english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. వారు చిన్న రక్షకులు
అనుదిన మన్నా

వారు చిన్న రక్షకులు

Wednesday, 12th of March 2025
0 0 111
Categories : తల్లిదండ్రులు (Parents)
"మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును." ఓబద్యా 1:21 

చాలా మంది పిల్లలు అనుకోకుండా పుట్టె పొరపాటు అని ఆలొచిస్తారు. బహుశా మీరు మీ బిడ్డను పొరపాటుగా, ప్రణాళిక లేని గర్భధారణగా భావించే తల్లిదండ్రులలో ఒకరు, కాబట్టి మీరు వారి జీవితాన్ని మరియు వారి పెంపకాన్ని తీవ్రంగా పరిగణించరు. నేను మీకు మంచి శుభవార్త చెప్పాలనుకుంటున్నాను; మీ బిడ్డ ప్రమాదంగా పుట్టలేదు. మీ బిడ్డ కోసం దేవునికి ఖచ్చితమైన ఉద్దేశ్యం ఉంది. మీ బిడ్డ భూమిని ప్రకాశవంతం చేయడానికి దేవుడు పంపిన నక్షత్రం. దురదృష్టవశాత్తు, చాలా మంది తల్లిదండ్రుల కంటే అపవాది మన పిల్లల సామర్థ్యమును ఎక్కువగా గుర్తిస్తుంది, కాబట్టి వాడు వారి అభివృద్ధిని నిరుత్సాహపరచడానికి ప్రతిదీ చేస్తాడు. 

ఈ ఉదాహరణను మార్కు 9:20-23లో చూద్దాం. బైబిలు ఇలా చెబుతోంది, "వారాయన యొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడు చుండెను. అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యము నుండియే; అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను."

క్రీస్తు పరిచర్యలో ఒక సందర్భంలో, ఆయన చిన్నతనం నుండి శారీరకంగా బాధపడుతున్న మూర్ఛరోగ బాలుడికి విముక్తి కలిగించాడు (మార్కు 9:21). మరొక సందర్భంలో, ఆయన దురాత్మచే పట్టబడిన ఒక స్త్రీ యొక్క చిన్న కుమార్తెను విడిపించాడు (మత్త. 15:22).  
ఈ రెండు సంఘటనలు కొన్ని రకాల ఆత్మలు చాలా చిన్న వయస్సులోనే పిల్లల జీవితాల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాయని సూచిస్తున్నాయి. ఈ పిల్లలు నెరవేర్చడానికి అద్భుతమైన విధిని కలిగి ఉన్నారు. అవి ప్రపంచవ్యాప్త పరిష్కారం. బహుశా అపవాది ఈ నక్షత్రాలను చూసి వారి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించాలని నిర్ణయించుకున్నాడు.
ఒక చిన్న అమ్మాయి జీవితంలో ఒక దురాత్మ చేత పట్టుకోవడానికి ఏమి చేసిందో మీరు ఊహించవచ్చు. పిల్లవాడు ఎవరిని కించపరిచాడు, లేదా వాడు జీవితంలో దేనితో సంబంధం కలిగి ఉన్నాడు? ఒక చిన్న పిల్లవాడు దురాత్మ చేత హింసించబడ్డాడు ఏమి జరిగింది? వీరు చీకటి రాజ్యాన్ని హింసించేలా పెరిగే వ్యక్తులు, కాబట్టి అపవాది వారి జీవితాల కోసం దేవుని ప్రణాళికను నిరాశపరిచాడు. కానీ వాడు విఫలమయ్యాడు.మీకు సమస్యలను ఇచ్చే బిడ్డ ఉన్నాడా? మీకు ఆనందం కంటే ఎక్కువ కన్నీళ్లు తెప్పించే మరియు తప్పులలో పడిపోతూనే ఉండే బిడ్డ మీరు కలిగి ఉన్నారా? మీ బిడ్డ ఒక వ్యసనం లేదా మరొక బాధలో ఉన్నాడా? ఆ పిల్లలు రక్షకులని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అవును, ఆయన అద్భుతమైన మరియు రంగుల విధిని కలిగి ఉన్నాడు. ప్రపంచం ఎదురు చూస్తున్న సమాధానం ఆయనదే. గర్విష్ఠులను తగ్గించే గొప్ప ఆవిష్కరణలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి వదులుకోవద్దు. మీరు అనుభవిస్తున్నదంతా ఆ అద్భుతమైన విధి నుండి అతనిని లేదా ఆమెను మార్చడానికి అపవాది యొక్క తారుమారు మాత్రమే.

