english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీరు నిజమైన ఆరాధకులా
అనుదిన మన్నా

మీరు నిజమైన ఆరాధకులా

Wednesday, 12th of February 2025
0 0 195
Categories : ఆరాధన (Worship) ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)
దేవుడు తనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారు కావలెనని కోరుచున్నాడు (వెదుకుచున్నాడు). (యోహాను 4:23)

తన ప్రముఖ హోదా యొక్క పూర్తి బరువును మోస్తూ, మారువేషంలో ఉన్న రాజు సొలొమోను "షూనేమీయురాలు" అనే పేరులేని గొర్రెల కాపరితో ప్రేమలో పడ్డాడు. వెయ్యి మంది భార్యలు ఉన్న ప్రముఖ పాలకుడు ఒక సాధారణ రైతు అమ్మాయి పట్ల ఎందుకు అంతగా ఆసక్తి చూపుతున్నాడు? నేను పరమగీతములో ఉన్న ఒక వ్యాఖ్యానమును చూశాను, "పరమగీతము ప్రారంభంలో, షూనేమీయురాలు స్త్రీ మరియు సొలొమోను మహారాజు మధ్య ప్రేమ వ్యవహరించడం మనము చూస్తాము.

5-6 వచనాలలో, షూనేమీయురాలు స్త్రీ తన రంగులో ముదురు రంగులో ఉందని, ఇతరుల కోసం ద్రాక్షతోటలు ఉంచుతుందని మరియు ఆమె తల్లి పిల్లలు ఆమెపై కోపంగా ఉన్నారని పేర్కొంది. ఆమె ఛాయలో ముదురు రంగులో ఉండటం వల్ల ఆమె తన జీవితాన్ని కష్టతరమైన పనిలో గడిపినట్లు సూచిస్తుంది. ఆమెకు లగ్జరీ తెలియదు, లేదా ఆమె తనను తాను చూసుకోలేకపోయింది. ఆమె సొగసుగా ఉందని (ఆమె అందంగా ఉంది,) ఆమె శరీరం ఆమె కష్టజీవి యొక్క ప్రభావాలను చూపుతుంది. ఆమె తన సొంత ద్రాక్షతోటను ఉంచుకోలేదని, అంటే తనకు ద్రాక్షతోట లేదని కూడా చెప్పింది. ఆమెకు సంపద లేదు; ఆమెకు ఆస్తులు లేవు.

ఆమె పాత నిబంధన కాలంలో (అలాగే మధ్యయుగ కాలంలో మరియు ఆధునిక కాలంలో కూడా) రాజుకు సరిపోయే వధువు కాదు; రాజా కుటుంబ సభ్యులు వారి రాజ్యాలకు శాంతి లేదా సమృద్ధి తీసుకురాగల వారిని వివాహం చేసుకుంరంటారు. పొత్తులు, వాణిజ్య ఒప్పందాలు మరియు విలీనాలు కూడా రాజ వివాహాల ద్వారా నిర్వహించబడ్డాయి. షూనేమీయురాలు స్త్రీ వీటిలో దేనినీ ఇవ్వదు. అయినప్పటికీ, ఆమె నిరుపేద పరిస్థితిలో ఉన్నప్పటికీ, రాజైన సొలొమోను ఆమెను ప్రేమిస్తున్నాడు. 2:4 వ వచనంలో, షూనేమీయురాలు స్త్రీ ఇలా చెప్పింది, "అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను."

అహష్వేరోషు ఎస్తేరుతో ప్రేమలో పడిన అదే కారణాల వల్ల సొలొమోను కూడా ఈ స్త్రీని ప్రేమించాడని నేను నమ్ముతున్నాను. ఇద్దరు నాయకులు తెలిసిన ప్రపంచంలో అత్యంత అందమైన స్త్రీలను ఎంచుకున్నారు. బహుశా ప్రతి పాలకుడు తన రాజరిక శక్తి మరియు గొప్ప రాజుగా అధికారంతో కాకుండా ఒక అందమైన యువ కన్య అతనితో ప్రేమలో పడవచ్చు అనే వాస్తవం ద్వారా ఆకర్షితుడయ్యాడు.

