1. ఒయాసిస్ స్థలముపై యేసు విలువైన రక్తనికై మేము వేడుకుంటున్నాము. నీ దైవ రక్షణ దానిని దుష్ట శక్తులు లేదా ప్రభావాల నుండి కాపాడును గాక. నీ సన్నిధి ప్రతి అంశంలోనూ ఉండును గాక.
2. యేసు శక్తివంతమైన నామంలో, ఒయాసిస్ స్థలానికి వ్యతిరేకంగా, చుట్టుపక్కల ఉన్న ప్రతి దుష్ట శక్తులను నిర్మూలించమని మేము ఆజ్ఞాపిస్తున్నాం.
3. ప్రభువా, మేము పాస్టర్ మైఖేల్ గారిని మీ యందు తీసువస్తునాం. ఒయాసిస్ ప్రాజెక్ట్ గురించి ఆయన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనకు జ్ఞానం, వివేచన ఆత్మను దయచేయి. ఆయన ఎంపికలు యేసు నామంలో నీ పరిపూర్ణ చిత్తంతో సరితులును గాక.
4. పరలోకపు తండ్రీ, మేము ఒయాసిస్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్‌ను మీ చేతుల్లోకి సమర్పిస్తున్నాం. పాస్టర్ మైఖేల్ వారి ప్రతి దస్తావేజులు సరిగ్గా జరిగేలా చూసుకోవడానికి జ్ఞానం శ్రద్ధతో పాల్గొన్న వారికి శ్రేష్ఠత ఖచ్చితత్వాన్ని ప్రతిబింబిస్తూ మంజూరు చేయి.
5. తండ్రీ, యేసు నామంలో, ఒయాసిస్‌లో విత్తిన ప్రతి ఒక్కరి కోసం, వారిపై, వారికి చెందిన ప్రతిదాని మీద నీ ఆత్మ కదలనివ్వమని మేము ప్రార్థిస్తున్నాము. వారి భూములు, ఆస్తులు విడుదల చేయబడాలి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు విడుదల చేయబడాలి. నిరోధించబడిన ఆర్థిక సహాయం విడుదల చేయబడాలి. పత్రాలు విడుదల చేయబడాలి. యేసు నామంలో వారి కోసం దైవ తలుపులు తెరవబడాలి. వారు జీవుల దేశంలో నీ మంచితనానికి సాక్ష్యమివ్వాలి.
6. పరలోక తండ్రీ, యేసు నామంలో, ఒయాసిస్ ప్రాజెక్ట్ వైపు ఇచ్చే ఉదార దాతలను లేవనెత్తండి. నీవు సమృద్ధిగా అందించే మా ప్రభువు యెహోవా యీరే. మా సహాయం ఎక్కడి నుండి వస్తుందో, ప్రభువా, మేము నీ వైపు చూస్తున్నాము. పరలోకం భూమిని సృష్టించిన ప్రభువు నుండి మా సహాయం వస్తుంది.
7. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో కరుణ సదన్ పరిచర్య ప్రతి అవసరమును తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19)
8. ఓ దేవా, ఒయాసిస్ ప్రాజెక్ట్‌పై మేము నీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాము. తలుపులు తెరువు, అడ్డంకులను తొలగించు ప్రతి అంశంపై నీ కృపను ప్రకాశింపజేయి, తద్వారా విజయం, సమృద్ధి వచ్చును గాక.
Join our WhatsApp Channel