శ్రీమతి రోజీ ఫెర్నాండెజ్ (పాస్టర్ మైఖేల్ గారి తల్లి) జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి 11న రోజీ డే జరుపుకుంటారు. ఆమె చాలా శక్తివంతమైన ప్రార్థన యోధురాలు మరియు ప్రవచనములో కదలింపబడుతుంది. ఆమె పాస్టర్ మైఖేల్ గారిజీవితం మరియు పరిచర్య మీద గొప్ప ప్రభావం చూపింది.
ఈ రోజున, పాస్టర్ అనిత, ఆరోన్, అబిగైల్ మరియు KSM వాలంటీర్లు కలిసి ముంబై నగరం అంతటా వివిధ ప్రాంతాలలో పేదలు, నిరాశ్రయులు మరియు అనాథలకు ఆహారాన్ని పంపిణీ చేశారు.
1. కుర్లా - హోలీ క్రాస్ చౌక్
పేదలు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేశారు. ఆహారంలో చికెన్ ఫ్రైడ్ రైస్, లడ్డూలు, కేక్ మరియు అరటిపండ్లు ఉన్నాయి. కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహోదరి.అనితా శెట్టి మరియు సహోదరుడు.అనిల్ శెట్టికి ప్రత్యేక వందనాలు.
2. స్నేహ సదన్ - జోగేశ్వరి
ఇది బాలుర అనాథాశ్రమం. అక్కడ అందరికీ చికెన్ బిర్యానీ పంచారు
3. స్నేహ సదన్ - అంధేరి
ఆహారాన్ని పంచడముతో పాటు, KSM వాలంటీర్లు గ్రహీతలతో సంభాషణలలో నిమగ్నమై, వారి కథలను వింటూ మరియు మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించారు. స్వచ్చంద సేవకుల మంచి మాటలకు మరియు వారి పోరాటాలలో తాము ఒంటరిగా లేమని గుర్తు చేసినందుకు చాలా మంది గ్రహీతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది విజయవంతమైన కార్యక్రమము, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలని మేము ఎదురుచూస్తున్నాము. దాతలు మరియు భాగస్వాములు, మీ త్యాగపూరిత మద్దతుకు వందనాలు.