నోహ్ యాప్ క్రైస్తవ సమూహానికి గొప్ప ఆశీర్వాదం, మరియు నూతన సంవత్సరం దినాన (1.1.2023), కరుణా సదన్ పరిచర్య వారి నూతన తమిళ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కరుణా సదన్ ద్వారా తమిళ యాప్‌ను ప్రారంభించడం తమిళ సంఘం ద్వారా KSMలో ఎంతో ఉత్సాహంతో జరిగింది. చాలా మంది ఇప్పటికే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు మరియు చురుకుగా పాల్గొంటున్నారు.
అనుదిన ప్రార్థనలు & ఒప్పుకోలు, స్తుతులు, ఈబుక్‌లు, నోహ్‌ట్యూబ్, ప్రార్థన విన్నపములు పంపడం, కలల నిఘంటువు, బైబిలు వ్యాఖ్యానం మరియు నోహ్గ్రామ్ వంటి ఫీచర్‌లు వేలమందికి ఒకేసారి పరిచర్య చేసే మొదటి సమగ్ర వేదికగా నిలిచింది.
తమిళంలో నోహ్ యాప్‌ని కలిగి ఉండటం వల్ల వారి జీవితాల్లో మార్పు వస్తుందని మరియు తమిళం భాష మాట్లాడే విశ్వాసి యొక్క నడకను ఈ క్రింది మార్గాల్లో అభివృద్ధిపరుస్తుందని మేము నమ్ముతున్నాము.
1. తమిళం మాట్లాడే విశ్వాసుల వృద్ధ కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి తమిళంతో మరింత సౌకర్యవంతంగా ఉండే తాతలు, ఇంగ్లీషులో పదాలు మరియు వాటి అర్థాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడకుండా నోహ్ యొక్క అన్ని ఫీచర్లు ఇప్పుడు సులభతరముగా ఉంటుంది. అనుదిన మన్నా మరియు కలల నిఘంటువు వంటి విభాగాలు దేవుని వాక్యం నుండి జ్ఞానము మరియు ప్రత్యక్షతను విలువైన ప్రజల సమూహాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాయి.
2. తమిళంలో సంభాషించడం మరియు చదవడం మరింత సౌకర్యవంతంగా ఉండే తల్లిదండ్రులు తమ పిల్లలకు అనుదిన ప్రార్థనలు మరియు ఒప్పుకోలు వారి మాతృభాషలో నేర్పించగలరు, ఇది వారి పిల్లల విశ్వాసాన్ని బలోపేతం చేయడమే కాకుండా పిల్లలు ఎంతో ఆదరించే అందమైన జ్ఞాపకాన్ని కూడా సృష్టిస్తుంది.
ఢిల్లీకి చెందిన నితిన్ ఇలా గుర్తుచేసుకున్నాడు: "చిన్నప్పుడు మా అమ్మతో నాకు కలిగిన తొలి మరియు అందమైన జ్ఞాపకాలలో ఒకటి ఆమె నాకు 23వ కీర్తనలు మరియు నా తల్లి దక్షిణ భారత మాతృభాషలో ప్రభువు ప్రార్థన నేర్పడం.
ఇంట్లో మరియు సెలవుల్లో ఆమె నాకు నేర్పించి, పునరావృతం చేసేది. ఆ ప్రయత్నాల వల్ల నాకు ఇప్పుడు 23వ కీర్తనలు మరియు ప్రభువు ప్రార్థన నా మాతృభాషలో తెలుసు."
3. తమిళం ఎక్కువగా ఉన్న తమిళనాడులోని గ్రామీణ మరియు పొలిమేర ప్రాంతాలలో నివసించే ప్రజలు ఇప్పుడు దేవునితో నడవడానికి వారికి సహాయపడే భారీ వనరులు మరియు సాధనాన్ని పొందగలరు. ప్రస్తుతం ఉన్న తమిళం మాట్లాడే సభ్యులు దేవుని గురించి మాట్లాడేందుకు ఉమ్మడి వేదిక మరియు భాషని కలిగి ఉన్నందున వారి సంఘంతో ఎక్కువ స్థాయిలో కలసి ఉండగలరు మరియు సంభాషించగలరు.
మీరు ఎలా సహాయం చేయవచ్చో ఇక్కడ తెలియజేయబడింది:
ఎ) అనుదిన మన్నాను (తమిళంలో) వారి కుటుంబాలు, స్నేహితులు మరియు బంధువులతో, ప్రత్యేకించి ఇంకా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండని వారితో పంచుకోండి. మీరు ప్రసార సమూహాలను చేయవచ్చు మరియు వాటిని మీకు నచ్చిన పరిచయాలతో ఒకేసారి భాగస్వామ్యం చేయవచ్చు. ప్రతిరోజూ మరియు తప్పకుండా చేయడం వలన అనేక ఆత్మలు ఇంకా క్రీస్తును కలుసుకోవడానికి సహాయపడతాయి.
బి) నోహ్ యాప్ మన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యంలో అనేకమందిని సంయోగము చేసి ప్రభావితం చేయాలని దయచేసి ప్రతిరోజూ ప్రార్థించండి.
సి) చివరగా, ఈ పరిచర్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఆర్థిక విత్తనాన్ని విత్తడం గురించి ఆలోచించండి.
Join our WhatsApp Channel
కమెంట్లు