కరుణా సదన్ పరిచర్య ముంబై నగరంలోని వివిధ ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడంతోపాటు ఈ పిల్లలకు వారి చదువులో తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో దాదాపు 300 స్కూల్ బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేసింది.
ఇటువంటి ప్రోత్సాహకాల ద్వారా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ప్రేరేపించడం కూడా ఈ ప్రచారం యొక్క లక్ష్యం.
ముంబైలోని బాంద్రాలోని WoW-WJ ఆరాధనలో పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్ గారు పిల్లలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. రంగురంగుల స్కూల్ బ్యాగులను స్వీకరించి చిన్నారులు తమ ఆనందం వ్యక్తం చేశారు.
ముంబైలోని అంధేరిలోని కుటుంబ ఆశీర్వాద ఆరాధనలో పాస్టర్ మైఖేల్ గారు స్కూల్ బ్యాగులను పంపిణీ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు చదువులో రాణించాలని ప్రార్థించారు.
కుర్లాలోని హిందీ ఆరాధనలో పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్న పాస్టర్ అనితా ఫెర్నాండెజ్ గారు.
ముంబైలోని కుర్లాలోని ఇంగ్లీష్ ఆరాధనలో పాస్టర్ ఫ్రాన్సిస్ డిసౌజా మరియు పాస్టర్ వైలెట్ లోబో గారు పిల్లలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి పిల్లవాడి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది.
ముంబయిలోని కుర్లాలోని మరాఠీ ఆరాధనలో పాస్టర్ రోవేనా జాసింటో మరియు పాస్టర్ సిసిలియా సుతారీ గారు కూడా పిల్లలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చూశారు.
ముంబైలోని కుర్లాలోని కొంకణి ఆరాధనలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేస్తున్న పాస్టర్ మార్టిజా డయాస్.
పాస్టర్ మైఖేల్ గారి నుండి గమనిక:
“దీనిని చేయడానికి మాకు సహాయం చేసిన మీ త్యాగపూరిత కానుకుల కోసం నేను ప్రతి భాగస్వామికి మరియు దాతకు హృదయపూర్వకంగా వందనాలు చెప్పాలనుకుంటున్నాను.
రహస్యమందు చూచు దేవుడు మీకు బహిరంగంగా ప్రతిఫలమిస్తాడు. (మత్తయి 6:4). మీరు మీ జీవితంలో నూతన కాలములోకి ప్రవేశించారు. త్వరలో మీ జీవితంలో ఆయన కృప యొక్క ప్రత్యక్షతను మీరు చూస్తారు.
Join our WhatsApp Channel
కమెంట్లు