దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు- నీవు ఎవరు లేదా నీ గతం ఎలా ఉన్నా. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కోసం తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. "..... విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." అని బైబిలు చెబుతుంది. (యోహాను 3:16)
ప్రభువైన యేసు నీ కోసం మరియు నా కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఆయన మూడు రోజుల తరువాత మళ్ళీ లేచాడు, తద్వారా మనం ఆయనతో శాశ్వతమైన జీవితం గడపవచ్చు మరియు ఇక్కడ భూమిపై సమృద్ధిగా ఉన్న జీవితాన్ని కూడా అనుభవించవచ్చు. నీవు నీ జీవితంలోకి యేసుక్రీస్తును స్వీకరించాలనుకుంటే, ఈ క్రింది ప్రార్థనను బిగ్గరగా చెప్పు మరియు నీవు చెప్పే ప్రతి పదాన్ని అర్థం చేసుకో:
ప్రియమైన ప్రభువైన యేసు,
నిన్ను నా ప్రభువు, నా దేవుడు మరియు రక్షకుడిగా అంగీకరించడానికి నేను మీ ముందు సాగిలపడుతున్నాను. నేను నీ ముందు నా హృదయాన్ని అర్పింస్తున్నాను. నీవు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను. నా పాపాల కోసం నీవు మరణించావు. నీవు పాతిపెట్టబడితివి మరియు తండ్రి అయిన దేవుడు నిన్ను మృతులలోనుండి లేపెను.
నిన్ను బాధపెట్టడానికి నేను చేసిన ప్రతి పనులకు క్షమించు. నాపై కృప చూపు. నా పాపాలన్నిటినీ క్షమించు. నా హృదయంలోకి వచ్చి, నా జీవితంలో ప్రతి రంగంపై పూర్తి బాధ్యత వహించు.
నీ వాక్యానికి (బైబిల్) విరుద్ధమైన అన్ని కార్యకలాపాలు మరియు నమ్మకాలను నేను త్యజిస్తున్నాను. ఈ రోజు నుండి నేను ప్రభువైన యేసును వెంబడిస్తాను. నీ విలువైన రక్తంతో నన్ను శుద్దీకరించు. నన్ను నింపి నీ పరిశుద్ధాత్మతో ముద్ర వేయి.
నేను నూతన సృష్టిని. పాతవి గతించిపోయెను; ఇదిగో సమస్తము యేసు నామంలో క్రొత్త వాయెను. ఆమెన్.
గమనిక: నీవు ఈ ప్రార్థనను హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, నీవు ఇప్పుడు దేవుని కుటుంబంలో సభ్యులై, పరలోకంలో పౌరసత్వం పొందావు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నిత్యజీవము ఇచ్చాడు.
Join our WhatsApp Channel