చాలా మంది విశ్వాసులు జీవితంలో దేవుడు "పెద్ద విషయాల" గురించి మాత్రమే ఆలోచిస్తాడని అనుకుంటారు - లోక సంఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ప్రపంచ పునరుజ్జీవనం. ఆయన నిజంగా దేశాలు, గెలాక్సీలపై సార్వభౌమాధికారి అయినప్పటికీ, ఆయన మీ హృదయ నిశ్శబ్ద కేకలను కూడా ప్రేమగా వింటాడు. మీరు మోస్తున్న ఆ చిన్న భారం? ప్రార్థనలో లేవనెత్తడానికి చాలా చిన్నదిగా అనిపించేది ఏదైనా? అది దేవునికి ముఖ్యమైనది.
🔹మీ పరలోక తండ్రికి ఏదీ చిన్నది కాదు
తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేలపై పడదని ప్రభువైన యేసు ఒకసారి చెప్పాడు (మత్తయి 10:29). ఆ వెంటనే, ఆయన మరింత వ్యక్తిగతమైన విషయాన్ని వెల్లడించాడు: “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి.” (మత్తయి 10:30). దాని గురించి ఆలోచించండి—ఈ క్షణంలో మీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో దేవునికి తెలుసు. మీ వ్యక్తిత్వంలోని అతి చిన్న వివరాలలో ఇంతగా నిమగ్నమైన దేవుడు మీ ఆందోళనలను ఎప్పుడైనా విస్మరించగలడా?
మనం సమస్యలను వర్గీకరిస్తాము: “దీని గురించి ప్రార్థించడం విలువైనది. ఇది కాదు.” కానీ దేవుడు దానిని అలా చూడడు. అది మీ హృదయాన్ని తాకితే, అది ఆయన హృదయాన్ని తాకుతుంది. అది పాఠశాల ఆందోళనతో పోరాడుతున్న పిల్లవాడు అయినా, మీరు మరమ్మతులు చేయలేనప్పుడు విరిగిన ఉపకరణం అయినా, లేదా అకస్మాత్తుగా మౌనంగా ఉన్న ఒక స్నేహితుడు అయినా - ఆయన చూస్తాడు, ఆయనకు తెలుసు మరియు ఆయన శ్రద్ధ వహిస్తాడు.
🔹సాక్స్ మరియు ప్రేమగల తండ్రి కథ
ఒక సాయంత్రం, మేము చర్చికి సిద్ధమవుతుండగా, నా కుమార్తె అబిగైల్ (అప్పుడు ఆమెకు దాదాపు నాలుగు సంవత్సరాలు) ఆమెకు ఇష్టమైన సాక్స్ జత దొరకలేదు. పెద్దవారికి అది చిన్నవిషయంగా అనిపించవచ్చు, కానీ ఆమెకు, అదే సమస్తాన్ని సూచిస్తుంది. ఆమె మూలలో నిలబడి, కనీళ్లు విడుస్తుంది. ఆ సమయంలో, నేను ఆగి, “ప్రార్థించి, సాక్స్‌లను కనుగొనడానికి మాకు సహాయం చేయమని యేసును వేడుకుందాం” అని అన్నాను. ఒక నిమిషంలో, వాటిని ఒక కుషన్ కింద ఉండడం చూశాము. ఆమె కళ్ళు వెలిగిపోయాయి - సాక్స్‌లు దొరికినందున కాదు, ప్రభువైన యేసు తన సాక్స్‌ల పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని ఆమె గ్రహించినందున.
ఆ సాయంత్రం, ఆమె చర్చిలో ఉన్న వారందరితో, “నా సాక్స్‌లను కనుగొనడానికి యేసు నాకు సహాయం చేసాడు!” అని చెప్పింది. గమనించండి, మీ పరలోక తండ్రి కూడా అలాగే ఉన్నాడు. మీ సమస్యలు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకునే వరకు ఆయన వేచి ఉండడు, ఆయన మీ జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ పాలుపంచుకుంటాడు.
🔹నువ్వు ఎల్లప్పుడూ ఆయన మనసులో ఉంటావు
కీర్తనలు 139:17 ఇలా చెబుతోంది, “దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా!” నీ గురించి దేవుని ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, ఆయన నీతో కలిసి సంతోషంగా ఉంటాడు. నువ్వు ఆందోళన చెందుతున్నప్పుడు, నిన్ను ఓదార్చడానికి ఆయన మొగ్గు చూపుతాడు. నువ్వు అల్పుడివని భావించినప్పుడు, నువ్వు భయంతో ఆశ్చర్యముతో సృష్టించబడ్డావని ఆయన నీకు గుర్తు చేస్తాడు.
యిర్మీయా 29:11 కేవలం ఒక మంచి వచనం కాదు. ఇది ఒక వాగ్దానం: “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు;" ఇదే యెహోవా వాక్కు. ఈ ప్రణాళికలలో ప్రధాన మైలురాళ్ళు మీ రోజులోని చిన్న క్షణాలు రెండూ ఉన్నాయి.
🔹ఆయనను ప్రతి స్థలములోకి ఆహ్వానించండి
కొన్నిసార్లు మనం దేవుని వివరాల నుండి దూరంగా ఉంచినందున అనవసరంగా ఇబ్బంది పడతాము. ఆయనను లోపలికి రానివ్వండి. మీ అనుదిన దినచర్యలలోకి, మీ భావోద్వేగ పోరాటాలలోకి, మీ వ్యాపార నిర్ణయాలలోకి మరియు మీ వార్డ్‌రోబ్ ఎంపికలలోకి కూడా ఆయనను ఆహ్వానించండి, అవి మీకు ఒత్తిడిని కలిగిస్తే! ఆయనతో ఏదీ పరిమితి లేదు. ఒక పిల్లవాడు ప్రేమగల తల్లిదండ్రులపై ఆధారపడినట్లుగా మీరు ఆయనపై ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు.
Bible Reading 2 Kings: 1-3
ప్రార్థన
పరలోక తండ్రీ, తుఫానులలోనే కాదు, నిశ్శబ్దంలో కూడా నన్ను చూసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. నా భారాలను ఒంటరిగా మోయడానికి ప్రయత్నించిన సమయాలకు నన్ను క్షమించు. ఈ రోజు, నేను వాటన్నింటినీ నీకు అప్పగిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్!!
Join our WhatsApp Channel

Most Read
● ఆ విషయాలను క్రియాత్మకంగా చేయండి● దేవుడు భిన్నంగా చూస్తాడు
● అడ్డు గోడ
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
● కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యొక్క శక్తి
● పరలోకము అనే చోటు
● ఆరాధన: సమాధానమునకు మూలం
కమెంట్లు