ఉదాహరణకు, ఐగుప్తు యొక్క ఫారో ఐగుప్తుయులను మంత్రసానులను మరియు తరువాత, ఐగుప్తుయుల ప్రజలందరినీ, ప్రతి నవజాత హీబ్రూ కుమారులను నైలు నదిలో పడవేయమని నియమించాడు (నిర్గమకాండము 1:16, 22). కుమారుల మీద ఈ మరణ శాసనం నైలు నదిలో చేతితో తయారు చేసిన చిన్న ఓడలో శిశువును దాచడానికి మోషే తల్లిని బలవంతం చేసింది.
శతాబ్దాల తర్వాత, బేత్లెహేములో యూదుల రాజు జన్మించాడని హేరోదు విన్నాడు. భయంతో, అతడు రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులందరినీ చంపమని రోమా సైనికులకు ఆజ్ఞాపించాడు (మత్తయి 2:16). కానీ, దేవుని రక్షణ ద్వారా, మోషే మరియు యేసు ఇద్దరూ ఈ మరణ శాసనాల నుండి తప్పించుకున్నారు మరియు వారి తరానికి విముక్తిని తీసుకువచ్చారు - ఒకరు ఐగుప్తుయులకు మరియు మరొకరు సమస్త లోకానికి.
కాబట్టి, మీ బిడ్డలను వధకు ఇవ్వకండి. దేవుడు వారిలో గొప్ప ఆవిష్కరణలను ఉద్దేశించి, రూపొందించాడు. మీరు చేయవలసిందల్లా మార్కు అధ్యాయం 9లోని పిల్లల తండ్రి లేదా మత్తయి అధ్యాయం 15లోని తల్లి యొక్క ఆ పద్దతిని పాటించడం. మీ బిడ్డ కొరకు యేసయ్యను వెంబడించండి.

 దయచేసి అతనిని లేదా ఆమెను వదులుకోవద్దు ఎందుకంటే వారి కాంతి లేకుండా ప్రపంచం చీకటిలో ఉంటుంది. లోకాన్ని విముక్తం చేసే గొప్ప సంపదలను దేవుడు వారిలో నిక్షిప్తం చేసాడు. కాబట్టి, వారి కోసం ప్రార్థించండి. ప్రార్థనలో వారిని రక్షకుని వద్దకు తీసుకువెళ్లండి, తద్వారా వారి లోక కార్యము మంచి పునాదిని కనుగొనగలదు.

Bible Reading: Deuteronomy 31-32
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, ఈ యువకుల ఆశీర్వాదానికై నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చీకటి సంకెళ్ళ నుండి వారిని రక్షించమని మేము ప్రార్థిస్తున్నాము. విధిలో వారి స్థానాన్ని పొందేందుకు వారు ఎదగాలని మేము ప్రార్థిస్తున్నాము. నీ ఉద్దేశ్యం నుండి అపవాది వారిని తొలగినీయకుండును గాక. వారు తమ తరాన్ని క్షీణత నుండి కాపాడదురు. యేసు నామములో. ఆమెన్!

Join our WhatsApp Channel


Most Read
● ఇది సాధారణ అభివందనము కాదు
● అనుకరించుట (పోలి నడుచుకొనుట)
● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #3
● నరకం నిజమైన స్థలమా
● మీ ప్రపంచానికి ఆకారం ఇవ్వడానికి మీ తలంపును ఉపయోగించండి
● మీ దైవికమైన దర్శించే కాలమును గుర్తించండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్