పాస్టర్ మైఖేల్ గారు మరియు కుటుంబ సభ్యులు అల్లెలుయా పరిచర్య ప్రవక్త ఆల్ఫ్ లుకావుతో కలిసి వరములు పొందే సమావేశం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళుతున్నారు దయచేసి ప్రార్థించండి.
రోమీయులకు 1:11 లో బైబిలు ఇలా చెబుతోంది "మీరు స్థిరపడవలెనని, ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను." దీని అర్థం ఆధ్యాత్మిక వరములు ఇవ్వవచ్చని. రోమీయుల సంఘంలోని శిష్యులకు కొన్ని ఆధ్యాత్మిక వరములు ఇవ్వాలని అపొస్తలుడైన పౌలు లోతుగా కోరుకున్నాడు. దేవుని పనిని దృడంగా స్థాపించడానికి ఇది జరిగింది. ఆల్ఫ్ లుకావు ప్రవక్తను మన తరం ప్రవక్తగా భావిస్తారు. ఆయన దేవుని ద్వారా శక్తివంతంగా ఉపయోగించబడుతున్నాడు. తన మాటల్లోనే, "వరములు పొందే సమావేశంలో దేవుడు మీకు ఏమి ఇస్తాడు అనేది ఏ బైబిల్ పాఠశాల మీకు ఇచ్చేదానికన్నా చాలా గొప్పది. నేను తీసుకువెళ్ళేదాన్ని ప్రపంచానికి ఇవ్వబోతున్నాను, ఆసియా ఎప్పటికీ ఒకేలా ఉండదు," అని అంటున్నాడు." కరుణ సదన్ పరిచర్య వందలాది మందిని దేవుని సన్నిధి సంతృప్తి పరచాలని పాస్టర్ మైఖేల్ గారికి లోతైన కోరిక ఉంది. ఈ ప్రవచనాత్మక వాక్యాన్ని పట్టుకొని, ఆయన దక్షిణాఫ్రికాకు ప్రయాణమయ్యాడు. దయచేసి మీరు ఉపవాసం ఉండి, ఆయన మరియు ఆయన కుటుంబానికి ఆత్మ యొక్క భారీ ప్రత్యక్షత లభించడానికి ప్రార్థిస్తారా? ఇప్పటి నుండి ప్రవచనాత్మక, స్వస్థత మరియు విమోచన వరములు ఆయనలో మరియు ఆయన ద్వారా మునుపెన్నడూ లేనంత గొప్ప కోణంలో పనిచేయడానికి మరియు కార్యం చేయడానికి ప్రార్థించండి. ఆయన వ్యక్తిగతంగా ప్రవక్త ఆల్ఫ్ లుకావు మరియు చార్లెస్ ప్రవక్తలను కలవడానికి మరియు వారితో సహవాసం చేయడానికి ప్రార్థించండి.
దక్షిణాఫ్రికాలో సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రార్థించండి. గుర్తుంచుకోండి, మీ ప్రార్థనలు మన ప్రియమైన పాస్టర్ మైఖేల్ గారి చేతిని తన రాజ్యం కోసం మరింత చేయటానికి బలపరుస్తాయి. (యాకోబు 5:16)
Join our WhatsApp Channel

కమెంట్లు