2023 లోకానికి కరువు సంవత్సరం కానుంది
a)అయితే, దేవుని ప్రజలకు, ఇది కేటాయింపు మరియు సమృద్ధిగా ఉంటుంది. కరువు సమయంలో, ప్రభువు రాజు బల్ల నుండి ఏలీయాకు పొందుపరిచాడు. ప్రభువు తన బల్ల నుండి తన ప్రజలకు అలౌకికంగా పొదుపరుస్తాడు.
b) 2023 సిద్ధపాటు సంవత్సరం కూడా. "ఇప్పుడు, యోవాషు రాజు ఇరవై మూడవ సంవత్సరం నాటికి, యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే యుండిరి" (2 రాజులు 12:6). ప్రభువులో మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను మీరు ఇకపై నిర్లక్ష్యం చేయకూడదు. ఇది రాప్చర్ (ఎత్తబడుట) కోసం కీలకమైన సిద్ధపాటు. మాకు ఖచ్చితమైన సమయం తెలియదు, కానీ ఇది మునుపటి కంటే దగ్గరగా ఉందని నా ఆత్మలో నేను భావిస్తున్నాను. రాప్చర్ను అపహాస్యం చేసే సాతాను ప్రతినిధుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
c) 2023లో సముద్రపు వాణిజ్య మార్గాలను బాగా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది.
D) సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవి పువ్వువలె ఉన్నది. (యెషయా 40:6) ప్రపంచమంతటా ప్రసిద్ధుడైన ఒక వ్యాపారవేత్త చనిపోతాడు. ఇది ఊహించని విధంగా ఉంటుంది మరియు చాలా మందికి ఆకస్మికంగా ఉంటుంది.
E) ప్రపంచవ్యాప్త కార్యకలాపాలతో నిర్వహిస్తున్న ఒక విమానయాన సంస్థ మూసివేయబడుతుంది. దానిని పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు విఫలమవుతాయి.
ప్రభువు అనుమతించినప్పుడు నేను మిగితా అనేక ఇతర విషయాలను పంచుకుంటాను.
KSM సంఘం కొరకు ప్రవచన వాక్యము
ఒక ముఖ్యమైన విషయం ఉంది మరియు ఇది ప్రత్యేకంగా కరుణా సదన్ సంఘపు వారికి సంబంధించిన వాక్యము.
లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును. (జెకర్యా 14:17)
భౌతిక పరిధిలో ఎటువంటి వర్షం కరువు లాంటి పరిస్థితిని తీసుకొస్తుంది. కానీ ఆత్మ యొక్క పరిధిలో వర్షం లేకపోవడం మరింత దారుణంగా ఉంది; అది మన జీవితములోని అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక వర్షం మనిషిని ఆధ్యాత్మికంగా ఎండిగా చేయదు. ఇది వారి బంధాలు, వారి కుటుంబాలు, వివాహం, పిల్లలు మొదలైన వాటి మీద ప్రభావం చూపుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
అలాగే, దేవుడు ఒక వ్యక్తికి మాత్రమే దేవుడు కాదు, సమస్త కుటుంబాలకు కూడా దేవుడు (యిర్మీయా 31:1). మనం ఆయనను ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా కుటుంబంతో సహా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. నోవహు జలప్రళయ సమయంలో, అతడు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని రక్షించాడు. జలప్రలయం తర్వాత ఓడలోంచి బయటకు వచ్చి కుటుంబ సమేతంగా ఆరాధించారు.
మోషే ప్రవక్త మొదటి నెల 1వ రోజు (అంటే నూతన దినాన రోజు) అరణ్యంలో దేవుని గుడారాన్ని మోశాడని మీకు తెలుసా?
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, "మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను." (నిర్గమకాండము 40:1-2, 17)
మీరు 1 జనవరి 2023న ఆరాధనకు మీ కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబ సమేతంగా ఆరాధించాలని ప్రభువు మీకు చెబుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు కొన్ని సర్దుబాట్లు చేయవలసి రావచ్చు, కానీ అప్పుడు ఆత్మ యొక్క వర్షం మీ మీద మరియు మీ కుటుంబం మీద కురుస్తుంది.
సంవత్సరంలో మొదటి రోజు మీ కుటుంబ సమేతంగా నూతనం సంవత్సర ఆరాధనలో ప్రభుని ఆరాధించడం ప్రభువుకు మొదటి ఫలము అర్పించడం లాంటిది. సంవత్సరాల తరబడి నిలిచి ఉన్న విషయాలు తిరిగి పునరుజ్జీవనం అవుతుందని దేవుని ఆత్మ చెబుతోంది.