english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. ప్రార్థనలు
  3. పాస్టర్ మైఖేల్ &సేవ కోసం ప్రార్థన
అనుదిన ప్రార్థన

పాస్టర్ మైఖేల్ &సేవ కోసం ప్రార్థన

432
పాస్టర్ మైఖేల్ &కుటుంబం
1. తండ్రీ, యేసు నామంలో, ఆత్మ రాజరికంలో స్పష్టంగా చూడటానికి పాస్టర్ మైఖేల్ గారి కళ్ళు తెరువు. పరిశుద్ధాత్మ ఆయన కళ్ళకు అభిషేకించండి. 

2. తండ్రీ, యేసు నామంలో, నీ స్వరాన్ని మరింత స్పష్టంగా వినడానికి పాస్టర్ మైఖేల్ గారి చెవులను తెరువు. ధన్యుడగు పరిశుద్దాత్మ ఆయనకి వివేకవంతమైన చెవులను దయచేయి.

3. దేవుని పవిత్ర అగ్ని పాస్టర్ మైఖేల్ గారి పెదవులు, నాలుక మరియు నోటిని ముట్టు. ఆయన నీ వాక్యాన్ని దేశాలతో ఖచ్చితత్వముగా మాట్లాడటానికి ఆయనకు పవిత్రమైన నోటిని దయచేయి.

4. తండ్రీ, యేసు నామంలో, నేను పాస్టర్ మైఖేల్ గారిని, ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మరియు బృందంపై యేసు రక్తాన్ని వర్తింపజేస్తాను. వారందరి చుట్టూ అగ్ని గోడగా ఉండు. నీ పవిత్ర దేవదూతలతో వారిని చుట్టుముట్టు. వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువు యొక్క ప్రతి దాడిని నాశనం చేయి. వారిని ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంచు.

5. తండ్రీ, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారి జీవితంలో, ఆయన కుటుంబ సభ్యులలో మరియు బృంద సభ్యులలో నీ పవిత్రత, స్వచ్ఛత మరియు వినయం కోసం ప్రార్థిస్తున్నాను.

6. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారిని, ఆయన కుటుంబ సభ్యులు మరియు బృంద సభ్యులు సరైన వ్యక్తులతో సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటానికి సహాయం చేయి. ఆయనని మరియు ఆయన కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ సరైన వ్యక్తులతో సంబంధం కలిగి ఉండేలా చేయి.

7. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారు తన భార్యకు మంచి భర్తగా, పిల్లలకు మంచి తండ్రిగా, తల్లిదండ్రులకు మంచి కొడుకుగా మరియు ప్రపంచ దేశాలకు బలమైన, సమర్థవంతమైన మరియు ఫలవంతమైన నాయకుడిగా ఉండటానికి సహాయం చేయి.

8. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్‌ గారిని స్వభావం మరియు సమగ్రత గల వ్యక్తిగా చేయి. డబ్బు ప్రేమ నుండి ఆయనని దూరంగా ఉంచు. ఆయన తన భార్య తప్ప వేరే స్త్రీని ఎప్పటికీ కోరుకోకుండును గాక.

9. తండ్రీ, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారిని నీ వాక్యంలో అభివృద్ధి చెందేలా చేయి. నీ వాక్యములోని రహస్యాలను ఆయనకు వెల్లడిపరచు. 

10. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారిని ప్రార్థన మరియు ఉపవాసంలో అభివృద్ధి చెందేలా చేయి. తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు పిలుపునకు వ్యతిరేకంగా పని చేస్తున్నా శత్రువు యొక్క ప్రతి పనులను యేసు నామంలో నేను బంధిస్తున్నాను.

11. తండ్రీ, యేసు నామంలో, పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను ఆయనలో మరియు ఆయన ద్వారా ఎల్లప్పుడూ సమర్థవంతంగా పనిచేయునుగాక. ఆయన ద్వారా మరియు ఆయన పరిచర్య ద్వారా అద్భుతమైన మరియు గుర్తించదగిన అద్భుతాలను చేయి.

12. పాస్టర్ మైఖేల్ గారు ప్రతి సభలో బోధిస్తు ఉండగా పాస్టర్
మైఖేల్ గారి గొంతు మరియు స్వరం పరిపూర్ణంగా మరియు మంచిగా ఉండాలని మరియు పాస్టర్ మైఖేల్ గారు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో దీవించబడాలని ప్రార్థించండి.

13. యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారి కోసం ఈ విషయాలను ప్రార్థించే ప్రతి ఒక్కరూ అద్భుతమైన అద్భుతాలు, సంరక్షణ మరియు అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆదేశిస్తున్నాను మరియు ఆజ్ఞాపిస్తున్నాను.

