1.పాస్టర్ మైఖేల్ వాక్యం మరియు ప్రార్థనలో ఎదగాలని ప్రార్థించండి. ప్రవచనాత్మక వరము, స్వస్థత వరము, విమోచన వరము మరియు అద్భుత వరములో ఎదగడానికి ప్రార్థించండి. పాస్టర్ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి. దైవిక రక్షణ మరియు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించండి. పాస్టర్ మైఖేల్ గుణం మరియు జ్ఞానం గల వ్యక్తిగా ఉండానికి ప్రార్థించండి.
2.KSM పాస్టర్లు, గ్రూప్ సూపర్‌వైజర్లు, J-12 నాయకులు మరియు కోయిర్ సభ్యులందరూ వాక్యం మరియు ప్రార్థనలో ఎదగాలని ప్రార్థించండి. మంచి ఆరోగ్యం, దైవిక రక్షణ మరియు క్షేమము కోసం ప్రార్థించండి. యేసు యొక్క లక్ష్యాన్ని (పనిని) సత్యంతో మరియు ఆత్మతో తీసుకువెళ్ళడానికి KSM నాయకులందరిలో ఐక్యత మరియు అవగాహన కోసం ప్రార్థించండి.
3.KSM సంఘానికి ఎక్కువ ఆత్మలు చేర్చబడాలని ప్రార్థించండి. KSM చర్చికి చేర్చబడిన ఆత్మలని వాక్యం మరియు ప్రార్థనలో మరియు అభివృద్ధి చెందాలని. వారు కూడా ఆత్మలను సంపాదించేవారిగా. వారి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ వచ్చు లాగున ప్రార్థించండి.
4.ప్రతి ప్రత్యక్ష సభలో సరైన వాక్యం కోసం పాస్టర్ మైఖేల్ కొరకు. సరైన అనువాదం కోసం పాస్టర్ రవి కొరకు. ఓం ప్రకాష్ మరియు లైవ్ ట్రాన్స్మిషన్లో సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు. అన్ని మీడియా పరికరాలు సరిగ్గా పనిచేయడానికి. లైవ్ సేవలు మరియు ఆన్‌లైన్ మధ్యసత్యం చేసే వారు సమయానికి ప్రారంభించి, ఆలస్యం చేయకుండా సమయానికి ముగించేలాగున ప్రార్థించండి.
5.తండ్రీ, నీ చిత్తానుసారముగా మేము మేది అడిగినను, మీరు మా మనవి ఆలకిస్తారు. మాపై దయ చూపమని మరియు కరోనావైరస్ యొక్క ఈ ప్లేగు వ్యాధిని పూర్తిగా నాశనం చేయమని మేము నిన్ను బతిమాలుచున్నాము. యేసు నామంలో. (1 యోహాను 5:14)
6.తండ్రీ, మీరు మా ఆశ్రయమును దుర్గమునై యున్నారు ఆపత్కాలములో మీరు నమ్ముకొనదగిన సహాయకుడు. అనారోగ్యంతో మరియు ఈ వైరస్‌తో బాధపడుతున్న వారందరిపై లేదా దాని లక్షణాలతో బాధపడుచున్న వారిపై మీ స్వాస్థ్యమును మరియు సంపూర్ణతను ఆజ్ఞాపిస్తున్నాము. మేము నిర్బంధంలో ఉన్న వేలాది మందికి జీవితం మరియు శాంతిని కూడా విడుదల చేస్తున్నాము. యేసు నామంలో. (కీర్తనలు 46:1)
7.తండ్రీ, ఈ సంక్షోభం ద్వారా దేశాలు మరియు సంస్థలను నడిపిస్తున్న అన్ని ప్రభుత్వ అధికారులు మరియు నిర్ణయాధికారుల కోసం మేము ప్రార్థిస్తున్నాము. దేవుని జ్ఞానం మరియు రక్షణను వారి, వారి బృందాల మరియు కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వారు తమ దేశాలకు మరియు ప్రపంచ సమాజానికి ప్రయోజనం చేకూర్చే చురుకైన నిర్ణయాలు తీసుకుంటారని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో.
8.తండ్రీ, మీ వాక్యము ఇలా సెలవిస్తుంది, "మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించెను." (దానియేలు 5:21) రాజకీయ నాయకులందరి రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తును వారి స్వంత ప్రభువుగా మరియు రక్షకుడిగా స్వీకరించాలని మేము ప్రార్థిస్తున్నాము.
