"పేతురు చేప" అనే పేరు మత్తయి సువార్త 17:24-27లోని కథ నుండి వచ్చింది.

24 వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా చెల్లించుననెను.
25 అతడు ఇంటిలోనికి వచ్చి మాట లాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తిసీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? అని అడిగెను.
26 అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27 అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండు నట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచిన యెడల ఒక షెకెలు దొరుకును; దానిని తీసుకోని నా కొరకును నీ కొరకునువారికిమ్మని అతనితో చెప్పెను.


పేతురు చేపను తిలాపియా అని కూడా అంటారు. ఈ జాతి చేపలు సిచ్లిడే కుటుంబంలో భాగం మరియు వెచ్చని మంచినీటి రిజర్వాయర్‌లలో (గలీలీ సముద్రం వంటివి) దొరుకుతాయి.



అయితే పేతురు ఎలాంటి చేపలను పట్టుకున్నాడు? పేతురు పట్టుకున్న చేప ఏది అని మనము ఖచ్చితంగా చెప్పలేము, అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మీకు "పేతురు చేప” చాలా రుచికరమైన వంటకం అని నిరూపించబడుతుంది.
Join our WhatsApp Channel

కమెంట్లు