అదేవిధంగా, ఎస్తేరు లాగా, రాజు ఆశీర్వాదం కంటే రాజుతో ప్రేమలో పడే ఎక్కువ మంది అనుచరుల కోసం మహిమ గల రాజు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. బహుమతి కంటే దాతని ప్రేమించేవారిని దేవుని హృదయం కోరుకుంటుంది. వినియోగదారులు రాజా బల్ల వద్ద తింటారు, కానీ వారు చాలా అరుదుగా ప్రేమను చూపుతారు. ఒక ఆరాధకుడు పూర్తిగా రాజు మీద దృష్టి పెడతాడు, మరియు అతని అవసరాలు తీర్చబడుతాయి. మీరు వినియోగదారులా లేదా ఆరాధకులా? మీరు దేవుడు ఏమి ఇస్తాడు లేదా అయన ఎవరు అని తెలుసుకుంటున్నారా? మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయన మీ కోసం ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నా
రో లేదా దేవుని రాజ్యము వైపా? మీరు ఎల్లప్పుడూ దేవుని ఎక్కువగా తెలుసుకోవాలని చూస్తున్నారా లేదా మీరు ఇప్పటికే నిండుగా ఉన్నారా?

దేవుడు నిజమైన ఆరాధకుల కోసం చూస్తున్నాడు. యోహాను 4వ అధ్యాయంలో, ఒక స్త్రీ ఒక బావి వద్ద యేసయ్యను కలుసుకుంది, అక్కడ ఆయన ఆమెకు నీటి వనరులను దయచేసాడని చెప్పాడు, కనుక ఆమె మళ్లీ బావి వద్దకు నీళ్లు తీసుకురావడానికి రావలసిన అవసరం లేదు. ఆ స్త్రీ ఆకర్షితురాలైంది మరియు యేసు తనకు ఇవ్వమని త్వరగా కోరింది. ఇది మనలో చాలా మందికి ఇష్టం. దేవుడు ఏమి అందించాలో మనకు కావాలి, కానీ యేసు ఆమె హృదయ స్థితి మీద ఎక్కువ ఆసక్తి చూపాడు. ఆమె నిజమైన ఆరాధకురాలా?

ఆయన యోహాను 4: 21-24 లో ఆమెతో ఇలా అన్నాడు, "యేసు ఆమెతో ఇలా అన్నాడు, "అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.

అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను."

ఇది పునరాలోచించాల్సిన సమయం. నేడు, చాలా మంది ప్రభువును వెదకుతారు మరియు వారు అవసరమైనప్పుడు మాత్రమే సంఘానికి వస్తారు. "దేవా, నీవు నా సొత్తు., నేను ఎల్లపుడు నీ సొత్తు?"

Bible Reading: Leviticus 26-27
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, ఈ రోజు నాకు నీ వాక్యము అర్థం చెప్పినందుకు వందనాలు. నీవు నా హృదయాన్ని తీసుకొని దానిని నీకు పరిశుద్ధపరచమని నేను ప్రార్థిస్తున్నాను. నీవు నా క్షణం మరియు నా దినాలను తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను; అవన్నీ నీ కోసం ఉండును గాక. నీ కార్యములను కాక నిన్ను వెతకడానికి నాకు సహాయం చేయి. నన్ను నిజమైన ఆరాధకునిగా చేయి. యేసు నామములో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ప్రవచన ఆత్మ
● పరిపూర్ణ సిద్ధాంతపరమైన బోధన యొక్క ప్రాముఖ్యత
● లైంగిక శోధనపై ఎలా విజయం పొందాలి - 1
● క్రీస్తు ద్వారా జయించుట
● మీరు ఎవరి సమాచారమును నమ్ముతారు?
● 18 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● గతం యొక్క ఏకాంతగృహమును తెరుచుట
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్