భారతదేశంలో, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ రోజు మన విద్యావేత్తలను గౌరవించటానికి మరియు కృతజ్ఞతలు తెలియజేయడానికి జ్ఞాపకంగా చేసుకుంటారు, వారు వారి సూచనల ద్వారా మన గురించి మెరుగైన గుణం అభివృద్ధి చెందడానికి మనకు ఎంతో సహాయం చేసారు.
కరుణా సదన్ మినిస్ట్రీస్ ముంబై మరియు నవీ ముంబై ఉపాధ్యాయులకు ఒక ఈవెంట్‌తో ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి.
"యెహోవా పరిశుద్ధుడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద సింహాసనాసీనుడై ఉన్నాడు" (కీర్తనలు 22:3). కరుణా సదన్ ఆరాధన బృందం ఆయన నామాన్ని స్తుతిస్తుంది. దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి అక్కడ కనిపించింది.
పాస్టర్ మైఖేల్ గారు "గొప్ప ఉపాధ్యాయున్ని అనుకరించడం (వెంబడించడం)" అనే అంశం మీద శక్తివంతమైన వాక్యాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు.
అధ్యాపకులను సన్మానించి, అభినందించేందుకు కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభించబడింది.
అనంతరం అధ్యాపకులందరికి రుచికరమైన రస్మలై-కేక్ వడ్డించారు.
"ఒక సమయంలో ఒక బిడ్డను, ఉపాధ్యాయులు ప్రపంచాన్ని మారుస్తారు," అనే సామెత ఎంత ఖచ్చితమైనది. పాస్టర్ మైఖేల్ గారు మరియు పాస్టర్ అనిత గారు దాదాపు 50 సంవత్సరాలుగా పిల్లలకు విద్యను అందించడంలో శ్రీమతి థెరిసా గోయిస్ యొక్క నిజాయితీ ప్రయత్నాలను గుర్తించారు.
కరుణా సదన్ బృందం పాస్టర్ మైఖేల్ గారిని 23 సంవత్సరాల దేవుని వాక్యాన్ని బోధించినందుకు సత్కరించింది.
KSM స్కానింగ్ బృందం పాస్టర్ మైఖేల్ గారిని బహుమతితో సత్కరించింది
KSM సిబ్బంది పాస్టర్ మైఖేల్ గారిని పుష్పగుచ్ఛంతో సత్కరించారు
అల్పాహారం అందించారు. కరుణ సదన్ వాలంటీర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారు. మీకందరికి చాలా వందనాలు!!
ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన వారందరికీ అభినందనలు మరియు సన్మానానికి చిహ్నంగా పెన్నులు బహుకరించారు.
పాస్టర్ మైఖేల్ గారు ప్రభువా ఈ పెన్నులకు అభిషేకించమని ప్రార్థించారు
ఉపాధ్యాయులకు పెన్నులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు
మీరు ఈ పెన్నులను ఉపయోగిస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించండి. మీ సాక్ష్యం ప్రభువుకు మహిమను తీసుకొస్తుంది.
కార్యక్రమం ముగింపులో, పాస్టర్ మైఖేల్ గారు ఉపాధ్యాయులందరికీ వ్యక్తిగతంగా చేతులు ఉంచి ప్రార్థించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆత్మతో నింపబడ్డామని మరియు దేవుని శక్తిని అనుభవించామని చాలామంది సాక్ష్యమిచ్చారు.
అంతా సిద్ధంగా ఉంది!!🎊 బహుమతులు ప్యాక్ చేయబడ్డాయి మరియు ఉపాధ్యాయులందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్యక్రమమును విజయవంతం చేసినందుకు KSM సిబ్బంది మరియు వాలంటీర్‌లకు వందనాలు🥳
ఈ సాయంత్రం యొక్క మన అద్భుతమైన కార్యక్రమాల నిర్వాహకురాళ్ళు - అయేషా డిసౌజా ఉపాధ్యాయులను వారి కాలి మీద ఉంచడంలో అద్భుతమైన కార్యాన్ని నిర్వహించింది.
ఉపాధ్యాయుల దినోత్సవం నాడు సరదా సమయం - టోపీ ఆట
టోపీ ఆట విజేతలకు బహుమతులు అందజేస్తున్న పాస్టర్ అనిత గారు 🎩 విజేతలకు అభినందనలు 🥳
పాస్టర్ మైఖేల్ & పాస్టర్ అనిత గారు ఎక్కువ నామములు చెప్పిన ఉపాధ్యాయుల బృందంకు బహుమతులు ఇస్తున్నారు.
యేసయ్యకు ఇవ్వబడిన వివిధ నామములను మీరు చెప్పగలరా?
మన ఉపాధ్యాయులు చేసిన ఈ హెయిర్ స్టైల్‌లను (కేశాలంకరణ) గమనించండి! బోధన ఒక్కటే కాదు వారు 😁 కార్యక్రమములో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు🎉
ఒకరితో పంచుకున్నప్పుడే గెలుపొందడం ఉత్తమం!🤩
ఇదిగో మన....హెయిర్ స్టైల్ అట యొక్క విజేతలు💇🏻
డ్యాన్స్ ఆటలో గెలవడానికి ఉపాధ్యాయులు తమలోని పిల్లవాన్ని బయటకు తీశారు #teachersday #happyteacherday
డ్యాన్స్ ఆట విజేతలకు పాస్టర్ అనిత చేతుల మీదుగా బహుమతులు పొందుకున్నారు.🎉 ఉపాధ్యాయులను వారి కాలి మీద చూడటం చాలా సరదాగా ఉంది👯
అలాగే, ముంబైలోని బాంద్రాలోని వావ్ ఆరాధనలోని పిల్లలు అందరికంటే గొప్ప బోధకుడైన ప్రభువైన యేసయ్య యొక్క పాటలు పాడి ఆరాధించారు. వారు పాస్టర్ మైఖేల్ గారికి చేతితో తయారు చేసిన కార్డును కూడా అందించారు.
మా హృదయాలు, ప్రత్యేకించి విద్యార్థులకు గౌరవంగా మరియు గంభీరమైన సేవ చేసే వేలాది మంది నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుల పట్ల ఆనందముతో పులకరిస్తుంది. కార్యక్రమం ముగియగానే పాస్టర్ మైఖేల్ మరియు పాస్టర్ అనిత గారు ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.🙏
Join our WhatsApp Channel
కమెంట్లు