ఈ సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16, 2021న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మనము ప్రతిరోజూ తినడానికి లభించే అద్భుతమైన ఆహారాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాకుండా, ఒక రోజులో ఒక పూట కూడా తినడానికి కష్టపడే వారి గురించి అవగాహన కల్పించడానికి కూడా ఈ దినము గుర్తించబడింది.
ఈ రోజును మొదట నవంబర్ 1979లో స్థాపించారు. ఈ ఆలోచనను మాజీ హంగేరియన్ వ్యవసాయ మరియు ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమనీ సూచించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి.
ఆకలి మరియు పోషకాహార లోపానికి వ్యతిరేకంగా మన మందరం ఏకతాటిపైకి రావడానికి ఇది ఒక మంచి అవకాశం. పదండి ఆహారాన్ని వృధా చేయకూడదని ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ రోజున, వీధుల్లోని పేదలు మరియు నిరుపేదలకు ఆహారం పంపిణీ చేయడానికి మేము కరుణ సదన్ ఆలోచన చేసియున్నాము. మనకు మరియు మన ప్రియమైనవారికి ఆయన ఏర్పాటు చేసినందుకు దేవునికి కృతజ్ఞతస్తుతులు తెలుపుదాం.