తండ్రి,
నీ గొప్ప సన్నిధికై వందనాలు. నీ వాక్యము నా ఆత్మలో లోతుగా నాటబడును గాక. నీ వాక్యమును వినే వ్యక్తిగా కాకుండా చేసే వ్యక్తిగా ఉండడానికి నాకు సహాయం చేయి. అలాగే, నీ వాక్యాన్ని ధ్యానించడంలో నాకు సహాయపడు మరియు నీ సత్యం యొక్క శిల మీద నా జీవితాన్ని నిర్మించు.
నేను నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉందును. నేను చేయునదంతయు సఫలమగును. యేసు నామములో. ఆమెన్.
Join our WhatsApp Channel
