వెళ్తున్నాడో మీరు ఊహించవచ్చు. మనము ప్రత్యేకమైన వస్త్ర నిబంధనతో కొన్ని ఈవెంట్‌లను కలిగి ఉన్నామని మీరు నాతో ఏకీభవిస్తారు, ముఖ్యంగా కార్పొరేట్ విధులులో. ఈ సందర్భం కోసం వస్త్రములు ధరించిన వారిని మాత్రమే హాల్లోకి అనుమతించబడుతారని ఇది సూచిస్తుంది.

ఈవెంట్ల మాదిరిగానే, రాజుల ముందు కనిపించడానికి మనకు కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఎస్తేరు మరియు ఇతర స్త్రీలందరూ తమకు నచ్చిన వాటిని ధరించలేదు; వారు రాజు ముందు కనిపించడానికి వారికి వస్త్రములు ధరించడానికి వారితో రాజు నియమించిన నపుంసకుడు కలిగి ఉండడానికి కారణం అదే. రాజు యొక్క నపుంసకుడు స్త్రీలు రాజభవనం యొక్క వస్త్ర నిబంధనకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు. అయితే ఎస్తేరు విషయంలో తేడా ఏమిటి? ఆమె కేవలం ఒక వస్త్రాన్ని ధరించలేదు; ఆమె హృదయము నీతి వస్త్రముతో కప్పబడి యున్నది.

నిజమేమిటంటే, స్వ-నీతి యొక్క అర నుండి వస్త్రాలు క్రీస్తులో దేవుని నీతితో ధరించడంతో పోల్చలేవు. చాలా తరచుగా, మన స్వ-నిర్మిత నీతి కారణంగా మనం అంగీకరించబడతామని అనుకుంటాము, కానీ దీనికి విరుద్ధంగా, క్రీస్తు ద్వారా మనం నీతి ధరించినప్పుడు మాత్రమే దేవుడు మనలను అంగీకరిస్తాడు.

ఎస్తేరు ఆమె ఇలా ఉందో అలాగే స్వకరించబడ లేదు. ఆమె అపరిశుభ్రంగా ఉండటం లేదా దుర్వాసన రావడం వల్ల కాదు, కానీ ఆమె ఉత్తమమైనదిగా రాజుకు సరిపోనందున స్వకరించబడ లేదు. ఆమె వేరొక ప్రకాశాన్ని తీసుకువెళ్లినందున ఆమె నుండి భిన్నమైన వాసన వచ్చింది. మీరు ఏ వస్త్రాన్ని ధరిస్తున్నారు?

ప్రభువైన యేసు మత్తయి 22:8-14లో ఒక ఉపమానం బోధించాడు; బైబిలు ఇలా సెలవిస్తుంది, "అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారి నేమి మంచివారి నేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొకని చూచి స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను. అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను."

రాజు విందు చేసాడు మరియు తన విలాసవంతమైన భోజనం తినడానికి చాలా మందిని పిలిచాడు. పర్షియా రాజు వివిధ ప్రాంతాలు మరియు నేపథ్యాల నుండి మహిళలకు రాణి కోసం పోటీని ప్రారంభించినట్లుగా అతని సేవకులు ప్రజలను విందుకు ఆహ్వానించారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రవేశానికి అవసరమైన వస్త్రాన్ని ముందుగా పట్టించుకోకుండా విందుకు వచ్చాడు. తనకు నచ్చిన దుస్తులు ధరించి రాజు ముందు కనిపించవచ్చని భావించాడు. కానీ దురదృష్టవశాత్తు, అతడు రాజు సమక్షంలో నుండి తరిమివేయబడ్డాడు. అవును, చాలా మందిని పిలువబడిన వారు, అయితే రాజు ముందు నిలబడటానికి నీతి వస్త్రాలు ఉన్నవారు మాత్రమే ఏర్పరచబడినవారు.

నా మిత్రమా, మీరు ఎలాంటి వస్త్రాన్ని ధరిస్తున్నారు? మీరు నీతి లేదా అహంకార వస్త్రము ధరించారా? పరిశుద్ధత మరియు నిజాయితీ యొక్క వస్త్రమా లేక దుర్మార్గపు వస్త్రమా? లూకా 18వ అధ్యాయంలో, బైబిలు రాజు యొద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలియజేస్తుంది మరియు వారిలో ఒకరు 11-12 వచనాలలో ఇలా అన్నాడు, "దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను." ఈ వ్యక్తి యొక్క విన్నపము పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించబడిందని యేసు సెలవిచ్చాడు. పోల్చి చూస్తే, క్రీస్తు యొక్క నీతిని ధరించిన మరొక వ్యక్తి అంగీకరించబడ్డాడు.

ఈ భక్తిగీతము నాకు చాలా ఇష్టం
"నువ్వు రక్తముతో కడుగబడ్డవా,
గొఱ్ఱెపిల్ల యొక్క ఆత్మ-శుద్ధి రక్తములో?
నీ వస్త్రాలు మచ్చలేనివిగా ఉన్నాయా? అవి మంచులా తెల్లగా ఉన్నాయా?
నువ్వు గొఱ్ఱెపిల్ల రక్తముతో కడుగబడ్డవా?"
 
అలాగే, మహారాజు సన్నిధిలోకి ప్రవేశించాలంటే, మీరు యేసయ్య రక్తముతో తడిచిన వస్త్రాన్ని ధరించాలి. పాపం అనే వస్త్రాన్ని విసర్జించి ప్రభువైన యేసయ్యను ధరించండి.

Bible Reading: Leviticus 10-12
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీ అంతులేని కృపకై నేను మీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఎలా ఉన్నానో అలానే నీ యొద్దకు వస్తున్నాను, మరియు నీవు నన్ను శుద్ధి చేసి, ప్రతి అన్యాయాల నుండి నన్ను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నేను ఈ రోజు నా వస్త్రాన్ని నీ ముందు పెట్టాను మరియు నీ అమూల్యమైన రక్తముతో నన్ను పరిశుద్ధపరచి నన్ను బాగుచేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి నుండి, నేను రాజు యెదుట తిరస్కరించబడను, కానీ నేను ఎస్తేరు వంటి ప్రజలను పొందుకుంటాను. యేసు నామములో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు
● మీరు చెల్లించాల్సిన వెల
● 02 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీరు సులభంగా గాయపరచబడుతారా?
● 21 రోజుల ఉపవాసం: 1# వ రోజు
● మీ మనస్సును క్రమశిక్షణలో పెట్టండి
● ప్రభువును విచారించుట (మొర్రపెట్టుట)
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్