9.KSM ప్రత్యక్ష ప్రసారాలు మరియు మధ్యసత్యం చేసే వారుకు వ్యతిరేకంగా పని చేసే ప్రతి చీకటి శక్తులు మరియు అడ్డంకులను యేసు నామంలో తీసివేయబడునుగాక. ప్రతి ప్రత్యక్ష ప్రసారం మరియు ఆన్‌లైన్ మధ్యస్త్యులకు మొదటి నుండి చివరి వరకు యేసు రక్తంతో కప్పబడులాగున. ప్రత్యక్ష ప్రసారాలు మరియు ఆన్‌లైన్ మధ్యసత్యంకు హాజరయ్యే వారి జీవితంలో అద్భుతాలు, స్వస్థతలు, సూచకక్రియలు మరియు మహత్కార్య ములు జరుగులాగున. ప్రత్యక్ష ప్రసారం మరియు ఆన్‌లైన్ మధ్యసత్యంలో పాల్గొనే ప్రతి ఒక్కరిపై దేవుని శక్తి ఉండు లాగున ప్రార్థించండి.
10.కరుణ సదన్ సేవతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి జీతం, పదోన్నతులు, అద్భుత ఉద్యోగాలు, అలౌకిమైన కృప మరియు గొప్ప క్షేమము పెరుగులాగున. కరుణ సదన్ సేవతో అనుసంధానించబడిన వారి జీవితాలు మరియు కుటుంబాలపై ప్రతి శాపం మరియు బంధం విచ్ఛిన్నం కాలాగున ప్రార్థించండి.
11.KSM సేవలో (ప్రత్యక్ష ప్రసారంలో కూడా) చాలా మంది ఆర్థికంగా విత్తులాగున (ఇవ్వులాగున). KSM కి ఇచ్చే ప్రతి వ్యక్తి అసాధారణమైన కృపను అనుభవించులాగున. వారి అప్పులు రద్దు చేయులాగున , తమకు అనుకూలంగా కోర్టు కేసులు, వారి సొంత ఇళ్ళు మరియు వాహనాలు వచ్ఛులాగున. యేసు నామంలో ప్రార్థించండి.
12.ఎక్కువ మంది ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో మరియు ఆన్‌లైన్ మధ్యసత్యంలో హాజరు కావడానికి. ప్రజలను చేరకుండా ఆపుతున్న సోమరితనం మరియు ప్రతి అడ్డంకులు యేసు నామంలో తీసివేయబడులాగున. ప్రత్యక్ష ప్రసారం మరియు ఆన్‌లైన్ మధ్యసత్యంకు హాజరయ్యే ప్రజలు, వారి జీవితాలు పూర్తిగా రూపాంతరం చెందాలి మరియు మార్చబడేలాగున ప్రార్థించండి.
13.ఎక్కువ మంది ప్రజలు నోహ్ యాప్లో చేరడానికి మరియు యాప్ యొక్క ప్రతి అంశంతో జ్ఞానోదయం మరియు పరివర్తన చెందడానికి. అనుదిన మన్నా, ఈబుక్స్, ప్రార్థన అభ్యర్థనలు. ఎక్కువ మంది యూట్యూబ్ ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందడానికి ప్రార్థించండి.
14.ప్రత్యక్ష ప్రసారంలో లేదా ఏదైనా KSM సభలో తమ సాక్ష్యాలను పంచుకున్న ప్రతి వ్యక్తి, నేను వారి సాక్ష్యాన్ని యేసు రక్తం ద్వారా దాచి ఉంచుతాను. వారి సాక్ష్యం రోజురోజుకు బలంగా పెరగాలని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రీ, మీరు వారి జీవితంలో మరిన్ని అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
15.కరుణ సదన్ లో బుద్ధి మరియు మంచి ఆరోగ్యంతో సమర్థవంతంగా సేవలందించాలని ప్రతి KSM సిబ్బంది కోసం ప్రార్థించండి.
16.తండ్రీ, ఈ దేశంలో మరియు దేశాల మధ్య శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. మేము ఇశ్రాయేలు దేశాన్ని ఆశీర్వదిస్తున్నాము. ఏ యుద్ధం ఉండదు.
17.తండ్రీ, మీ అలౌకిక శక్తి ద్వారా మునుపటి సాధారణం కంటే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో.
18. తండ్రీ, ప్రతి ఆదివారం ప్రతి KSM ఆరాధనలో జరిగే KSM పిల్లల పరిచర్యలో చాలా మంది పిల్లలు రావాలని మేము ప్రార్థిస్తున్నాం. వారు నిన్ను చూసి ప్రభువుగా, రక్షకుడిగా తెలుసుకునేలా వారి కళ్ళు తెరువు. వారి హృదయాలు, పెదవులు నీ వాక్యంతో నిండి ఉండాలి. ఈ పిల్లల పరిచర్య ద్వారా దానియేలు, ఎస్తేరులను ప్రభువు లేవనెత్తు.
19. KSM పిల్లల పరిచర్యలోని ప్రతి అధ్యాపకుని నీ మార్గాల ప్రకారం పిల్లలను నడిపించడానికి నీవు జ్ఞానంతో నింపాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ అధ్యాపకులు అభిషేకంలో ఎదగాలని, ఈ పిల్లలకు సరైన మార్గంలో సేవ చేయాలని యేసు నామంలో మేము ప్రార్థిస్తున్నాం.
Join our WhatsApp Channel