పాస్టర్ మైఖేల్ గారి పుస్తకాలు మరియు బోధనా కొరకు
1. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్‌ గారి పై ఎల్లప్పుడూ జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మ ఉంటుందని నేను ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం నుండి లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టులను ఆయనకి దయచేయండి, తద్వారా ఆయన వాటిని తన బోధనలలో మరియు పుస్తకాలలో వ్రాయునుగాక.

2. తండ్రీ, యేసు నామంలో, నీ శాంతితో ఆయనను ఎప్పుడూ చుట్టుముట్టు. ఆయన ఎల్లప్పుడూ ప్రశాంతమైన పరిసరాలలో ఉండునుగాక. ప్రతి కలవరమును నిర్మూలించు మరియు శక్తివంతమైన బోధనలు మరియు పుస్తకాలను సిద్ధం చేయడానికి ఆయనకి సమయం మరియు కృపను దయచేయి.

3. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారి యొక్క బోధనలు మరియు పుస్తకాలు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని తాకడానికి సహాయం చేయి. ఆయన బోధనలు వింటూ, ఆయన పుస్తకాలను చదివినప్పుడు ప్రజలు నీ మహిమ కోసం స్వస్థత, విడుదల మరియు రక్షణ పోదునుగాక.

4. తండ్రీ, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారి పుస్తకాలన్నీ సరిగ్గా రూపకల్పన చేసి ముద్రించబడాలని ప్రార్థిస్తున్నాను. ఆయన పుస్తకాలు మరియు బోధనలు ఏవైనా సిద్ధాంతపరమైన లోపాల నుండి విముక్తి పోదునుగాక.

5. తండ్రి, యేసు నామంలో, పాస్టర్ మైఖేల్ గారి యొక్క బోధనలు మరియు పుస్తకాలను వివిధ భాషలలో సరిగ్గా అనువదించడానికి సహాయం చేయి మరియు అవి ఆ భాషా సమూహాలకు సమర్థవంతంగా చేరునుగాక. ఆయన పుస్తకాలు, బోధనలు కోసం సరైన అనువాదకుల కోసం ప్రార్థిస్తున్నాము.

ప్రార్థన యోధులు
1. తండ్రీ, యేసు నామంలో, నేను ప్రతి నోహ్ యాప్ యొక్క ప్రార్థన యోధుడిని మరియు వారి కుటుంబాలను యేసు రక్తంతో కప్పుతున్నాను. నీ ఆశీర్వాదం వారిపై మరియు వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండును గాక.

2. తండ్రి, యేసు నామంలో, నోహ్ యాప్‌లో పంపిన ప్రార్థన విన్నపముల కోసం ప్రార్థన చేయడానికి వారి హృదయాలను కదిలించు. ప్రార్థన విన్నపము కోసం ప్రార్థన చేయడానికి వారికి సమయం మరియు కృపను దయచేయి. కృపగల దేవా, వారి ప్రార్థనలను ఆలకించు.

3. తండ్రీ, "కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు" అని నీ వాక్యం సెలవిస్తుంది. యేసు నామంలో, ఎక్కువ నోహ్ యాప్ ప్రార్థన యోధులను లేపు, తద్వారా వారు నోహ్ యాప్ లో అందుకున్న ప్రార్థన విన్నపముల కోసం హృదయపూర్వకంగా ప్రార్థించును గాక.

సిబ్బంది (స్టాఫ్)
1. తండ్రీ, యేసు నామంలో, కెఎస్ఎమ్ లోని ప్రతి సిబ్బంది దైవిక జ్ఞానం, అవగాహన మరియు వివేకంతో పనిచేయాలని ప్రార్థిస్తున్నాను. వారిలో సరైన సంభాషణ మరియు సమన్వయం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి సిబ్బందిపై నీ దయ మరియు కృప ఉండును గాక. 

2. తండ్రీ, యేసు నామంలో, ప్రతి సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు వ్యతిరేకంగా పనిచేసే శత్రువు యొక్క ప్రతి యుక్తి అగ్ని ద్వారా నిర్మూలించబడును గాక.

3. తండ్రి, యేసు నామంలో, కరుణ సదన్ పరిచర్యకు సంబంధించిన ప్రతి పరికరాలు చక్కగా పనిచేయడానికి సహాయం చేయి. ప్రతి పరికరాలను సరిగ్గా నిర్వహించి, నిల్వ చేయబడును గాక.
Join our WhatsApp Channel
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్